(Source: ECI/ABP News/ABP Majha)
Vijayawada Railway Station : బెజవాడ రైల్వే స్ఠేషన్‌కు భారీ ఆదాయం - NSG 1 హోదా - అభివృద్ధికి మరింత అవకాశం
Vijayawada : విజయవాడ రైల్వే స్టేషన్ అధిక ఆదాయం సాధించి రికార్డు సృష్టించింది. NSG 1 హోదాను సాధించింది. దీని వల్ల మరింత అభివృద్ధి జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం సురేంద్ర పాటిల్ చెబుతున్నారు.
Vijayawada railway station gets NSG 1 catagory with 528 Cr income : దేశంలోనే విజయవాడ రైల్వే స్టేషన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారీగా రైళ్లు, ఆదాయం ఉండే స్టేషన్ విజయవాడ. దేశంలోని అన్ని కీలక ప్రాంతాలకు విజయవాడ నుంచి రైళ్లు ఉంటాయి. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ కొత్తగా మరో ఘనతను సాధించింది. NSG-1హోదాను సాధించింది.
దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ స్టేషన్‌కు మరో ఘనత
విజయవాడ రైల్వే స్టేషన్ ఆదాయం ఎంతో తెలుసా..అక్షరాలా 528 కోట్లు. ఆంధ్ర ప్రదేశ్ లో తమ పరిధి లోని రైల్వే స్టేషన్ లలో ఇంత ఆదాయం వేరే ఏ స్టేషన్ కూ లేదు. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ తెలిపారు. ఆదాయం ఐదువందల కోట్లు దాటడంతో విజయవాడ రైల్వే స్టేషన్ కు ప్రతిష్ఠాత్మక NSG -1 హోదా లభించింది. దక్షిణ మధ్య రైల్వే లో ఇంతకుముందు సికింద్రాబాద్ స్టేషన్ కు మాత్రమే ఈ హోదా ఉండేది. విశాఖ పట్నం రైల్వే స్టేషన్ కు కూడా ఈ హోదా లభించింది అనీ అయితే అది ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోనికి వస్తుంది ఆని రైల్వే శాఖ తెలిపింది.NSG-1 కేటగిరీ లో చేరాలంటే ఒక ఆర్థిక సంవత్సరం లో కనీసం 500 కోట్ల ఆదాయం లేదా రెండు కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు ఒక రైల్వే స్టేషన్ లో నమోదు కావాలి. అప్పుడే NSG -1 ( నాన్ సబర్బన్ గ్రూప్ ) కేటగిరీ ఇస్తారు.
కోటి 68 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు
ఈ విధానాన్ని 2017-18 లో ప్రవేశ పెట్టారు. అయితే విజయవాడ రైల్వే స్టేషన్ కొద్దిలో NSG -1 కేటగిరీ కోల్పోయి NSG 2 కేటగిరీ లోనే ఉండిపోయింది. ఐదేళ్ళ తర్వాత అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం లో మాత్రం ఏకంగా 528 కోట్ల ఆదాయం తో పాటు కోటీ అరవై ఎనిమిది లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు నమోదు కావడం తో తాజాగా NSG -1 కేటగిరీ నీ పొందింది. దేశం మొత్తం మీద కేవలం 28 రైల్వే స్టేషన్ లకు మాత్రమే ప్రస్తుతం ఈ హోదా ఉందని విజయవాడ DRM నరేంద్ర పాటిల్ చెప్పారు.
విజయవాడ స్టేషన్‌లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
విజయవాడ స్టేషన్ గుండా డైలీ..వీక్లీ ట్రైన్స్ అన్నీ కలిపి ప్రతీ రోజూ 250 రైళ్లు 70 వరకూ గూడ్స్ ట్రైన్ లూ రాకపోకలు సాగిస్తుంటాయి. దేశం లోని నార్త్,సౌత్,ఈస్ట్ భాగాలకు కేంద్రంగా విజయవాడ రైల్వే స్టేషన్ సేవలు అందిస్తుంది. అలాగే " దివ్యాంగ జన ఫ్రెండ్లీ స్టేషన్ " గా కూడా విజయవాడ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది. వారికోసం ప్రత్యేక లిఫ్ట్ లు, ఎస్కెలేటర్స్, వీల్ చైర్లు, మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి.
NSG 1 కేటగిరీ వల్ల ప్రయోజనాలు ఇవే
Nsg -1 కేటగిరీ వల్ల స్టేషన్ అభివృద్ధికి అదనపు బడ్జెట్ హైఫై వసతులు, డిమాండ్ కు తగినన్ని క్రొత్త రైళ్లు కేటాయింపు లాంటి ప్రయోజనాలు ఉంటాయి. ఏపీలో అతిముఖ్యమైన రైల్వే స్టేషన్ గా ఉన్న విజయ వాడ స్టేషన్ డెవలప్ మెంట్ కు ఈ కేటగిరీ రావడం చాలా అవసరం అని DRM నరేంద్ర పాటిల్ చెప్పారు.