(Source: ECI/ABP News/ABP Majha)
Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Zee, Cipla, MRPL, Axis Bank
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-అప్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 23 January 2024: అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం సెలవు తీసుకున్న ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు, ఈ రోజు (మంగళవారం) పాజిటివ్ నోట్‌తో ప్రారంభం కావచ్చు. ICICI బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సిప్లా వంటి మేజర్ కంపెనీల Q3 ఫలితాల ఆధారంగా పెట్టుబడిదార్లు రియాక్ట్ కావచ్చు. అదే సమయంలో... ఎర్ర సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. యెమెన్‌లోని హౌతీ స్థానాలపై US, UK సంయుక్తంగా వైమానిక దాడులను ప్రారంభించాయి.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 190 పాయింట్లు లేదా 0.88% గ్రీన్ కలర్‌లో 21,779 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-అప్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
వడ్డీ రేట్లపై బ్యాంక్ ఆఫ్ జపాన్ నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో, మార్కెట్ ప్రారంభలో నికాయ్ 0.6 శాతం వరకు పెరిగింది. ఇతర ఆసియా మార్కెట్లలో.. హాంగ్ సెంగ్ కూడా 0.6 శాతం లాభపడగా, ASX200, కోస్పీ 0.46 శాతం వరకు పెరిగాయి.
నిన్న, US మార్కెట్లలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, S&P 500 కొత్త ఆల్-టైమ్ గరిష్టాలను చేరాయి. డౌ జోన్స్ 0.36 శాతం లాభపడగా, S&P500 0.22 శాతం పెరిగింది. టెక్-హెవీ నాస్‌డాక్ కాంపోజిట్ 0.32 శాతం పెరిగింది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: యాక్సిస్ బ్యాంక్, CG పవర్, సైయంట్ DLM, గ్రాన్యూల్స్ ఇండియా, హావెల్స్ ఇండియా, ICRA, ఇండస్ టవర్స్, JSW ఎనర్జీ, కర్ణాటక బ్యాంక్, L&T హౌసింగ్ ఫైనాన్స్, లాయిడ్స్ ఇంజినీరింగ్, పురవంకర, రాలిస్ ఇండియా, RECL, Tanla ప్లాట్‌ఫామ్స్, టాటా ఎల్‌క్సీ, యునైటెడ్ స్పిరిట్స్.
Zee ఎంటర్‌టైన్‌మెంట్: సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్ విలీన ప్రతిపాదన రద్దు కాబోతోంది. రెండు సంవత్సరాల తర్వాత, విలీన ఒప్పందం రద్దు కోసం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా టెర్మినేషన్ నోటీసును జారీ చేసింది. టర్మినేషన్ ఫీజు కింద $90 మిలియన్లను కూడా డిమాండ్ చేసింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా నిధుల సేకరణ కోసం ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.
సిప్లా: 2023 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో, గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 32 శాతం పెరిగి రూ.1,055.90 కోట్లకు చేరుకుంది. ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 13 శాతం పెరిగి రూ.6,505.66 కోట్లకు చేరుకుంది.
ఒబెరాయ్ రియాల్టీ: డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్, గతేడాది ఇదే కాలంలోని రూ.456 కోట్లతో పోలిస్తే 21 శాతం తగ్గి రూ.360 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సంవత్సరానికి 12.9 శాతం తగ్గి రూ.1,082.85 కోట్లకు చేరుకుంది.
MRPL: Q3FY23లోని రూ. 187.96 కోట్ల నికర నష్టం నుంచి Q3FY24లో రూ. 387.06 కోట్ల నికర లాభంతో కంపెనీ దశ తిరిగింది. అయితే, మొత్తం ఆదాయం 8.4 శాతం తగ్గి రూ.28,422.99 కోట్లకు చేరుకుంది.
హిందుస్థాన్ జింక్: వివాహాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, రెన్యువల్ ఎనర్జీ మీద భారత ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. కాబట్టి, స్వల్పకాలిక వ్యూహంలో భాగంగా ఉత్పత్తిని హిందుస్థాన్ జింక్ పెంచుతుంది. కంపెనీ వెండి సంబంధిత అమ్మకాలు Q3FY23 కంటే Q3FY24లో 44 శాతం పెరిగాయి. ఈ సెగ్మెంట్ నుంచి లాభం కూడా దాదాపు 50 శాతం పెరిగింది.
JSW గ్రూప్: కటక్, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలనే JSW గ్రూప్ ప్రణాళికను ఒడిశా ప్రభుత్వం ఆమోదించింది.
కోల్‌గేట్-పామోలివ్ ఇండియా: Q3FY24 నికర లాభం YoYలో 35 శాతం పెరిగి రూ.243 కోట్ల నుంచి రూ.330 కోట్లకు చేరుకుంది. విక్రయాలు 8.2 శాతం పెరిగి రూ.1,386 కోట్లకు చేరాయి.
కోఫోర్జ్: Q3FY24 నికర లాభం 4.3 శాతం పెరిగి రూ.236 కోట్లకు చేరింది, Q3FY23లో ఇది రూ. 228 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.2,323 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: స్థిరంగా పసిడి ప్రకాశం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే