Vizianagaram News: విజయనగరం జిల్లాలో కాలేజీ బస్‌ను ఢీ కొట్టిన టిప్పర్ - విద్యార్థులు క్షేమం- క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్
Bus Accident In Vizianagaram: విజయనగరం జిల్లా బోడిసింగిపేటలో కళాశాల బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యార్థులకు గాయలయ్యాయి. సీటులోనే ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను అతికష్టం మీద బయటకు తీశారు
![Vizianagaram News: విజయనగరం జిల్లాలో కాలేజీ బస్‌ను ఢీ కొట్టిన టిప్పర్ - విద్యార్థులు క్షేమం- క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ A tipper hit a college bus in Vizianagaram district Students were injured driver situation critical Vizianagaram News: విజయనగరం జిల్లాలో కాలేజీ బస్‌ను ఢీ కొట్టిన టిప్పర్ - విద్యార్థులు క్షేమం- క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/15/78238b2cc8c24c7d81d8c8fc298b9f5e1715753244801952_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh News: విజయనగరం(Vizianagaram ) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కళాశాల బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ సహా విద్యార్థులకు గాయాలయ్యాయి
బస్సులోనే ఇరుక్కున్న డ్రైవర్
విజయనగరం జిల్లాలో 26వ నెంబర్ జాతీయ రహాదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గజపతినగరం మండలం, బోడసింగిపేట సమీపంలో సెంచూరియన్(Centurion) యూనివర్సిటీ బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సీట్‌లోనే గాయలతో ఇరుక్కుపోయాడు. బస్సులో ఉన్న విద్యార్థులకు సైతం గాయాలయ్యాయి.
ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలు కావడంతో విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి గజపతినగరం(Gajapathinagaram) ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 12 మంది విద్యార్థులు ఉన్నారు. అతికష్టం మీద బస్సులో ఇరుక్కుపోయిన లారీని తొలగించి డ్రైవర్‌ను కాపాడి బయటకు తీశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)