By: ABP Desam | Updated at : 27 Apr 2023 11:26 AM (IST)
ఇవాళ విప్రో ఫలితాలు
Wipro Q4 preview: భారతీయ ఐటీ రంగంలోని అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన విప్రో, మార్చి త్రైమాసికం ఫలితాలను ఇవాళ (గురువారం, 27 ఏప్రిల్ 2023) విడుదల చేయబోతోంది. షేర్ బైబ్యాక్ (Wipro share buyback) ప్రతిపాదనను కూడా ప్రకటిస్తుంది.
కన్వర్షన్‌లో మందగమనం & కౌన్సెలింగ్ బిజినెస్‌లో బలహీనత కారణంగా, స్థిర కరెన్సీ (CC) ప్రాతిపదికన, నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి కాలం) స్వల్ప ఆదాయ వృద్ధిని విప్రో నివేదిస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది.
విప్రో గత అంచనా ఇది
మార్చి త్రైమాసికంలో, -0.6% - 1% రేంజ్‌లో QoQ ఆదాయ వృద్ధి ఉండొచ్చని గత ఫలితాల సందర్భంగా విప్రో మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఈ గైడెన్స్‌కు అనుగుణంగా, స్థిర కరెన్సీ ప్రాతిపదికన, నాలుగో త్రైమాసికంలో 0.5% QoQ వృద్ధిని విప్రో ప్రకటించవచ్చని బ్రోకరేజ్ జెఫరీస్ అంచనా వేసింది. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ మాత్రం -0.4% వృద్ధిని లెక్కగట్టింది.
1.2% QoQ ఆదాయ వృద్ధిని విప్రో రిపోర్ట్ చేస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ భావించింది.
బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈ IT మేజర్ ఎబిట్ (EBIT) మార్జిన్ 40 bps నుంచి 78 bps మధ్య ఉండే అవకాశం ఉంది. అధిక వినియోగం, కరెన్సీ ప్రాతిపదిక ప్రయోజనాల కారణంగా ఈ వృద్ధిని చూసే అవకాశం ఉంది.
బ్రోకరేజ్‌ల అంచనా ఇది
ఐదు బ్రోకరేజీల సగటు అంచనా ప్రకారం... మార్చితో ముగిసిన త్రైమాసికంలో విప్రో నికర లాభం స్వల్పంగా 2-4% మధ్య పెరుగుతుంది, ఆదాయ వృద్ధి 13% వద్ద ఉంటుంది.
మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ కాలం), విప్రో ఏకీకృత నికర లాభం 3% వృద్ధితో రూ. 3,053 కోట్లకు చేరుకోగా, ఆదాయం 14% పెరిగి రూ. 23,229 కోట్లకు చేరుకుంది.
నాలుగో త్రైమాసికం ఫలితాల వెల్లడి సమయంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి త్రైమాసికంలో ఆదాయ వృద్ధిపై కంపెనీ మేనేజ్‌మెంట్ ఏం చెబుతుందన్నది ముఖ్యంగా చూడాల్సిన విషయం. Q1FY24లో -1-2% ఆదాయ వృద్ధి కోసం గైడెన్స్ ఉండొచ్చని భావిస్తున్నారు.
ఫలితాల సమయంలో పెట్టుబడిదార్లు ట్రాక్ చేయవలసిన ముఖ్యాంశాలు:
1) FY24 ఆదాయం, మార్జిన్ ఔట్‌లుక్‌పై మేనేజ్‌మెంట్ వ్యాఖ్యానం
2) BFSI, కన్జ్యూమర్ వంటి కీలక విభాగాల్లో డిమాండ్ ట్రెండ్స్
3) అమెరికా, యూరోపియన్ బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో కౌన్సెలింగ్ వ్యాపారం ఔట్‌లుక్
4) ఉద్యోగ వలసలు (attrition), నియామక ప్రణాళికలు
5) డీల్ పైప్‌లైన్
ఇవాళ ఉదయం 10.35 గంటల సమయానికి, BSEలో, విప్రో షేర్లు ఫ్లాట్‌గా రూ. 374.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 4% నష్టపోయాయి, గత ఒక ఏడాది కాలంలో 29% తగ్గాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Manufacturing: తయారీ రంగంలో భారత్ భళా, డ్రాగన్ కంట్రీ డీలా
Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్
Stocks Watch Today, 30 May 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్లో ఉండే 'కీ స్టాక్స్' ITC, Vedanta, Adani Ports
CIBIL Score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ వస్తుంది! ఈ చిట్కాలు ప్రయోగించండి
Coin Deposit: బ్యాంక్ అకౌంట్లో ఎన్ని నాణేల్ని డిపాజిట్ చేయవచ్చు?
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !
Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు