TCS Q1 ఫలితాలు: భారీ లాభాలతో దూసుకెళ్తున్న టాటా, షేర్ హోల్డర్లకు గుడ్ న్యూస్!
TCS Share: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ టీసీఎస్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు సాధించింది.

TCS Net profit rises to 12760 crore: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక (Q1 FY26, ఏప్రిల్-జూన్ 2025) ఫలితాలను జులై 10 న ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 63,437 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం Q1 ( రూ. 62,613 కోట్లు)తో పోలిస్తే 1.3 శాతం ఏటా (YoY) పెరుగుదల నమోదు అయింది. నిర్వహణ లాభ మార్జిన్ ఏప్రిల్-జూన్ కాలంలో త్రైమాసికంలో 0.3% పెరిగి 24.5%కి చేరుకుంది. ప్రపంచవ్యాప్త స్థూల-ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ 6 శాతం ఆదాయ మెరుగుదలను నమోదు చేసింది.
ఈ త్రైమాసికంలో టీసీఎస్ 9.4 బిలియన్ డాలర్ల కొత్త ఒప్పందాలను చేసుకుంది. త్రైమాసికం చివరి నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,069కి చేరుకుంది. ఇది గత సంవత్సరాని కంటే 6,000 కంటే ఎక్కువ.కంపెనీ స్క్రిప్ BSEలో 0.06% తగ్గి ₹3,382.30 వద్ద ముగిసింది, బెంచ్‌మార్క్‌పై 0.41% కరెక్షన్ జరిగింది.
న్స్టెంట్ కరెన్సీ ఆదాయం 3.1% తగ్గుదల నమోదవుతున్నట్లుగా కంపెనీ తెలిపింది. 7,421 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. గత సంవత్సరం Q1తో పోలిస్తే 1.1% తగ్గుదల నమోదు అయింది. గత త్రైమాసికంతో పోలిస్తే Q4 FY25 (₹64,479 కోట్లు)తో పోలిస్తే ఆదాయం 1.6% తగ్గింది, ఇది భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఒప్పందం నుండి ఆదాయం తగ్గడం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా జరిగిందని కంపెనీ విశ్లేషించింది.
TCS - Q1 FY26 result - Good ✅#TCS #sabarisec #Q1FY26
— SABARI SECURITIES (@sabarisec) July 10, 2025
YoY revenue - 63,437 cr Vs 62,614 cr ⬆️
YoY PBT - 16,979 cr Vs 16,231 cr ⬆️
YoY PAT - 12,819 cr Vs 12,105 cr ⬆️
YoY EPS - 35.27 vs 33.28 ⬆️
QoQ revenue - 63,437 cr Vs 64,479 cr ⬇️
QoQ PBT - 16,979 cr Vs 16,402 cr ⬆️
QoQ… pic.twitter.com/sMaKPF3rYC
కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 12,760 కోట్లుగా తేలింది. గత సంవత్సరం Q1 లో ఇది రూ. 12,040 కోట్లుగా ఉంది. అంటే 6% పెరుగుదల నమోదు అయింది. షేర్‌కు లాభం (EPS) రూ.35.27.. గత సంవత్సరం Q1తో పోలిస్తే పెరుగుదల నమోదు అయింది. TCS బోర్డు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 11 ఇంటరిమ్ డివిడెండ్‌ను ప్రకటించింది.
AI & డేటా, TCS ఇంటరాక్టివ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలు ఈ త్రైమాసికంలో పెరుగుదలను నమోదు చేశాయి. ఆపరేటింగ్ మోడల్ ట్రాన్స్‌ఫర్మేషన్, వెండర్ కన్సాలిడేషన్, AI-పవర్డ్ ఇంటెలిజెంట్ ఆటోమేషన్, SAP S4/HANA ఆధారిత ట్రాన్స్‌ఫర్మేషన్ డీల్స్ మంచి పనితీరు చూపించాయి. TCS ఫ్రాన్స్‌లో కొత్త AI-ఫోకస్డ్ TCS PacePort ని, USలో IoT ల్యాబ్‌ని, లాటిన్ అమెరికా, కెనడా, యూరప్‌లో డెలివరీ సెంటర్లను విస్తరించింది. Q4 FY25లో 267 పేటెంట్‌లకు దరఖాస్తు చేసింది. 235 పేటెంట్‌లు పొందింది.





















