అన్వేషించండి

Viral News: రెండు కుటుంబాల మధ్య భూ వివాదం, మహిళల్ని సజీవ సమాధి చేసేందుకు యత్నం

కుటుంబ భూ వివాదం నేపథ్యంలో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ స‌జీవ స‌మాధికి య‌త్నం. మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రం రేవా జిల్లాలో ఘ‌ట‌న‌.

Atempt to Burial of Women: ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను బ‌తికుండ‌గానే మ‌ట్టిలో పూడ్డిపెట్టిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌నంగా మారింది. వారిని శ‌రీరం స‌గం వ‌ర‌కు మ‌ట్టిలో పూడ్చిన‌ట్టుగా వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రేవా ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జరిగిన‌ట్టు తెలుస్తోంది. బాధిత మ‌హిళ‌ల‌ను మ‌మ‌తా పాండే, ఆశా పాండేగా గుర్తించారు పోలీసులు. ఈ ఘ‌ట‌న‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి మోహ‌న్‌యాద‌వ్ దర్యాప్తునకు ఆదేశించారు. నిందితుల‌ను క‌నిపెట్టి వారిని కూడా అదే విధంగా శిక్షించాల‌ని వారిని ఆదేశించారు.

భూ వివాదంగా తేల్చిన పోలీసులు

ఈ ఘ‌ట‌న స్థానికంగా కులాల మ‌ధ్య చిచ్చును ర‌గిల్చేలా ప‌రిణ‌మించ‌డంతో పోలీసులు వేగంగా స్పందించి రంగంలోకి దిగి నిందితుల‌ను గుర్తించారు. బాధితుల బంధువులు, పోలీసులు ఇచ్చిన స‌మాచారం ప్రకారం ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన నిందితులు ఒకే కులం వారేన‌ని తెలుస్తోంది. ప్ర‌ధాన నిందితులను గుర్తించారు. రెండు కుటుంబాల‌కు మ‌ధ్య తలెత్తిన స్థ‌లం వివాదంలో నిందితులు మ‌హిళ‌ల‌ను బ‌ల‌వంతంగా మ‌ట్టిలో పూడ్చి పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు పోలీసులు గుర్తించారు. దీనిలో కుల‌మ‌తాల ప్ర‌స్తావ‌నే లేద‌ని తేల్చారు. కుటుంబ స‌మ‌స్య‌ల‌ను కుల‌మ‌తాల వంటి సున్నిత అంశాల‌కు ముడిపెట్టి దుష్ప్ర‌చారాల‌కు పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. బాధితులు పొలంలో ఉండ‌గా లారీతో మ‌ట్టిని తెచ్చి వారి మీద కుమ్మురించిన‌ట్టుగా మ‌రికొన్ని వీడియోలు వెలుగుచూశాయి. పొలం ప‌నుల కోసం లారీల్లో మ‌ట్టిని తీసుకొచ్చారు. కాగా ఈ ప‌నుల‌ను మ‌హిళ‌లు అడ్డ‌గించ‌డంతో నిందితులు ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్టు తెలుస్తోంది. 

నిందితుల‌ను అరెస్టు చేశాం:  రేవా ఎస్పీ వివేక్ లాల్ 

ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన రేవా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఘ‌ట‌న కుటుంబ భూ వివాదానికి సంబంధించి చోటుచేసుకుంద‌ని చెప్పారు. నిందితుల్లో ఇప్ప‌టికే ఒక‌ర్ని అరెస్ట్ చేసి సెక్ష‌న్ 110 BNS ( నేర‌పూరిత హ‌త్యాయ‌త్నం) కింద కేసు న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. మ‌హిళ‌ల ప‌రిస్థితి సాధార‌ణంగానే ఉంద‌ని వెల్ల‌డించారు. వివరాల‌ను ఎక్స్‌లో వివ‌రించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget