అన్వేషించండి

Teamlease Report: గుడ్‌ న్యూస్‌! 2022 Q4లో ఉద్యోగాల జాతరే! హైరింగ్‌కు రెడీ అంటున్న కంపెనీలు!

Teamlease Report: 2022 చివరి త్రైమాసికంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు చాలా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సేవల రంగంలోని 77 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టాలన్న సంకల్పంతో ఉన్నాయి.

Teamlease Report: 

ఆర్థిక మందగమనంతో ఉద్యోగాల్లోంచి తీసేస్తున్న తరుణంతో ఓ చల్లని కబురు! 2022 ఆర్థిక ఏడాది నాలుగో త్రైమాసికంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు చాలా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. సేవల రంగంలోని 77 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టాలన్న సంకల్పంతో ఉన్నట్టు టీమ్‌లీజ్‌ ఎంప్లాయిమెంట్‌ ఔట్‌లుక్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. 2021 నాలుగో క్వార్టర్‌తో పోలిస్తే నియామకాలు చేపట్టాలన్న సంకల్పం 27 శాతం పెరిగిందని పేర్కొంది.

మొత్తంగా సేవలు, తయారీ రంగాల కంపెనీల్లో నియామకాల సెంటిమెంటు సగటున 68 శాతంగా ఉందని టీమ్‌లీజ్‌ తెలిపింది. మూడో త్రైమాసికంలో ఇది 65 శాతమేనని పేర్కొంది. రాబోయే మూడు నెలల్లో తాజా గ్రాడ్యుయేట్లు, ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులను తీసుకొనేందుకు 79 శాతం ఎంప్లాయర్స్‌ సిద్ధంగా ఉన్నారు. మధ్య స్థాయిలో 50 శాతం, సీనియర్‌ స్థాయిలో 32 శాతం అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరిమాణాన్ని బట్టి పెద్ద  కంపెనీలు 82 శాతం, చిన్నవి 61 శాతం, మీడియం 50 శాతం ఉపాధి కల్పనకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ-కామర్స్‌ (98%), టెలీ కమ్యూనికేషన్స్ (94%), విద్యా రంగం (93%), ఆర్థిక సేవలు (88%), లాజిస్టిక్స్‌ (81%) కంపెనీల్లో ఎక్కువ ఉద్యోగాలు లభించనున్నాయి. ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని భావించే యువతకు ఇదే మంచి తరుణమని నిపుణులు చెబుతున్నారు. 'భారత్‌లో ఉపాధి కల్పన సెంటిమెంటు సానుకూలంగా ఉంది. 77 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి' అని టీమ్‌ లీజ్ సర్వీసెస్‌ చీఫ్‌ మయూర్‌ టాడె అన్నారు.

సేవల రంగానికి సంబంధించి మెట్రో, టైర్‌-1 నగరాల్లో హైరింగ్‌ సెంటిమెంటు బలంగా ఉందని మయూర్‌ తెలిపారు. 99 శాతం ఆసక్తితో ఉన్నారన్నారు. బెంగళూరు (97%), చెన్నై (94%), దిల్లీ (90%), హైదరాబాద్‌ (86%), ముంబయి (85%) వంటి నగరాల్లో టెలికాం, ఆర్థిక సేవల్లో రిక్రూట్‌మెంట్‌ ఉంటుందన్నారు. టైర్‌-3 నగరాల్లో సెంటిమెంటు 47  నుంచి 49 శాతానికి పెరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హైరింగ్‌ సెంటిమెంటు ఒక శాతం తగ్గిందని వెల్లడించారు.

కొన్ని రంగాల్లో రీటెన్షన్‌ రేటు పెరిగిందని టీమ్‌లీజ్‌ తెలిపింది. ప్రతిభావంతులను రీటెయిన్‌ చేసుకోవడం తగ్గిందని పేర్కొంది. ఐటీలో 27.19 శాతం, విద్య రంగంలో 18.02 శాతం, ఈ-కామర్స్‌, సంబంధిత స్టార్టప్పుల్లో 15.13 శాతం, కేపీవోల్లో 13.79 శాతం, టెలీ కమ్యూనికేషన్స్‌లో 12.05 శాతం వరకు ఉంది.

Also Read: వాటే రికవరీ! రూ.3 లక్షల కోట్ల నష్టం నుంచి తేరుకున్న స్టాక్‌ మార్కెట్లు!

Also Read: క్రేజీ రిటర్న్‌! 2022లో సూపర్ డూపర్‌ రాబడి అందించిన సిప్‌ ఫండ్స్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Vikkatakavi Series : న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
న్యూ సిరీస్​తో వస్తోన్న మేఘా ఆకాష్.. ‘వికటకవి’ స్ట్రీమింగ్ ప్లాట్​ఫారమ్, ఓటీటీ తేదీ ఇదే
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
HMD Fusion: ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
ఈ స్మార్ట్ ఫోన్ బట్టలు మార్చేయచ్చు - స్మార్ట్ అవుట్‌ఫిట్స్‌తో వచ్చిన హెచ్‌ఎండీ ఫ్యూజన్!
PM Modi AP Tour: ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Tata Sierra EV: టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
టాటా సియెర్రా ఈవీ లాంచ్ త్వరలోనే - ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో మాస్టర్ స్ట్రోక్ - ధర ఎంత ఉండవచ్చు?
Chevireddy vs. Balineni :  చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
Embed widget