By: ABP Desam | Updated at : 02 Jan 2023 02:54 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎలన్ మస్క్
Twitter, Elon Musk:
ఎలన్ మస్క్ ఏ ముహూర్తాన ట్విటర్ కొనుగోలు చేశాడో తెలీదు గానీ కంపెనీ నిత్యం వార్తల్లోనే ఉంటోంది! కంపెనీని స్వాధీనం చేసుకున్న వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్‌ను తొలగించాడు. నష్టాలను తగ్గించేందుకు చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాడు. ప్రస్తుతం 50 శాతం మందే పనిచేస్తున్నారు. జీతాలు పెంచాలని నిరసనలకు దిగిన పారిశుద్ధ్య కార్మికులనూ తీసేయడంతో ఇప్పుడు బాత్‌రూమ్‌లు కంపు కొడుతున్నాయట!
ట్విటర్ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేయడం లేదు. దాంతో బాత్‌రూమ్‌లు, లెట్రిన్లు శుభ్రం చేసే సిబ్బంది లేకుండా పోయారు. కనీసం పనిచేస్తున్న చోటునూ ఎవరూ శుభ్రం చేయడం లేదు. దాంతో రెస్ట్ రూమ్‌ల నుంచి ఆఫీస్ వరకు అంతా కంపు వాసన కొడుతోందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
'పాచిపోయిన ఆహారం, శారీరక దుర్వాసనతో ఆఫీస్ నిండిపోయింది. ఎందుకంటే శుభ్రం చేసేవాళ్లెవరూ లేరు. కలరా ఉండలు వేయడం లేదు. టాయిలెట్ పేపర్‌ను తెచ్చుకోవాలని ఉద్యోగులకు చెప్పారు. కార్యాలయ భవంతిలో నాలుగు ఫ్లోర్లు మూసేశారు. ఉద్యోగులంతా రెండు ఫ్లోర్లలోనే కిక్కిరిసిపోయారు' అని ఒకరు తెలిపారు.
అద్దె చెల్లించకపోవడంతో సియాటెల్ కార్యాలయంలోని ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని చెప్పారు. కేవలం న్యూయార్క్, సాన్ ఫ్రాన్సిస్కోలోనే ఆఫీసులు తెరిచారు. న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో సెక్యూరిటీ, పారిశుద్ధ్య కార్మికుల్ని వెళ్లిపోవాలని మస్క్ ఆదేశించినట్టు తెలిసింది. ఖర్చులు తగ్గించాలని మిగిలిన మేనేజర్లనూ ఆదేశించాడని సమాచారం. దాంతో జీరో బేస్డ్ బడ్జెట్‌లో భాగంగా కార్యాలయ నిర్వహణ అస్తవ్యస్థంగా మారినట్టు సమాచారం.
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!
Auto Stocks to Buy: బడ్జెట్ తర్వాత స్పీడ్ ట్రాక్ ఎక్కిన 10 ఆటో స్టాక్స్ ఇవి, వీటిలో ఒక్కటైనా మీ దగ్గర ఉందా?
Stock Market News: స్టాక్ మార్కెట్లో అదానీ షేర్ల కిక్కు - సెన్సెక్స్ 377, నిఫ్టీ 150 అప్!
Cryptocurrency Prices: మిశ్రమంగా క్రిప్టోలు - బిట్‌కాయిన్ ఏంటీ ఇలా పెరిగింది!
Coin Vending Machines: దేశంలో తొలిసారిగా కాయిన్ మెషీన్స్, చిల్లర సమస్యలకు చెక్
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ