అన్వేషించండి

Azad Encounter : మావోయిస్టు ఆజాద్ ఎన్ కౌంటర్ కేసు, ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు!

Azad Encounter : మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ పాండే ఎన్ కౌంటర్ కేసులో ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో పోలీసుల విచారణ ప్రారంభించాలని ఆదేశించింది.

Azad Encounter : మావోయిస్టు అగ్రనేత చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్ కౌంటర్ కేసును ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో తుది తీర్పును మంగళవారం న్యాయస్థానం వెలువరించింది. కేసుకు సంబంధం ఉన్న పోలీసులపై మూడు నెలల్లో విచారణ ప్రారంభించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత ఆదేశించినట్లు ఆజాద్ తరపు న్యాయవాది రహీం తెలిపారు. ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో 29 మంది పోలీసులను కోర్టు నిందితులుగా పేర్కోంది. మూడు నెలల్లోగా ప్రాసిక్యూట్ చేయాలని జిల్లా జడ్జి ఆదేశించారు. 

అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ 
జులై 1, 2010 సంవత్సరంలో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం సర్కెపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఎన్కౌంటర్ కేసు విచారణ జిల్లా న్యాయస్థానంలో ఇటీవల ప్రారంభమైంది. 2010లో జరిగిన ఎన్ కౌంటర్ లో చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ తో పాటు జర్నలిస్ట్ హేమచంద్ర పాండేలు ప్రాణాలు కోల్పోగా, ఆ తరువాత జిల్లా కోర్టు పోలీసులను దోషులుగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. అయితే పోలీసులు తిరిగి హై కోర్టును ఆశ్రయించగా.. పోలీసు అధికారుల విచారణను మరోసారి జిల్లా న్యాయస్థానంలో జరపాలని హై కోర్టు సూచనల మేరకు సెప్టెంబర్ లో జిల్లా కోర్టులో మళ్ళీ విచారణ ప్రారంభమైంది. ఆజాద్, హేమచంద్ర పాండే కుటుంబ సభ్యుల తరపు న్యాయవాదులు కోర్టుకు హాజరై తమ వాదనలు వినిపించారు. కాగా మంగళవారం తుది తీర్పు వెలువడగా పోలీసుల విచారణను మూడు నెలల్లో ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించింది.

సజీవంగా పట్టుకుని ఎన్ కౌంటర్! 

మావోయిస్ట్ అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానం ఇవాళ తుదితీర్పును వెలువరించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులపై మూడు నెలల్లో విచారణ ప్రారంభించాలని కోర్టు ఆదేశించింది.  2010లో సర్కేపల్లిలో మావోయిస్ట్ ఆజాద్ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆయనతో పాటు జర్నలిస్ట్ హేమచంద్ర పాండేను పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని, పోలీసులు వారిద్దరినీ సజీవంగా పట్టుకుని చిత్రహింసలు పెట్టారని, ఆ తర్వాత బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారంటూ ఆజాద్ భార్య పద్మ ఆరోపించారు.  ఆమెకు పౌర హక్కుల సంఘాలు మద్దతుగా నిలిచారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.  

సీబీఐ విచారణ కూడా 

సుప్రీంకోర్టు సూచనలతో బాధితులు ఆదిలాబాద్ కోర్టును ఆశ్రయించారు.  దీనిపై ఆదిలాబాద్ కోర్టులో విచారణ జరగగా కోర్టు తమ వాదనలు సరిగ్గా వినలేదని పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల వాదనలు వినాలని హైకోర్టు ఆదేశాలతో అదిలాబాద్ కోర్టు మరోసారి విచారణ చేసింది. అయితే ఈ కేసుపై సీబీఐ కూడా విచారణ నిర్వహించింది. సీబీఐ విచారణపై కూడా పౌర హక్కుల సంఘాలు అనుమానాలను వ్యక్తంచేశాయి. ఈ కేసులో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయాలని ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన జర్నలిస్టు హేమచంద్ర పాండే సతీమణి, ఆజాద్ సతీమణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే పోలీసులకు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడంపై 2012 ఏప్రిల్ 13న, స్వతంత్ర విచారణ జరిపించే విషయాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. సీబీఐ విచారణపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అనుమానాలు వ్యక్తం చేశారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget