అన్వేషించండి

Crime News: రంగారెడ్డి జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం- విద్యార్థులు, కార్మికులే టార్గెట్‌గా వ్యాపారం

Rangareddy District News: రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలో విక్రయించే చాక్లెట్ల గుట్టు వీడింది. గంజాయితో కలిపి చాక్లెట్లతో విక్రయించారని పోలీసుల విచారణలో తేలింది.

Rangareddy District Crime News: శంషాబాద్‌ పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం... గత కొద్ది రోజులుగా కొత్తూరు ప్రభుత్వ బడిలో విద్యార్థులు వింతగా ప్రవరిస్తున్నారని ఫిర్యాదు అందింది. వివరాలు సేకరిస్తే చాక్లెట్లు తిన్న తర్వాత నుంచి ఇది మొదలైందని ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పారు. దీనిపై ఆధారంగా కేసు రిజిస్టర్ చేసి చుట్టుపక్కల ఉన్న షాపుల్లో తనికీలు చేసిన పోలీసులకు షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

తనిఖీల్లో చాక్లెట్లు స్వాధీనం 

ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఉన్న దుకాణాలు, పాన్ డబ్బాలో తనిఖీలు చేపట్టారు. చార్మినార్‌ గోల్డ్ మునకా పేరుతో ఉన్న చాక్లెట్లు గుర్తించారు పోలీసులు. ఇందులో 42 చాక్లెట్లు ఉన్నాయి. పరీక్షలకు పంపిస్తే అందులో గంజాయి కలిసి ఉందని తేలింది. దీంతో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ చాక్లెట్ల ఖరీదు సుమారు లక్షన్నర ఉంటుందని అంచనా వేస్తున్నారు. Image

డబ్బు సంపాదన అక్రమ మార్గాలు

తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశాతో కొందరు వ్యక్తులు చేసిన పనిగా పోలీసులు గుర్తించారు. ఒడిశాకు చెందిన ధీరేంద్రబహేరా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. కొత్తూరు సమీపంలోనే ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. వచ్చే జీతం ఖర్చులకు సరిపోవడం లేదని అడ్డదారుల్లో సంపాదనకు అలవాటు పడ్డాడు. 

ఒడిశా గ్యాంగ్ అరెస్టు 

ఒడిశాకే చెందిన సోమ్‌నాథ్‌ బెహ్రేన్, సూర్యమనిసాహూతో కలిసి ధీరేంద్రబహేరా చాక్లెట్ల వ్యాపారం మొదలు పెట్టారు. చార్మినార్‌ గోల్డ్‌ మునకా పేరుతో ఉన్న చాక్లెట్లను ఇవ్వడం మొదలు పెట్టారు. నార్మల్‌గా అమ్మితే పోలీసులకు చిక్కుతామని గ్రహించిన ఈ గ్యాంగ్ స్కూల్స్‌ను టార్గెట్ చేసింది. ముందుగా ప్రభుత్వ పాఠశాలను ఎంచుకున్నారు. 

విద్యార్థులతో మొదలై కార్మికుల వరకు 

ముందుగా విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటారు. తర్వాత వాళ్లు తీసుకొచ్చిన చాక్లెట్లు ఫ్రీగా ఇచ్చారు. కాల క్రమేనే వాటిని అమ్మడం మొదలు పెట్టారు. ఒకసారి అలవాటు పడిన విద్యార్థులు పదే పదే అడిగేవాళ్లు ఇలా అడిగేవాళ్లకు ఒక్కో చాక్లెట్‌ 20 రూపాయలకు అమ్మేవాళ్లు. ఈ చాక్లెట్లను స్థానికంగా వివిధ కంపెనీల్లో పని చేసే కార్మికులకి కూడా అలవాటు చేశారు. 

విద్యార్థుల వింత ప్రవర్తనతో వెలుగులోకి 

చాక్లెట్లను విద్యార్థులకు, కార్మికులకు అలవాటు చేసిన ఈ గ్యాంగ్ క్రమంగా వ్యాపారాన్ని విస్తరించింది. స్కూల్, పరిశ్రమల సమీపంలోని పాన్ డబ్బాలతోపాటు కిరాణ దుకాణాలకి కూడా విక్రయించడం స్టార్ట్ చేసింది. అయితే కొత్తూరులో కొందరు విద్యార్థులు ఈ చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. గత కొన్ని రోజులుగా విద్యార్థుల ప్రవర్తనలో మార్పు గమనించిన ఉపాధ్యాయులకు అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. విద్యార్థులు తినే చాక్లెట్లు పరిశీలిస్తే వాళ్లకు ఏదో అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

ఈ గ్యాంగ్ విక్రయించే చాక్లెట్లు చూస్తే అందులో ఉత్తర్‌ప్రదేశ్ అడ్రెస్ఉంది. వీటిని ఎలా తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. వీళ్లేనా ఇంకా ఎవరైనా ఈ ముఠాలో ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి చాక్లెట్లు కానీ ఇతర పదార్థాలు కానీ అమ్ముతున్నట్టు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
Andhra Style Tomato Pappu : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Embed widget