Muhurat Trading 2024: ముహూరత్ ట్రేడింగ్ కోసం హాట్ స్టాక్స్ - టాప్ బ్రోకరేజ్ సెలక్ట్ చేసింది
Samvat 2081: కొత్త సంవత్సరం సంవత్ 2081లో బాగా పెర్ఫార్మ్ చేస్తాయనుకున్న 8 స్టాక్స్‌ను బ్రోకరేజ్ కంపెనీ కోటక్ సెక్యూరిటీస్ సెలెక్ట్ చేసింది.
Diwali Muhurat Trading 2024: హిందూ క్యాలెండర్ ప్రకారం, దీపావళి నుంచి దీపావళి వరకు ఒక సంవత్సరం. ప్రసుత్తం నడుస్తున్న సంవత్ 2080లో BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ ఇండెక్స్‌లు దాదాపు 25% లాభపడ్డాయి. BSE మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 45%, 505% పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక బలహీనత, గ్లోబల్‌గా వడ్డీ రేట్ల పెంపును పరిగణనలోకి తీసుకుంటే, ఇండియన్ మార్కెట్లు అసాధారణ ప్రతిభను చూపుతున్నాయని బ్రోకరేజ్ కంపెనీ కోటక్ సెక్యూరిటీస్ చెబుతోంది.
సంవత్ 2081లో మంచి లాభాలు తీసుకొస్తాయని నమ్ముతున్న 8 షేర్లను బ్రోకింగ్ కంపెనీ ఎంచుకుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, దీపావళి సందర్భంగా నవంబర్ 01న జరిగే ముహూరత్ ట్రేడ్‌లో వీటిని కొనొచ్చు.
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ (Aadhar Housing Finance): వచ్చే ఏడాది దీపావళి కల్లా ఈ స్టాక్ ₹550 టార్గెట్ ప్రైస్‌కు చేరుతుందని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ట్రాక్ రికార్డ్ బాగుందని వెల్లడించింది. తక్కువ ధరల హౌసింగ్ విభాగంలో ఈ కంపెనీకి 7% మార్కెట్ వాటా ఉంది.
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank): ఈ స్టాక్‌ను ₹1,500 ప్రైస్ టార్గెట్‌తో బయ్ చేయొచ్చని బ్రోకింగ్ ఫర్మ్ పెట్టుబడిదార్లకు సూచించింది. దృఢమైన ఫ్రాంచైజీని నిర్మించడానికి GPS వ్యూహంపై ఈ బ్యాంక్ దృష్టి పెట్టింది. బ్యాంక్ వ్యాపార కార్యకలాపాలు కూడా ఆశించిన స్థాయిలో ఉన్నట్లు బ్రోకరేజ్ తెలిపింది.
జొమాటో (Zomato): ₹315 లక్షిత ధరతో జొమాటో షేర్లను కొనుగోలు చేయవచ్చని కోటక్ సెక్యూరిటీస్ చెబుతోంది. FY24-27 కాలంలో ఈ కంపెనీ 44% CAGR వద్ద ఆదాయాన్ని పెంచుకోగలదని, అదే కాలంలో EBITDA మార్జిన్ బలంగా పెరుగుతుందని అంచనా వేస్తోంది.
FIEM ఇండస్ట్రీస్ (FIEM Industries): వచ్చే దీపావళి (Diwali 2025) కోసం, ₹2,140 టార్గెట్ ప్రైస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయాలని కోటక్ సెక్యూరిటీస్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సిఫార్సు చేసింది. ద్విచక్ర వాహన పరిశ్రమ పునరుద్ధరణ నుంచి ఈ కంపెనీ ప్రయోజనం పొందుతుందని అంటోంది.
గ్రావిటా ఇండియా (Gravita India): బ్రోకింగ్ కంపెనీ ఈ స్టాక్‌కు యాడ్ రేటింగ్‌ను, ₹2,800 ప్రైస్ టార్గెట్‌ను ఇచ్చింది. నియంత్రణ నిబంధనలు తగ్గడంతో గ్రావిటా ఇండియా మార్కెట్ వాటా గణనీయంగా పెరుగుతుందని కోటక్ చెబుతోంది.
గోద్రెజ్ అగ్రోవెట్ (Godrej Agrovet): షార్ట్‌టర్మ్‌లో ఈ కంపెనీ ప్రైస్ ట్రెండ్ బాధపెట్టినప్పటికీ, దీర్ఘకాలిక దృక్పథం ఆశాజనకంగానే ఉందని బ్రోకరేజ్ తెలిపింది. ప్రొడక్ట్ పైప్‌లైన్‌లో బలం ఉందని విశ్వసిస్తోంది. GTFLలో 49% వాటాను కొనుగోలు చేయడాన్ని సానుకూలంగా చూస్తోంది.
JB కెమికల్స్ & ఫార్మా (JB Chemicals & Pharma): 2025 దీపావళిని దృష్టిలో పెట్టుకుని ₹2,255 ధర లక్ష్యంతో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయాలని కోటక్ సెక్యూరిటీస్ సూచించింది. FY24-27 కాలంలో కంపెనీ లాభం, ఎబిటా మార్జిన్ భారీగా పెరుగుతాయని బ్రోకరేజ్ ఆశిస్తోంది.
SH కేల్కర్ అండ్ కంపెనీ (SH Kelkar and Company): యూనిలీవర్ నుంచి భారీ ఆర్డర్ విజయంతో బ్రోకరేజ్ ఈ కంపెనీపై విశ్వాసాన్ని ఉంచింది. దీంతోపాటు, మేనేజ్‌మెంట్ పనితీరుపైనా ప్రశంసలు కురిపించింది. ఈ షేర్లకు బయ్ రేటింగ్ & ₹400 ప్రైస్ టార్గెట్‌ను ఇచ్చింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: బ్లింకిట్ నెక్ట్స్ లెవెల్ సర్వీస్, 30 నిమిషాల్లో మీ ఇంటికి - అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో డిష్యూం డిష్యూం