అన్వేషించండి

Titan Company Shares: పండుగ సందడంతా టైటన్‌దే, ₹2,800 టచ్‌ చేసే ఛాన్స్‌!

ఇంట్రా డే ట్రేడ్‌లో టైటన్ కంపెనీ షేర్లు 6 శాతం ర్యాలీ చేసి రూ.2,744.30కి చేరుకున్నాయి.

Titan Company Shares: సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2FY23), వివిధ వ్యాపార విభాగాల్లో రెండంకెల వృద్ధిని సాధించామని, మొత్తం అమ్మకాలు గతేడాది (YoY) కంటే 18 శాతం వృద్ధి చెందాయని టాటా గ్రూప్‌ కంపెనీ టైటన్‌ ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు ధగధగలాడుతున్నాయి. 

శుక్రవారం నాటి వీక్‌ మార్కెట్‌లోనూ, ఇంట్రా డే ట్రేడ్‌లో టైటన్ కంపెనీ షేర్లు 6 శాతం ర్యాలీ చేసి రూ.2,744.30కి చేరుకున్నాయి. మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి 4.91% వృద్ధితో రూ.2,720.95 దగ్గర ఉన్నాయి.

ఈ స్టాక్ ఈ ఏడాది మార్చి 21న రూ.2,767.65 వద్ద రికార్డ్‌ గరిష్ట స్థాయిని తాకింది. ఇవాళ ఆ స్థాయికి దగ్గరగా ట్రేడవుతోంది. ఇంట్రా డే గరిష్టం రూ.2,744.30.

ప్రస్తుత పండుగ సీజన్‌ ఈ స్టాక్‌కు స్ట్రాంగ్‌ ట్రిగ్గర్‌. కొనుగోళ్లు పెరగడంతో బిజినెస్‌ ఔట్‌లుక్ భలే ఆశాజనకంగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో, తన రిటైల్ నెట్‌వర్క్‌కు మరో 105 స్టోర్‌లను జోడించి, విస్తరణలో వేగాన్ని ఈ కంపెనీ కొనసాగించింది. 

Q2FY22 హై బేస్‌ ఉన్నా, ఆభరణాల విభాగం YoYలో 18 శాతం ఆదాయ వృద్ధిని సాధించిందని కంపెనీ ప్రకటించింది. 

గడియారాల విభాగం కూడా 20 శాతం (మూడేళ్ల CAGR: 5%) టాప్‌లైన్ వృద్ధితో ఆరోగ్యకర పరుగును కొనసాగించింది. క్యారట్‌లేన్ (CaratLane - ఇందులో టైటన్‌కు 72 శాతం వాటా ఉంది) కూడా 56 శాతం వార్షిక అమ్మకాల వృద్ధితో జోరు చూపిస్తోంది.

ఈ స్టాక్‌ రీసెంట్‌ పాస్ట్‌ పరమ చెత్తగా ఉంది. గత నెల రోజుల కాలంలో ఇది 3 శాతం మాత్రమే పెరిగింది. గత ఆరు నెలల కాలంలో దాదాపు 11 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) దాదాపు 8 శాతం జూమ్‌ అయింది. 

"V" షేప్‌ రికవరీ
ఈ ఏడాది మార్చి 21 నాటి రూ.2,767.65 రికార్డ్‌ స్థాయి (52 వారాల గరిష్టం) నుంచి ఇది నిట్టనిలువుగా పతనమైంది. జూన్‌లో రూ.1,827.15 దగ్గర రికార్డ్‌ స్థాయి కనిష్టానికి (52 వారాల కనిష్టం), 30 శాతం మేర పడిపోయింది. అక్కడి నుంచి మళ్లీ "V" షేప్‌లో పుంజుకుంది. కనిష్ట స్థాయి నుంచి దాదాపు 40 శాతం పెరిగి, ఇప్పటి స్థాయికి చేరుకుంది.

టెక్నికల్‌ వ్యూ
బయాస్‌: పాజిటివ్‌
సపోర్ట్: రూ.2,638
రెసిస్టెన్స్‌: రూ.2,745
టార్గెట్‌: రూ.2,800

ఇటీవలి మార్కెట్‌ కరెక్షన్‌ కారణంగా, 20-DMA (డైలీ మూవింగ్‌ యావరేజ్‌) అయిన రూ.2,638 మార్క్‌ను దాటలేక ఈ స్టాక్‌ కొట్టుమిట్టాడింది. ఆ స్థాయిని బ్రేక్‌ చేశాక పాజిటివ్‌ ట్రెండ్‌లోకి మారింది. కాబట్టి, రూ.2,638ని సపోర్ట్‌గా చూడాలి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget