అన్వేషించండి

Suzlon Energy Shares: అప్పర్ సర్క్యూట్‌లో సుజ్లాన్‌ ఎనర్జీ, ఆరో రోజూ ఎనర్జిటిక్‌ రన్‌

గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 24% పెరిగాయి.

Suzlon Energy Shares: ఇవాళ్టి (సోమవారం, 03 జూన్‌ 2023) ట్రేడింగ్‌లో, BSEలో, సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 10% అప్పర్ సర్క్యూట్‌ కొట్టాయి, రూ. 16.86 వద్ద లాక్‌ అయ్యాయి. స్టాక్ సెంటిమెంట్ చాలా బలంగా ఉండడంతో వరుసగా ఆరో సెషన్‌లోనూ విన్నింగ్‌ రన్‌ కొనసాగింది.

గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 24% పెరిగాయి.

శుక్రవారం నాటి క్లోజింగ్‌ ప్రైస్‌ రూ. 15.33తో పోలిస్తే, ఈ ఎనర్జీ షేర్లు ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు 10% పెరిగి రూ. 9.98 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌లో ఆగాయి. 

ఈ స్టాక్‌ గత నెల రోజుల్లోనే 47% పైగా పెరిగింది. ఈ ఆరు నెలల్లో 57%, గత ఒక ఏడాది కాలంలో 175% పైగా ర్యాలీ చేసింది.

బయ్‌ రేటింగ్‌, రూ.22 టార్గెట్ ప్రైస్‌
ఇండస్ట్రీ టెయిల్‌విండ్స్‌ నుంచి లాభపడే కంపెనీల్లో సుజ్లాన్ ఎనర్జీ బెస్ట్‌ ప్లేస్‌లో ఉందని దేశీయ బ్రోకరేజ్ కంపెనీ ICICI సెక్యూరిటీస్ చెబుతోంది. రెడ్‌ బుల్‌ తాగితే రెక్కలొచ్చినట్లు, FY24 నుంచి సుజ్లాన్‌ ఎనర్జీ ఆదాయాలకు కూడా రెక్కలు వస్తాయని ఆశిస్తోంది.

ICICI సెక్యూరిటీస్ సుజ్లాన్ ఎనర్జీకి రూ. 22 టార్గెట్ ప్రైస్‌తో "బయ్‌" రేటింగ్‌ ఇచ్చింది. ఈ టార్గెట్ ప్రైస్‌, ప్రస్తుత మార్కెట్ ధర కంటే 32% ర్యాలీని సూచిస్తోంది.

పుణె కేంద్రంగా పని చేసే సుజ్లాన్‌ ఎనర్జీ, విండ్‌ టర్బైన్లను రూపొందిస్తుంది. వాటిని ఇండియన్‌ మార్కెట్‌లో అమ్మడంతో పాటు వివిధ దేశాలకు ఎక్స్‌పోర్ట్‌ చేస్తుంది. ఈ కంపెనీ, ప్రపంచంలో ఐదో అతి పెద్ద విండ్‌ టర్బైన్స్‌ సప్లయర్‌.

ఇండియన్ పవర్ సెక్టార్‌కు మరింత విండ్‌ పవర్‌ అవసరం. కెపాసిటీని పెంచాల్సిన పని చివరకు స్టేక్‌హోల్డర్స్‌పై పడింది. ఈ పరిస్థితులను సుజ్లాన్‌ ఎనర్జీ క్యాష్‌ చేసుకుంటుందని ICICI సెక్యూరిటీస్ ఆశిస్తోంది.

కంపెనీ లాభనష్టాలు
Q4FY23లో (2023 జనవరి-మార్చి కాలం), కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 320 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో రూ. 205.52 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. FY22లో రూ. 258 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. FY23లో రూ. 2,852 కోట్ల నికర లాభం సాధించింది.

అయితే, మార్చి త్రైమాసికంలో ఆదాయం తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలోని ఆదాయం రూ. 2478 కోట్లతో పోలిస్తే 31% తగ్గి రూ. 1700 కోట్లకు చేరుకుంది. మొత్తం FY23లోనూ ఆదాయం 9% తగ్గి రూ. 5990 కోట్లకు చేరుకుంది.

మరో ఆసక్తికర కథనం: కేవలం ₹100కే రైల్వే స్టేషన్‌లో రూమ్‌ - హోటల్‌ గదిలా ఉంటుంది 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

టాప్ హెడ్ లైన్స్

మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget