అన్వేషించండి

Anantapur Crime News: లుంగీలో వేటకత్తి పెట్టుకొచ్చి భార్యను నరికేశాడు - తాడిపత్రిలో కిరాతక భర్త - సీసీ కెమెరాలో రికార్డయిన హత్య

Murder: ఆస్తి వివాదంలో భార్యను నరికేశాడు ఓ భర్త. తాడిపత్రిలో ఈ ఘోరం జరిగింది.

Tadipatri:  వివాహేతర బంధం పెట్టుకున్న ఓ భర్త ఆస్తి పంచాయతీలో భార్యను నరికి చంపేసి పరారైన ఘటన తాడిపత్రిలో జరిగింది. ఈ హత్య దృశ్యాలు సోషల్ మీడియాలో రికార్డయ్యాయి. కూర్చుని ఉన్న భార్యపై వేటకత్తితో వరుసగా  మూడు సార్లు నరికాడు. ఆమె కుప్పకూలిపోయిన తర్వాత పరారయ్యాడు. 

వివాహేతర బంధం పెట్టుకుని భార్యను దూరం పెట్టిన వెంకటేశ్వర్ రెడ్డి 

తాడిపత్రికి చెందిన పుష్పవతి, వెంకటేశ్వర రెడ్డి దంపతులు.  అయితే వెంకటేశ్వరరెడ్డి కొంత కాలంగా వేరే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ అంశంపై భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. రెండు కుటుంబాల మధ్య పంచాయతీలు కూడా జరిగాయి. ఎప్పటికప్పుడు భార్యను సరిగ్గా చూసుకుంటానని పెద్దలకు మాట ఇచ్చి వచ్చే వెంకటేశ్వరరెడ్డి తర్వాత మాట తప్పేవాడు. వివాహేతర బంధం పెట్టుకున్న మహిళ దగ్గరే ఉండేవాడు. చివరికి వెంకటేశ్వరరెడ్డి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. 

పెళ్లి సమయంలో ఇచ్చిన ఆస్తితో పాటు కొంత సొొమ్ము ఇవ్వాలని భార్య తరపు బంధువుల పంచాయతీ 

అయితే పెళ్లి సమయంలో ఇచ్చిన ఆస్తితో పాటు తనను మోసం చేసినందుకు..తన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన ఆస్తిని రాసివ్వాలని ఆమె పట్టుబడుతోంది. అయితే పెళ్లి సమయంలో ఇచ్చిన ఆస్తిని కూడా తిరిగి ఇచ్చేది లేదని వెంకటేశ్వర్ రెడ్డి చెబుతూ వసతున్నారు. ఈ అంశాన్ని పెద్ద మనుషుల వద్దకు తీసుకెళ్లారు.  ఆస్తి తగాదాల పంచాయతీ పై తాడిపత్రి పట్టణంలోని ఓ లాడ్జిలో పంచాయతీ పెట్టారు పెద్దలు. ఇరు వర్గాలకు చెందిన కుటుంబ పెద్దలు వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో భార్యభర్తలు కూడా వచ్చారు. భార్య పుష్పవతి కుర్చీలో కూర్చుని ఉన్న సమయంలో భార్య వెంకటేశ్వర్ రెడ్డి వచ్చి మాట్లాడాడు. మాట్లాడుతున్న సమయంలోనే వేటకత్తి బయటకు తీసి నరికేశాడు. 

Also Read: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్‌- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్

పరిష్కరించుకునేందుకు ఓ లాడ్జిలో రెండు కుటుంబాల పెద్దల సమావేశం         

వెంకేశ్వర్ రెడ్డి వేటకత్తి తీసి  నరికే ప్రయత్నం చేసినా ఆమె ఎదురు తిరగలేదు. ఎంత అయినా భర్త అని.. అలా మృగాన్ని చంపినట్లుగా నరికి చంపడని అనుకుని ఉటుంది అయితే భార్యపై అప్పటికే పూర్తి స్థాయి కోపాన్ని పెంచుకున్న వెంకటేశ్వరర్ రెడ్డి మూడు సార్లు మేకను నరికినట్లుగా నరికేసి అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య పుష్పవతి స్పాట్‌లోనే చనిపోయింది.

ప్లాన్డ్ గా వేటకత్తి తీసుకొచ్చి నరికేసిన వెంకటేశ్వర్ రెడ్డి    

ఈ హత్య దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వెంకటేశ్వర రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు పట్టుకునేందుకు గాలిస్తున్నారు. వివాహేతర బంధం మోజులో పడి భార్యను నరికేసి.. తాను జైలు పాలవుతున్నాడు వెంకటేశ్వరెడ్డి. ఆ కుటుంబం ఛిన్నభిన్నమైపోయింది.                         

Also Read: ట్రావెల్స్ సిబ్బంది అప్రమత్తతో బుక్కైన బీదర్ గ్యాంగ్- నోట్లు చూపించి బుట్టలో వేసేందుకు స్కెచ్‌

టాప్ హెడ్ లైన్స్

Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
Dog Kills Leopard Cub: కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
కుక్క పిల్లను చంపిన చిరుత.. గంటల వ్యవధిలోనే తల్లి కుక్క ప్రతీకారం!
Delhi Cafe Gang Assault: దిల్లీ కేఫ్ పార్టీలో యువతిపై సామూహిక అత్యాచారం.. తోటి ఉద్యోగులే అఘాయిత్యం.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురి అరెస్ట్!
దిల్లీ కేఫ్ పార్టీలో యువతిపై సామూహిక అత్యాచారం.. తోటి ఉద్యోగులే అఘాయిత్యం.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురి అరెస్ట్!
Hyderabad Crime News: హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
హైదరాబాద్‌లో పీజీ హాస్టళ్లపై ఈగల్ టీం మెరుపు దాడులు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
CM Revanth Reddy: 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
0 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Embed widget