అన్వేషించండి

Agra Bathroom Murder Case: ఆగ్రాలో భర్తను చంపి బాత్‌రూమ్‌లోనే పూడ్చిపెట్టిన భార్య! 45 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం! 

Agra Bathroom Murder Case: ఆగ్రాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను చంపేసిన ఓ భార్య డెడ్‌బాడీని బాత్రూమ్‌లో పూడ్చిపెట్టింది. 45 రోజుల తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆగ్రాలో అదృశ్యమైన భర్త కోసం భార్య ఫిర్యాదు, నటించింది.
  • పోలీసుల దర్యాప్తులో భార్యనే భర్తను బాత్రూంలో పాతిపెట్టింది.
  • పోలీసులు డెడ్ బాడీని వెలికితీసి, రూబీని అరెస్ట్ చేశారు.
  • ఇది ఇలాంటి క్రూరమైన గత హత్య కేసును గుర్తుచేస్తోంది.

Agra Bathroom Murder Case: నేరం ఎప్పుడూ దాగదు అని పెద్దలు ఊరకే అనలేదు. ఎంతటి తెలివైన నేరస్థుడైనా ఏదో ఒక చోట చిన్న తప్పు చేస్తాడు, అదే అతడిని చట్టానికి చిక్కేలా చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళ కూడా భర్తను హత్య చేసి తప్పించకోవాలని చూసింది. కానీ ఆమె చేసిన తప్పు చట్టానికి పట్టించింది. కాబోయే భర్తను హత్యచేసిన సియా ఘటనపై చర్చ జరుగుతున్న టైంలో ఆగ్రా దుర్ఘటన చర్చనీయాంశంగా మారింది. 

ఆగ్రాకు చెందిన సురేంద్ర శర్మ అనే వ్యక్తి 45 రోజుల నుంచి కనిపించడం లేదు. తన భర్త కనిపించడం లేదని భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. రోజులు గడుస్తున్నా తన భర్త కనిపించడం లేదని బోరుమని శోకాలు పెట్టింది. పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకొని విచారించారు. 45 రోజుల తర్వాత కేసును ఛేదించారు. భార్యే తన భర్తను చంపేసిందని తేల్చారు. బాత్‌రూమ్‌లో పూడ్చిన సురేంద్ర శర్మ డెడ్‌బాడీని వెలికి తీశారు.  

కేసును ఎలా ఛేదించారు?

ఈ కేసును విచారిస్తున్న టైంలో సురేంద్ర శర్మ సోదరుడి చెప్పిన స్టేట్మెంట్‌ కీలక మలుపు తిప్పింది. సురేంద్ర శర్మ భార్యపైనే అతను అనుమానం వ్యక్తం చేశారు. అంతే అప్పటి నుంచి ఆమె విచారించడం మొదలు పెట్టారు.  అప్పటి వరకు దర్యాప్తుకు హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూనే పోలీసులను తెలివిగా తప్పు దాటి పట్టించింది. కొన్ని రోజుల తర్వాత పోలీసులు స్టైల్ మార్చి ప్రశ్నించారు. అంతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  

సురేంద్ర శర్మ అదృశ్యమైనట్లు 45 రోజుల క్రితమే రిపోర్ట్ అయ్యింది. ఈ హత్య అప్పుడే జరిగి ఉంటుందని తేలింది. ఈ కేసులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం రూబీ ప్రవర్తన. నేరం చేసిన తర్వాత ఆమె ఏమాత్రం భయపడకుండా, భర్త కోసం వెతుకుతున్నట్లు పోలీసులతో కలిసి తిరిగింది. ఇరుగుపొరుగు వారు తనను అనుమానించకుండా ఉండేందుకు వారి ముందు ఏడ్చేది. భర్తను కిరాతకంగా చంపేసింది. ఎవరికీ అనుమానం రాకుండా బాత్రూమ్‌లో గొయ్యి తవ్వు పూడ్చి పెట్టేసింది. దానిపై ఫ్లోరింగ్ వేసింది. పోలీసులు కేసును ఛేదించి ఫ్లోరింగ్ తీసి డెడ్‌బాడీని రికవరీ చేసుకున్నారు. ఒక మనిషిని చంపి, అదే ఇంట్లో శవంపై నడుస్తూ ఇన్ని రోజులు గడపడం ఆమెలోని నేరపూరిత మనస్తత్వానికి అద్దం పడుతోంది.

పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి పంపారు. నిందితురాలు రూబీని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కట్టుకున్న భార్యే కాలయముడిలా మారడం కుటుంబ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. నేరం ఎంత చాకచక్యంగా చేసినా, చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఈ ఘటన మరోసారి నిరూపించింది. 

ఈ కేసు 2025 ఫిబ్రవరిలో జరిగిన బ్లూ డ్రమ్ మర్డర్ కేసును గుర్తుకు తెస్తోంది. అప్పట్లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్ రాజ్‌పుత్ తన ప్రియుడితో కలిసి చంపి, శరీర భాగాలను కోసి ఒక నీలం రంగు డ్రమ్‌లో పెట్టి సిమెంట్‌తో సీల్ చేసింది. ఇప్పుడు ఆగ్రాలో జరిగిన ఈ బాత్‌రూమ్ హత్య కూడా అదే తరహాలో అత్యంత క్రూరంగా, పక్కా ప్రణాళికతో జరిగినట్లు కనిపిస్తోంది.

Frequently Asked Questions

ఆగ్రా బాత్‌రూమ్ హత్య కేసులో బాధితుడు ఎవరు, నిందితులు ఎవరు?

ఈ కేసులో సురేంద్ర శర్మ బాధితుడు. అతని భార్య రూబీ హత్యకు పాల్పడిన నిందితురాలు. ఆమె మొదట భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది.

సురేంద్ర శర్మ మృతదేహాన్ని ఎలా దాచిపెట్టారు?

నిందితురాలు రూబీ తన భర్త సురేంద్ర శర్మ మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టింది. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా ఫ్లోరింగ్ వేసింది.

పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు?

సురేంద్ర శర్మ సోదరుడు తన భార్యపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు రూబీని విచారించారు. ఆమె మొదట సహకరించినట్లు నటించి, తరువాత పోలీసులు శైలి మార్చి ప్రశ్నించగా నేరం ఒప్పుకుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget