UPI Transaction Limit: యూపీఐ యూజర్లకు షాక్, త్వరలో లావాదేవీలపై పరిమితులు విధించే అవకాశం!
మీరు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సహా ఇతర యూపీఐ యాప్స్ వాడుతున్నారు. అయితే మీకో షాకింగ్ న్యూస్. త్వరలో యూపీఐ లావాదేవీలపై పరిమితులు విధించే అవకాశం ఉంది.
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత్ లో డిజిటల్ పేమెంట్స్ పెద్ద సంఖ్యలో పెరిగాయి. 2016లో డీమానటైజేషన్ జరిగిన సమయంలో కేవలం పేటీఎం మాత్రం అతి కొద్ది మందికి తెలుసు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులకు మొగ్గు చూపారు. రాను రాను జేబులో డబ్బులు తీసుకెళ్లడమే జనాలు మర్చిపోయారు. పది రూపాయలకు కూడా ఫోన్ తీసి డబ్బులు పంపిస్తున్నారు. ఇప్పుడు డిజటల్ లావాదేవీలు పడపని కిరణా దుకణాం కూడా లేదంటే ఏ రేజింలో డిజిటల్ చెల్లింపులకు జనాలు అలవాటు పడ్డారో అర్థం చేసుకోవచ్చు.
యూపీఐ చెల్లింపు యాప్స్ వినియోగదారులకు షాక్!
అయితే. త్వరలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం సహా ఇతర యూపీఐ చెల్లింపు యాప్ లు వినియోగదారులకు షాకింగ్ విషయాన్ని చెప్పే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్న అపరిమిత చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇకపై పరిమిత చెల్లింపులకే అనుమతి ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరికొత్తి రోజుల్లోనూ యూపీఐ చెల్లింపులపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. వినియోగదారులు ఇకపై నచ్చినంత డబ్బు పంపిచుకునే అవకాశం ఉండదు.
30 శాతానికి యూపీఐ పేమెంట్స్ కుదింపు
డిజిటల్ చెల్లింపుల విషయంలో పరిమితులపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. NPCI అనేది దేశంలోని UPI లావాదేవీలను మానిటరింగ్ చేస్తోంది. ఇప్పుడు చేస్తున్న డిజిటల్ పేమెంట్స్ తో పోల్చితే యూజర్ల వాల్యూమ్ క్యాప్ ను కేవలం 30 శాతానికి కుదించనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిమితులును డిసెంబర్ 31 నుంచి అమలు చేయడానికి ఆర్బీఐ తో చర్చలు జరుపుతోంది.
యూపీఐ పేమెంట్స్ పరిమితులపై కీలక చర్చ
డీమానటైజేషన్ తర్వాత డిజిటల్ పేమెంట్స్ పెరిగినా, లావాదేవీల విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. ప్రస్తుతం దేశంలో ఎక్కువ శాతం డిజిటల్ లావాదేవీల కోసం గూగుల్ పే, ఫోన్ పే మీద ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. సుమారు 80 శాతం మంది ఈ యూపీఐ యాపులను వాడుతున్నారు. అయితే, ఆయా యాప్స్ యోక్క మోనోపల్లిని తగ్గించేందుకు థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ల (TPAP) కోసం NPCI 30 శాతానికి లావాదేవీల పరిమితిని తగ్గించేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ విషయంపై కీలక చర్చ జరిగింది. ఎన్‌పీసీఐ అధికారులు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ అధికారులు కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు యూపీఐ మార్కెట్ క్యాప్ అమలుపై NPCI నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల్లో మూడో స్థానంలో ఉన్న పేటీఎం మార్కెట్ క్యాప్ అమలు చేయాలని కోరుతుండగా, ఫోన్ పే, గూగుల్ పే మాత్రం మూడు సంవత్సరాల తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి.
Read Also: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసా? ఇలా చేస్తే ఈజీగా తెలిసిపోతుంది