అన్వేషించండి

Crocodiles: చేపల వేటకు వెళ్లి అదృశ్యం, చివరకు మొసలి కడుపులో ప్రత్యక్షం

Crocodiles: ఆస్ట్రేలియాలో చేపల వేటకు వెళ్లి అదృశ్యమైన వృద్ధుడు మొసలి కడుపులో కనిపించాడు.

Man Found in Crocodiles: 


ఆస్ట్రేలియాలో ఘటన..

చేపల వేట కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. పోలీసులు ఎంత గాలించినా దొరకలేదు. ఎక్కడా కనిపించలేదు. చివరకు డెడ్‌బాడీ దొరికింది. ఎక్కడో తెలుసా..? రెండు మొసళ్లలో. ఈ షాకింగ్ ఘటన...ఆస్ట్రేలియాలోని నార్త్ క్వీన్స్‌ల్యాండ్‌లో జరిగింది. మూడు రోజుల క్రితం కెవిన్ డార్మొడీ చేపలు పట్టేందుకు ఓ చెరువులోకి వెళ్లాడు. అక్కడ మొసళ్లు కనిపించాయి. వెంటనే వాటిని తరిమి కొట్టాడు. అవి వెళ్లిపోయాక చేపలు పట్టడం మొదలు పెట్టాడు. ఆ పక్కనే ఓ పబ్ ఉంది. ఆ పబ్ మేనేజర్‌కి ఉన్నట్టుండి పెద్దగా అరుపులు వినిపించాయి. నీళ్ల చప్పుడు కూడా వినిపించింది. బయటకు వచ్చి చూసే సరికి ఆ వృద్ధుడు కనిపించలేదు. అక్కడ మొసళ్లు తిరుగుతున్న విషయాన్ని గుర్తించిన రేంజర్లు వెంటనే నీళ్లలోకి దిగారు. ఆ రెండింటినీ కాల్చి చంపేశారు. వాటిలో ఒకటి 14 అడుగుల పొడవు ఉండగా...మరోటి 9 అడుగుల పొడవు ఉంది. చేపల వేటకు వచ్చే వారిని ఇవి చంపేస్తున్నాయని గుర్తించారు. వేటాడి చంపేశారు. ఆ రెండు మొసళ్లను ఎగ్జామిన్ చేయగా...వాటి కడుపులో ఆ వృద్ధుడి శరీర భాగాలు కనిపించాయి. ఆ ప్రాంతంలో మొసళ్లు ఎక్కువ అని పోలీసులు వెల్లడించారు. అందుకే నీళ్లలోకి వెళ్లే ముందే జాగ్రత్త పడాలని సూచించారు. మొసళ్ల సంరక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అందుకే వాటి సంఖ్య పెరిగిపోయిందని తెలిపారు. 

మధ్యప్రదేశ్‌లో..

మొసలి ఓ పిల్లాడిని మింగేసిందన్న కోపంతో మొసలిని 7 గంటల పాటు బంధించారు గ్రామస్థులు. మధ్యప్రదేశ్‌లోని రఘునాథ్‌పూర్ గ్రామ ప్రజలు చేసిన ఈ పనికి అటవీ అధికారులు షాక్ అయ్యారు. మొసలి కాళ్లను కట్టేసి, నోరు మూసివేసే వీల్లేకుండా అలాగే 7 గంటల పాటు ఉంచారు. మొసలి కడుపులో ఉన్న బాలుడు బయటకి వస్తాడన్న నమ్మకంతో, అన్ని గంటల పాటు మొసలి నోరు మూయకుండా కట్టడి చేశారు. చంబల్‌ నదిలోకి స్నానం చేసేందుకు బాలుడు దిగాడని, ఆ సమయంలో మొసలి మింగేసిందని గ్రామస్థులు వాదిస్తున్నారు. మరో విచిత్రం ఏంటంటే మొసలి కడుపులో ఆ బాలుడు బతికే ఉన్నాడని ఫిక్స్ అయ్యారు అంతా. ఆ బాలుడి పేరు పిలుస్తూ, బదులు కోసం ఎదురు చూశారట. అప్పటికే అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు గ్రామస్థలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. "మీరు అనుకున్నది సాధ్యం కాదు" అని వివరించారు. గతేడాది జులైలో జరిగిందీ ఘటన. 

"నదీ తీరంలో బాలుడు స్నానం చేస్తున్నాడు. ఉన్నట్టుండి మొసలి దాడి చేసింది. మొసలికి చిక్కకుండా ఉండేందుకు చాలా వేగంగా ఈదాడు. అయినా మొసలి బాలుడిని పట్టుకుంది.  ఆ సమయంలో పిల్లాడు గట్టిగా అరిచాడు. వెంటనే మేమంతా ఇక్కడికి వచ్చాం" అని  వివరిస్తున్నారు స్థానికులు. వలల సాయంతో మొసలిని పట్టుకున్నారు. గ్రామస్థులకు నచ్చచెప్పి మొసలిని నీళ్లలో వదిలే సరికి, అధికారుల తలప్రాణం తోకకు వచ్చింది. అయితే మరుసటి రోజు ఆ బాలుడి మృతదేహం నదిలో కనిపించింది.

Also Read: Hit-And-Run Case: ఢిల్లీలో మరో హిట్ అండ్ రన్ కేసు, 3 కి.మీ. వరకూ కార్‌ రూఫ్‌పైనే బాధితుడు - తీవ్ర గాయాలతో మృతి

 

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget