By: ABP Desam | Updated at : 20 Dec 2022 03:51 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 16 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అమెరికా మాంద్యంలోకి పయనిస్తోందన్న వార్తలు, మరోవైపు చైనాలో కొవిడ్ కేసులు పెరగడంతో ఉదయం మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో మదుపర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ఐరోపా మార్కెట్లు తెరిచాక మళ్లీ కొనుగోళ్లు చేపట్టారు.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 35 పాయింట్ల నష్టంతో 18,385 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 103 పాయింట్ల నష్టంతో 61,702 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు బలహీన పడి 82.75 వద్ద స్థిరపడింది. ఉదయం రూ.3 లక్షల కోట్ల మేర నష్టపోయిన మదుపర్లు సాయంత్రానికి రూ.50వేల నష్టానికి తేరుకున్నారు.
BSE Sensex
క్రితం సెషన్లో 61,806 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,608 వద్ద మొదలైంది. 61,102 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,780 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 103 పాయింట్ల నష్టంతో 61,702 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 550 పాయింట్ల పతనమైన సూచీ సాయంత్రానికి పుంజుకుంది.
NSE Nifty
సోమవారం 18,420 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,340 వద్ద ఓపెనైంది. 18,202 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,404 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 35 పాయింట్ల నష్టంతో 18,385 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ పుంజుకుంది. ఉదయం 43,152 వద్ద మొదలైంది. 42,955 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,426 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 54 పాయింట్లు పతనమై 43,359 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టీసీఎస్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఎస్‌బీఐ లైఫ్, ఐచర్ మోటార్స్, యూపీఎల్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యునీలివర్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
HYDRA: 'కొన్నిసార్లు మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది' - ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
AP Assembly: ఏపీ శాసనసభ నిరవదిక వాయిదా - 10 రోజుల్లో 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం
Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్