Anatapuram News: అన్నా వదినలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరిది, అర్ధరాత్రి నిద్రలో ఘాతుకం!
Anatapuram Crime News: అన్నావదినలపై కోపం పెంచుకున్న ఓ యువకుడు.. నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలోనే మరో యువతికి కూడా గాయాలు అయ్యాయి.
Anatapuram Crime News: తాగుడుకు బానిసైన తమ్ముడిని పద్ధతి మార్చుకోవాలని చెప్పారు అన్నా వదినలు. దీంతో వారిపై తీవ్ర కోపం పెంచుకున్న అతగాడు.. అర్ధరాత్రి పడుకున్న అన్నా, వదినలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలోనే వారి పక్కనే పడుకున్న మరో యువతిపై కూడా పెట్రోల్ పడి నిప్పంటుకుంది. ఈ క్రమంలోనే ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
అనంతపురంలో జిల్లా తాడిపత్రిలో దారుణం చోటు చేసుకుంది. పారిశ్రామిక వాడలోని శ్రీనిధి నల్ల బండల పాలిష్ పరిశఅరమలో నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివాం రాత్రి పరిశ్రమ ఆవరణలో మంచంపై నిద్రిస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేసే మల్లికార్జున కుమార్తె పూజిత కూడా వీరి పక్కనే మంచం వేసుకొని పడుకుంది. రాత్రి 11.30 గంటల సమయంలో నల్లపురెడ్డి, సరస్వతి దంపతులపై రామేశ్వర్ రెడ్డి పెట్రోల్ పోశాడు. మెలుకువ వచ్చిన సరస్వతి ఏం చేస్తున్నావురా అని అరిచేలోగానే నిప్పంటించాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే నిద్రిస్తున్న పూజితకు కూడా మంటలు అంటుకొని చేతులు కాలాయి.
తాగుడుకు బానిసైన రామేశ్వర్ రెడ్డిని రెండు రోజుల క్రితం పద్ధతి మార్చుకోవాలంటూ అన్నా, వదినలు బెదిరించారు. అది మనసులో ఉంచుకొనే ఇలా చేశాడని నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు రూరల్ ఎస్ఐ గౌస్ మహమ్మద్ కు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సరస్వతి, నల్లపురెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పూజితకు తాడిపత్రి ప్రబుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ ఖమ్మంలోనూ ఇలాంటి ఘటనే..!
ఖమ్మం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కు చెందిన 24 ఏళ్ల లకావత్ స్నేహకు మహబూబాబాద్ జిల్లా గార్లల మండలం పోచారానికి చెందిన శ్రీధర్ తో 2021లో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. కొద్ది నెలల క్రితమే స్నేహ పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో పెద్ద మనుషుల పంచాయితీ పెట్టించి.. కూతురికి సర్ది చెప్పారు. మళ్లీ అత్తారింటికి పంపించారు. అక్కడకు వెళ్లిన తర్వాత కూడా భర్త, అత్త మామల్లో ఎలాంటి మార్పూ రాలేదు. వారు తీవ్రంగా వేధిస్తుండడంతో స్నేహ మూడు నెలల క్రితం మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఆమె ఇక్కేడ ఉంటోంది. ఈక్రమంలోనే శనివారం శ్రీధర్ విద్యానగర్ కు వచ్చాడు. అయితే ఆ సయమంలో ఇంట్లో భార్య స్నేహ, ఆమె చెల్లెలు నేహా, తమ్ముడు డేవిడ్ ఉన్నారు.
ఇటీవలే ఇంటికి వచ్చిన భర్త అన్నం పెట్టమని అడగడంతో.. స్నేహ ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలో తన వెంట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్ ను శ్రీధర్ తన భార్యపై చల్లి నిప్పంటించాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది గమనించిన బాధితురాలి చెల్లెలు వెంటనే జరిగినదంతా తల్లిదండ్రులకు ఫోన్ లో చెప్పింది. వారు వెంటనే వచ్చి కుమార్తెను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అప్పటికే స్నేహకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుందని, పరిస్థితి విషమంగా ఉందని స్నేహ తండ్రి సైదులు చెబుతున్నారు. ఈక్రమంలోనే చుంచుపల్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.