Crime News: భార్యతో భర్త రోత పుట్టించే పని.. పరాయి మగాళ్లతో పడక ఏర్పాట్లు, చాటుగా వీడియోలు
బెంగళూరులోని మండ్య ప్రాంతానికి చెందిన వినయ్ స్థానికంగా ఉన్న ఓ ఎలక్ట్రికల్ షాపులో సేల్స్ మేన్‌గా పని చేస్తుండేవాడు. అక్కడ అతడికి రామనగర ప్రాంతానికి చెందిన ఓ యువతి పరిచయమైంది.
భార్యను అంగట్లో ఉంచి ఆమెతో పరాయి వ్యక్తులు తన కోరికలు తీర్చుకొనేలా చేస్తున్న ఓ భర్తను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అతను ఏకంగా భార్య రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి విటులను ఆకర్షించేవాడు. భార్య మరో మగాడితో ఏకాంతంగా ఉండగా రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పైకి మంచివాడిలాగే కనబడే ఇతను చేస్తున్న పని తెలిసి స్థానికులు సైతం విస్తుపోయారు.
స్థానిక వార్తా పత్రికలు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని మండ్య ప్రాంతానికి చెందిన వినయ్ స్థానికంగా ఉన్న ఓ ఎలక్ట్రికల్ షాపులో సేల్స్ మేన్‌గా పని చేస్తుండేవాడు. అక్కడ అతడికి రామనగర ప్రాంతానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వారి ఇంట్లో విషయం చెప్పగా.. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో 2019లో పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం ఏడాదిన్నర కూతురు ఉంది. ప్రస్తుతం వీరు బెంగళూరులోని పరప్పన అగ్రహారానికి దగ్గర్లో సింగసాండ్రా అనే ప్రాంతంలో ఉంటున్నారు.
Also Read: Star Tortoise: నక్షత్ర తాబేళ్లతో లక్ష్మీ కటాక్షమంటూ ప్రజలకు పోలీస్ మస్కా
వీరిద్దరూ ఫోన్లలో అశ్లీల వీడియోలను చూడడం బాగా అలవాటు చేసుకున్నారు. ఆ వ్యసనమే ఆ భర్తకు చివరికి పైశాచికత్వానికి పాల్పడేలా దారి తీసింది. భార్య పరాయి మగవారితో ఏకాంతంగా ఉంటే చూడాలనే దరిద్రపు ఆలోచన అతనికి పుట్టింది. ఈ విషయంలో భార్యను రోజూ వేధించేవాడు. కొన్నాళ్లకు బలవంతంగా ఒప్పించి, పరాయి మగవారి వద్దకు పంపించేవాడు.. లేదా ఇతరులనే ఇంటికి రప్పించేవాడు. ఆ సమయంలో చాటుగా చూడడమే కాకుండా వీడియోలు, ఫోటోలు కూడా తీసేవాడు. ఇలా కొన్నాళ్లకు అతడు మరింత శాడిస్టులా తయారై ఏకంగా భార్య బికినీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పెట్టేవాడు. అలా విటులను ఆకర్షించి తన భార్యతో గడిపేలా చేసేవాడు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి అతడి పోస్టును పోలీసులకు పంపించగా.. వారు విటుల్లాగా నటించి.. నిందితుడ్ని ఉచ్చులో పడేశారు. చివరికి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
Also Read: భార్యను చంపబోతూ చెయ్యి కట్ చేసుకున్న భర్త.. దోషికి భారీ నష్ట పరిహారం ఇస్తూ కోర్టు తీర్పు!
Also Read: TRS News: చీప్ ట్రిక్స్, తప్పుడు రాజకీయాలు మానుకోండి.. ఆధారాలతో బీజేపీకి టీఆర్ఎస్ కౌంటర్