అన్వేషించండి

Crime News: నగ్న వీడియోలు ఉన్నాయంటూ మహిళా టెకీని బెదిరించి రూ.2.5 కోట్లు కాజేసిన కేటుగాడు

Andhra Pradesh News | నగ్న వీడియోలు ఉన్నాయి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించి పలు దఫాలుగా మహిళా టెకీ నుంచి రూ.2.5 కోట్లు కాజేసిన నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

Hyderabad Crime News | హైదరాబాద్/నిడదవోలు: డబ్బులు ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను బెదిరించి, ఆమె నుంచి రూ.2.5 కోట్ల రూపాయలు కాజేశాడు. అయినా ఇంకా డబ్బులు కావాలని వేధింపులకు పాల్పడుతుంటే, ఇక భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే.. 
తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన యువతి చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. నగరంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఆఫీసుకు వెళ్తుంటుంది. అదే హాస్టల్‌లో ఉండే చిన్నప్పటి ఫ్రెండ్ కాజా అనూషదేవిని బాధితురాలు ఇటీవల ఆమెను కలిసింది. నినావత్‌ దేవనాయక్‌ అలియాస్‌ మధు సాయికుమార్‌ను తన భర్త అంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అనూషదేవి పరిచయం చేసింది. టెకీ సంపన్న కుటుంబానికి చెందిన యువతి అని తెలుసుకుని దేవనాయక్‌ డబ్బులు కాజేసేందుకు ప్లాన్ చేశాడు.

మహిళా టెకీకి ఫోన్ చేసి వీడియోలున్నాయని బెదిరింపులు

అనూషదేవి నుంచి మహిళా టెకీ నెంబర్ తీసుకున్నాడు దేవనాయక్. అది మొదలుకుని మహిళా టెకీకి ఫోన్ చేసి నీ నగ్న వీడియోలు నా వద్ద ఉన్నాయి.. వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేయకూడదంటే నాకు డబ్బులు ఇవ్వాలని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను డిమాండ్‌ చేశాడు. అతడి నెంబర్ టెకీ వద్ద లేకపోవడం, గొంతు మార్చి అపరిచిత వ్యక్తిలా మాట్లాడటంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ క్రమంలో టెకీని కలుసుకున్న దేవనాయక్.. ఆమె సమస్యను తాను పరిష్కరించినట్లు చెప్పి నమ్మించాడు. బ్లాక్ మెయిలర్ నుంచి ఆమెకు కాల్ రావొద్దంటూ తనకు నగదు ఇవ్వాలని పలుదఫాలుగా ఆమె నుంచి క్యాష్ తీసుకున్నాడు. ఇప్పటికే బాధితురాలు పలు విడతలుగా రూ.2.53 కోట్లకు పైగా నిందితుడికి ఇచ్చింది. అయినా ఆమెకు వేధింపులు ఆగలేదు.

నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
తనకు ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయగా, అందుకు ఆమె నిరాకరించడంతో మళ్లీ బెదిరింపులు మొదలయ్యాయి. తనకు న్యాయం చేయాలంటూ మహిళా టెకీ నిడదవోలు పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఫిబ్రవరి 2న గుంటూరు జిల్లా చిన్నకాకానిలో నిందితుడు దేవనాయక్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.81 కోట్ల మేర ఆస్తులు సీజ్‌ చేసినట్లు తెలిపారు. 

Also Read: Crime News: సొంత మేనత్తకు షాకిచ్చిన మేనకోడలు - ప్రియుడితో కలిసి రూ.15 లక్షలు, వెండి ఆభరణాలు చోరీ, అంత్యక్రియలకు వెళ్లినప్పుడు..

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Srikalahasti Temple Fire Accident: శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
Kishtwar Police: అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
Webland Records Tampering: వెబ్‌ల్యాండ్‌ రికార్డుల తారుమారు.. ఎన్‌ఐసీ లాగిన్ కొట్టేసి రూ.కోట్ల భూముల అక్రమార్జన.. నలుగురి అరెస్ట్!
వెబ్‌ల్యాండ్‌ రికార్డుల తారుమారు.. ఎన్‌ఐసీ లాగిన్ కొట్టేసి రూ.కోట్ల భూముల అక్రమార్జన.. నలుగురి అరెస్ట్!
Kolkata Sairang Express Derail: పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది
పట్టాలు తప్పిన కోల్‌కతా- సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు.. తప్పిన పెను ప్రమాదం- అసలేం జరిగింది

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Telangana IPS Transfers 2026: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఫైర్ సర్వీసెస్ డీజీగా సజ్జనార్!
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
Embed widget