అన్వేషించండి

Zomato IPO Listing: తారాజువ్వలా దూసుకుపోయిన జొమాటో షేర్లు.. కారణమేంటి?

తొలిసారి స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్టయిన జొమాటో షేర్లు తారాజువ్వలా దూసుకుపోయాయి. అందరూ ఊహించినట్లుగానే శుభారంభం చేశాయి. అసలు ఇంత డిమాండ్ కి కారణమేంటి?

స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైన తొలిరోజే జొమాటో (Zomato) షేర్లు దుమ్మురేపాయి. ఈ కంపెనీ షేరు ఐపీఓ ధర రూ.76 కాగా.. దాదాపు 52 శాతం ప్రీమియంతో సూచీల్లో రూ.116 వద్ద లిస్టయ్యింది. దీంతో 2020 తర్వాత ఐపీఓకి వచ్చిన సంస్థల్లో 50 శాతం ప్రీమియం లిస్టింగ్‌ సాధించిన 10 కంపెనీల జాబితాలో చేరింది. మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో సెన్సెక్స్‌లో జొమాటో షేరు ధర 62 శాతం ఎగబాకి రూ.123.35 వద్ద ట్రేడయింది. చివరికి షేర్ ప్రైజ్ రూ.126 వద్ద ముగిసింది.

మరోవైపు సంస్థ షేర్లు ఓ దశలో రూ.138కు చేరి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో సంస్థ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.లక్ష కోట్లను దాటింది. దీంతో బీఎస్‌ఈలో అత్యధిక విలువ కలిగిన తొలి 50 కంపెనీల సరసన చేరింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, బీపీసీఎల్‌, శ్రీ సిమెంట్స్‌ను దాటేయడం విశేషం.

ఎందుకింత డిమాండ్‌?

ఫుడ్‌ డెలివరీ రంగానికి చెందిన ఓ కంపెనీ ఐపీఓకి రావడం ఇదే తొలిసారి. అలాగే గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లలో పాజిటివ్‌ ట్రెండ్‌ నడుస్తుండడం జొమాటో (Zomato) శుభారంభానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి కంపెనీ విలువను ఎక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, అవేవీ షేరు దూకుడును అడ్డుకోలేకపోయాయి.

పెద్దగా లాభాలు లేకపోయినప్పటికీ.. పెట్టుబడుల్లో స్థిరత్వం కంపెనీపై సానుకూల ధోరణిని తీసుకొచ్చి పెట్టింది. గతంలో నష్టాల్లో ఉన్నప్పటికీ.. నిరంతరాయంగా పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ప్రస్తుతం మంచి వృద్ధిని సాధిస్తున్న విషయాన్ని మదుపర్లు పరిగణనలోకి తీసుకున్నట్లున్నారు. పైగా భవిష్యత్తులో ఇంటర్నెట్‌ ఆధారిత, ఫుడ్‌ డెలివరీ రంగానికి మంచి వృద్ధి ఉండనుందన్న అంచనాలు జొమాటో (Zomato) షేర్ల దూకుడుకు కారణమైనట్లు తెలుస్తోంది.

మరోవైపు లాభనష్టాలతో సంబంధం లేకుండా మార్కెట్‌లో జొమాటో (Zomato) తన ఉనికిని విస్తరిస్తూ పోయింది. 2018 ఆర్థిక సంవత్సరంలో 3.06 కోట్లుగా ఉన్న ఆర్డర్లు.. 2021 నాటికి 23.89 కోట్లకు పెరగడం విశేషం. మార్చి 2021 నాటికి భారత్‌లో 525 నగరాల్లో జొమాటో (Zomato) సేవలందిస్తోంది. మొత్తం 3,89,932 రెస్టారెంట్లు జొమాటోలో లిస్టయ్యాయి.

భారత్‌లో గత కొన్నేళ్లలో వచ్చిన జీవనశైలి మార్పులు ఫుడ్‌టెక్‌ కంపెనీలకు భారీ డిమాండ్‌ను తీసుకొచ్చి పెట్టాయి. అదే సమయంలో టెక్‌, ఇంటర్నెట్‌ ఆధారిత సేవలకు ఆదరణ పెరిగింది. వీటితో పాటు ప్రజల ఆహార అలవాట్లలో సైతం మార్పు వచ్చింది. ప్రజల వ్యయ ప్రాథమ్యాలు మారాయి. వీటన్నింటికీ తోడు ప్రభుత్వం డిజిటలైజేషన్‌ను భారీగా ప్రోత్సహిస్తోంది. ఈ పరిణామాలన్నీ జొమాటో షేరుపై ఆసక్తికి కారణమైనట్లు తెలుస్తోంది.

ALSO READ: 

PPF Investment: ప్రతి నెలా రూ.2 వేలతో 50 లక్షలు పొందండి ఇలా..!

టాప్ హెడ్ లైన్స్

AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Prime Minister Modi:
"రీల్స్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండండి" కేబినెట్ మంత్రులకు మరోసారి ప్రధాని మోదీ సలహా 
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Jana Nayagan Box Office Collection Day 2: 'జన నాయకుడు' కలెక్షన్లు... రెండో రోజు ఢమాల్... విజయ్ సినిమాకు భారీ డ్రాప్! 
కలెక్షన్లలో విజయ్‌కు భారీ దెబ్బ... వంద కోట్ల క్లబ్బులో 'జన నాయకుడు'... కానీ రెండో రోజు అంతేనా?
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
కన్వర్ యాత్రలో నిజమైన ప్రేమ: దివ్యాంగుడైన భర్తను 180 కి.మీ మోసిన భార్య!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
తొలి ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు తెలుసుకోండి!
Embed widget