డబ్బులు కుమ్మరిస్తున్న అమెజాన్, భారత ఈ-కామర్స్ వ్యాపారంలో విధ్వంసానికి సిద్ధం
అమెరికాకు చెంది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారతీయ వ్యాపారంలోకి కొత్తగా నిధులను అందించింది. దీంతో దేశీయంగా పెద్ద పోటీకి సిద్ధమౌతోంది.
Amazon News: అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం జొమాటో పోటీ విషయానికి వస్తే అస్సలు తగ్గేదే లే అంటోంది. వాస్తవానికి భారతదేశంలో విస్తృత వ్యాపారం కలిగిన కంపెనీ పోటీదారు వాల్‌మార్ట్ తో యుద్ధానికి సిద్ధమని సంకేతాలు అందిస్తోంది.
ఈ గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన భారతీయ వ్యాపార సమూహంలో తాజాగా రూ.1,600 కోట్ల మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టింది. ఈ-కామర్స్ కంపెనీలు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి, నిరంతరం అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో పోటీదారులతో ఒకటిగా ఉండటానికి పోరాడుతున్న సమయంలో అమెజాన్ అవసరమైన నిధులను అందించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం వెల్లడైంది. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే భారత్‌లోని తన విభాగమైన అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌లోకి అమెజాన్ డబ్బును పంప్ చేయడం రెండవసారి కావటం గమనార్హం.
ఈ క్రమంలో అమెరికా దిగ్గజం అమెజాన్ స్వదేశీ ఈ-కామర్స్ జైంట్ ప్రత్యర్థి అయిన ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ 600 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన కొద్ది వారాలా తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. అమెజాన్ తాజా పెట్టుబడులకు సమానమైన 166 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను భారత వ్యాపార యూనిట్ నుంచి పొందినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం వెల్లడైంది. ఈ షేర్లు అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, Amazon.com.incs లిమిటెడ్ అందుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో గ్లోబల్ ఎంటిటీ నుంచి రూ.830 కోట్లను అందుకున్న కొన్ని నెలలకే ఇ-కామర్స్ మేజర్ భారతీయ విభాగమైన అమెజాన్ సెల్లర్ సర్వీసెస్‌లోకి తాజా మూలధన ప్రవాహం వచ్చింది.
భారత వ్యాపారంలో తాజా పెట్టుబడి అమెజాన్ ప్రణాళికలకు అనుగుణంగా ఉంది. సియాటిల్ ఆధారిత టెక్ టైటాన్ 2030 నాటికి భారతదేశంలో అదనంగా $15 బిలియన్లు పెట్టుబడి పెడుతుందని అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ వెల్లడించారు. దీంతో ఇండియాలో మెుత్తం పెట్టుబడి 26 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుత దశాబ్దం చివరి నాటికి భారతదేశంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ పేర్కొన్న $12.7 బిలియన్ల పెట్టుబడులు ఇందులో భాగంగా ఉన్నాయి.
అమెరికాకు చెందిన దిగ్గజ రిటైల్, ఈ కామర్స్ సంస్థలకు చెందిన ఆటగాళ్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు భారతదేశంలో తీవ్రమైన పోటీలో ఉన్నాయి. పెరుగుతున్న మార్కెట్లలో ఎక్కువ వాటాను పొందాలని వీరు చూస్తున్నారు. ఈ క్రమంలో మాతృసంస్థలు అవసరమైన నిధులను అందించి పెద్ద యుద్ధానికి తెరతీశాయి. ఇదే క్రమంలో రెండు కంపెనీలు ఈ-కామర్స్ వ్యాపారంలో వేగంగా దూసుకుపోతున్న భారతీయ సంస్థ మీషో సైతం 500-650 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమకూర్చుకుంటున్న వేళ పెట్టుబడుల వేడి రాజుకుంది. అమెజాన్ ఇటీవల బజార్‌ను ప్రారంభించడంతో కొత్త పెట్టుబడి కూడా వస్తుంది. ఇది సాఫ్ట్‌బ్యాంక్-మద్దతుగల మీషోతో నేరుగా పోటీపడుతోంది.