అన్వేషించండి

Varroc Engineering Shares: వరోక్‌ ఇంజినీరింగ్‌ ఇన్వెస్టర్లు విలవిల, ఏడుపొక్కటే తక్కువ!

బంగారు గుడ్లు పెట్టే బాతును తక్కువ రేటుకే అమ్మడం బడా ఇన్వెస్టర్లకు నచ్చలేదు. షేర్ల అమ్మకం రూపంలో ఆ కోపాన్ని చూపించారు.

Varroc Engineering Shares: ఆటో కాంపోనెంట్స్ & ఎక్విప్‌మెంట్స్ కంపెనీ వరోక్ ఇంజినీరింగ్ షేర్ల పతనంతో ఇన్వెస్టర్లు ఇవాళ (శుక్రవారం) విలవిల్లాడారు. అమెరికా, యూరప్‌లో ఫోర్‌ వీలర్ లైటింగ్ వ్యాపారాన్ని పూర్తిగా అమ్మేసినట్లు ఈ కంపెనీ ప్రకటించడంతో ఇంట్రా డే ట్రేడ్‌లో కంపెనీ షేర్లు 9 శాతం పతనమై రూ.308.55కి చేరాయి. ఈ జులై 18 తర్వాత మళ్లీ ఇప్పుడు కనిష్ట స్థాయిలో ట్రేడవుతోంది.

ఎందుకు పతనం?
ఈ కంపెనీకి అమెరికా, యూరప్‌లో ఫోర్‌ వీలర్ లైటింగ్ వ్యాపారం ఉంది. ఈ కంపెనీ, నెదర్లాండ్‌కు చెందిన దీని అనుబంధ సంస్థ కలిసి ఈ వ్యాపారాన్ని వేల్ విజన్ S.A.S. ఫ్రాన్స్‌ (Vale Vision S.A.S. France) అనే కంపెనీకి అమ్మేశాయి. ఈ విక్రయంలోనే చిన్న తేడా జరిగింది. సవరించిన నిబంధనల ప్రకారం, ముందుగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు 600 మిలియన్‌ యూరోలకు కాకుండా, 520 మిలియన్‌ యూరోలకే అమ్మేసింది. 80 మిలియన్‌ యూరోల తక్కువకు అప్పగించేసింది. అంతేకాదు, వరోక్‌ ఇంజినీరింగ్‌ మొత్తం ఆదాయంలో ఈ యూనిట్ నుంచే సగానికి పైగా ‍(54 శాతం) వస్తోంది. బంగారు గుడ్లు పెట్టే బాతును తక్కువ రేటుకే అమ్మడం బడా ఇన్వెస్టర్లకు నచ్చలేదు. షేర్ల అమ్మకం రూపంలో ఆ కోపాన్ని చూపించారు. దీంతో, ఇవాళ ఈ కౌంటర్‌ 9 శాతం నష్టపోయింది, రిటైల్‌ ఇన్వెస్టర్ల జేబుకు చిల్లు పెట్టింది. ఇదీ కథ.

అమెరికా, యూరోప్‌లోని ఫోర్‌ వీలర్ లైటింగ్ వ్యాపారాన్ని అమ్మడం వల్ల, ఆ వచ్చే డబ్బుతో కంపెనీ బ్యాలెన్స్ షీట్, ఆపరేటింగ్‌ పెర్ఫార్మెన్స్‌ బలంగా ఉంటుందని  వరోక్ ఇంజినీరింగ్ తన FY22 వార్షిక నివేదికలో పేర్కొంది. అప్పులన్నీ తీరి డెట్‌-ఫ్రీ కంపెనీగా నిలబడతామని ఆ నివేదికలో కంపెనీ వెల్లడించింది. అంతేకాదు, ఆటోమోటివ్ ఇండస్ట్రీలో వచ్చే కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడి పెట్టడానికి, భవిష్యత్తులోనూ సిద్ధంగా ఉండటానికి తమ సామర్థ్యం మెరుగుపడుతుందని పేర్కొంది. 

ఫోర్‌ వీలర్‌ లైటింగ్‌ సెగ్మెంట్‌కు నీళ్లొదిలేసింది కాబట్టి.. ఇకపై ఎలక్ట్రానిక్‌ వెహికల్స్‌ విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్, కనెక్టివిటీ సొల్యూషన్స్, గ్లోబల్ టూ వీలర్ లైటింగ్ సెగ్మెంట్, భారతదేశంలో వ్యాపారాన్ని బలోపేతం చేయడంపై ఈ కంపెనీ ఫోకస్‌ పెంచుతుంది. 

గ్లోబల్‌ చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ, పరుగును ప్రారంభించే స్థానంలో భారతీయ వాహన పరిశ్రమ నిలబడి ఉందని ఉందని ఈ కంపెనీ విశ్వసిస్తోంది. రెండంకెల మార్జిన్ వృద్ధిని సాధించే బలమైన వేదికను భారతదేశ వ్యాపారం అందిస్తుందని  కంపెనీ.

అండర్‌పెర్ఫార్మర్‌
ఈ స్టాక్‌ ఒక అండర్‌పెర్ఫార్మర్‌. గత నెల రోజుల్లో, BSE సెన్సెక్స్‌లో 1.7 శాతం క్షీణతతో పోలిస్తే, ఈ స్టాక్ 20 శాతం పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 29న తాకిన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.495 నుంచి ఇప్పటి వరకు 38 శాతం క్షీణించింది. 

గత ఏడాది నవంబర్ 12న, 52 వారాల కనిష్ట స్థాయి రూ.274.45కి ఇది చేరింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget