By: ABP Desam | Updated at : 18 Dec 2022 02:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
సిప్ మ్యూచువల్ ఫండ్ ( Image Source : Unsplash )
SIP Mutual Funds 2022:
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్! ఈ రోజుల్లో సిప్ గురించి తెలియని వారుండరు! తమ ఆదాయాన్ని డైవర్సిఫై చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ప్రతి నెలా ఎంతో కొంత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంటారు. ఇలా క్రమానుగతంగా మదుపు చేయడాన్నే సిప్ అంటారు. ఈ పద్ధతిలో సుదీర్ఘ కాలంలో మెరుగైన రాబడి పొందొచ్చు. ఈ నేపథ్యంలో 2022లో అత్యుత్తమంగా రాణించిన కొన్ని సిప్ ఆధారిత ఫండ్లు మీకోసం!
క్వాంట్ యాక్టివ్ ఫండ్: ఈ ఏడాది క్వాంట్ యాక్టివ్ ఫండ్ మెరుగ్గా రాణించింది. ఇది ఈక్విటీ విభాగంలోని మల్టీ క్యాప్ ఫండ్. తొమ్మిదేళ్ల క్రితం ఆరంభమైన ఈ ఫండ్ ఇప్పటి వరకు సగటున ఏడాదికి 30.89 శాతం రాబడి అందించింది.
క్వాంట్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్: ఇది ఈక్విటీలోని లార్జ్, మిడ్‌క్యాప్ ఫండ్. 2022లో రెండో స్థానంలో నిలిచింది. తొమ్మిదేళ్ల క్రితం మొదలైన ఈ ఫండ్ సగటున ఏడాది 23.35 శాతం రాబడి ఆఫర్ చేసింది. ఎక్స్‌పెన్స్ రేషియో 0.56 శాతం.
పీజీఐఎం ఇండియా ఫ్లెక్సి క్యాప్ ఫండ్: ఇదీ మల్టీ క్యాప్ ఫండే. స్మాల్, మీడియం, లార్జ్ క్యాప్ షేర్లలో పెట్టుబడి పెడతారు. ఏడున్నరేళ్ల క్రితం మొదలైన ఈ ఫండ్ సగటున ఏడాదికి 21.21 శాతం రిటర్న్ అందించింది. ఎక్స్‌పెన్స్ రేషియో సైతం తక్కువగానే ఉంది.
క్వాంట్ ఫోకస్డ్ ఫండ్: 2022లో క్వాంట్ ఫోకస్డ్ ఫండ్ మెరుగ్గా రాణించింది. సగటున ఏడాదికి 21.05 శాతం రాబడి అందించింది. ఎక్స్‌పెన్స్ రేషియో 0.57 శాతం. తొమ్మిన్నరేళ్ల క్రితం మొదలైంది.
పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్: ఈ ఫండ్ సగటున ఏడాదికి 19.6 శాతం రాబడి అందించింది. తొమ్మిన్నరేళ్లకు పైగా మెరుగైన ప్రదర్శన చేస్తోంది. స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్స్‌పెన్స్ రేషియో 0.76 శాతం.
మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్: ఈక్విటీలో లార్జ్, మిడ్‌క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. పదేళ్లుగా మార్కెట్లో గట్టిపోటీనిస్తోంది. మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ వార్షికంగా సగటున 19.43 శాతం రాబడి అందించింది.
కొటక్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్: ఈ ఫండ్ సైతం చక్కని లార్జ్, మిడ్‌క్యాప్ షేర్లల్లో మదుపు చేస్తుంది. తొమ్మిదేళ్లకు పైగా మెరుగ్గా రాణిస్తోంది. వార్షిక సగటు రాబడి 18.65 శాతంగా ఉంది. ఎక్స్‌పెన్స్ రేషియో 0.59 శాతంగా ఉంది.
నోట్: ఈ సమాచారం, గణాంకాలు డిసెంబర్ 18, 2022 నాటివి. ఏఎంఎఫ్ఐ లేదా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఆధారంగా సమాచారం అందిస్తున్నాం.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Investment Plan: 1000 రూపాయల SIPతో కోటిన్నర తిరిగిచ్చిన SBI - మీరూ కావచ్చు కోటీశ్వరుడు!
Venture Debt: 1.23 బిలియన్ డాలర్లకు చేరిన వెంచర్ డెట్- Stride Ventures నివేదిక
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రత్యేక ఫార్ములా - యవ్వనం కంటే వృద్ధాప్యంలో ఎక్కువ సంపాదన!
Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్'
Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్ ఇదే
YS Jagan Security Dispute: జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి టీడీపీ ఫిర్యాదు-ప్రధానిని కలిసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
TS Indiramma Illu Housing Status Online: ఇందిరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులు స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి, స్కీమ్ పూర్తి వివరాలు
Rajamouli: రాజమౌళి ఎఫెక్ట్... మొత్తం క్లీన్ చేసేశారు - దర్శక ధీరుడు పోస్ట్ చేస్తే అంతేగా!
Software Jobs: ఫ్రెషర్లకు పండగే.. 42 వేల సాఫ్ట్వేర్ నియామకాలకు టీసీఎస్ నిర్ణయం, పెండింగ్‌లో వేతనాల పెంపు