Warangal News: భగ్న ప్రేమికుడు - అమ్మాయి మోసం చేసిందని రక్తం వచ్చేలా తల పగలగొట్టుకున్నాడు!
Crime News: వరంగల్ నగరంలో ఓ యువకుడు హల్చల్ చేశాడు. తాను ప్రేమించిన యువతి తనను మోసం చేసిందని తన తలను గోడకేసి కొట్టుకున్నాడు. చివరకు పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
![Warangal News: భగ్న ప్రేమికుడు - అమ్మాయి మోసం చేసిందని రక్తం వచ్చేలా తల పగలగొట్టుకున్నాడు! a young man broke his head after being cheated by a young woman in warangal Warangal News: భగ్న ప్రేమికుడు - అమ్మాయి మోసం చేసిందని రక్తం వచ్చేలా తల పగలగొట్టుకున్నాడు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/35b144214c661b7e77ff4a61416042501732544744480876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Young Man Broke His Head In Warangal: యువతి చేతిలో మోసపోయానని ఓ యువకుడు భగ్న ప్రేమికుడిలా మారాడు. తన తలను తానే రక్తం వచ్చేలా పగలగొట్టుకున్నాడు. ఈ ఘటన వరంగల్ (Warangal) నగరంలో ఆందోళన కలిగించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఎంజీఎం చౌరస్తాలో ఓ యువకుడు తనను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని హల్చల్ చేశాడు. గోడకు తన తలను రక్తం వచ్చేలా కొట్టుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు అతన్ని ఆపేందుకు యత్నించినా వినలేదు. ఈ క్రమంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అక్కడే విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్ పోలీస్ యువకుడిని పట్టుకుని నిలువరించి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పోలీసులు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
Also Read: Crime News: స్కూల్‌లో తీవ్ర విషాదం - చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)