Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Wipro, TVS, Torrent, RVNL
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-అప్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 21 March 2024: గ్లోబల్‌గా బలమైన సూచనలను అనుసరించి, భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం) సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యూఎస్ ఫెడ్ తన వడ్డీ రేట్లను మరోమారు యథాతథంగా ఉంచింది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో మూడుసార్లు రేట్ల కోత ఉంటుదన్న మాటకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఈ వార్తలతో ఆసియా పసిఫిక్‌లో మార్కెట్లు భారీగా పెరిగాయి.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 26 పాయింట్లు లేదా 0.12 శాతం గ్రీన్ కలర్‌లో 22,080 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-అప్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో.. జపాన్ నికాయ్ 1.57 శాతం ఎగబాకి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది, టోపిక్స్ కూడా 1.41 శాతం ఎగబాకి కొత్త రికార్డును నెలకొల్పింది. దక్షిణ కొరియా కోస్పి 1.52 శాతం పెరిగింది, 2022 ఏప్రిల్ తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది. కోస్‌డాక్ 1.48 శాతం పెరిగింది. హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ కూడా 1.51 శాతం పెరిగి 16,793 స్థాయిలో ట్రేడ్ అవుతోంది.
అమెరికాలో, నిన్న, మూడు ప్రధాన ఇండెక్స్‌లు లాభాలను చవిచూశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ & S&P 500 వరుసగా 1.03 శాతం & 0.89 శాతం పెరిగి కొత్త రికార్డు గరిష్టాలను నెలకొల్పాయి. నాస్‌డాక్ కాంపోజిట్ 1.25 శాతం జంప్ చేసింది, లార్జ్ క్యాప్ టెక్నాలజీ స్టాక్స్ ఇచ్చిన బూస్ట్‌తో ఇది బలం పెంచుకుంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్: ఈ కంపెనీ షేర్లు ఈ రోజు లిస్ట్ అవుతాయి. IPO సమయంలో ఒక్కో షేరును రూ. 715 ధరతో జారీ చేసింది.
ఎక్స్-డివిడెండ్ స్టాక్స్: క్యాస్ట్రోల్ ఇండియా, స్కోల్వ్స్ ఇండియా, పతంజలి ఫుడ్స్ ఈ రోజు ఎక్స్-డివిడెండ్ ట్రేడింగ్ చేస్తాయి.
ఫలితాలు: ఎక్సికామ్ టెలీసిస్టమ్స్, ప్లాటినం ఇండస్ట్రీస్ ఈ రోజు Q3 ఫలితాలను విడుదల చేస్తాయి.
RVNL: రూ.167.28 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ప్రాజెక్ట్‌కు అత్యల్ప బిడ్డర్‌గా రైల్ వికాస్ నిగమ్ నిలిచింది. SER HQ-ఎలక్ట్రికల్‌తో కలిసి ఈ బిడ్ వేసింది.
సైయెంట్: NCLT బెంగళూరులో, ఇన్‌ఫోటెక్ HAL కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించినట్లు సైయెంట్ ప్రకటించింది.
టొరెంట్ పవర్: మహారాష్ట్రలోని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నుంచి మరింత సులభంగా విద్యుత్ తరలింపు కోసం, షోలాపూర్ ట్రాన్స్‌మిషన్‌లో 100 శాతం వాటా కొనుగోలు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
విప్రో: క్యాప్కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అన్నే-మేరీ రోలాండ్‌ను నియమించింది. ఏప్రిల్ 1, 2024 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.
TVS మోటార్: కంపెనీ-షేర్‌హోల్డర్ల మధ్య ఏర్పాటు చేసే స్కీమ్‌ను డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఈ స్కీమ్ ప్రకారం, బోనస్ రూపంలో రూ.1,900 కోట్ల వరకు నాన్-కన్వర్టబుల్ రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లను కంపెనీ జారీ చేస్తుంది. రికార్డ్ తేదీ నాటికి షేర్‌హోల్డర్ల దగ్గర ఉన్న ప్రతి 1 ఈక్విటీ షేర్‌కు 4 ప్రాధాన్యత షేర్లను కంపెనీ ఇస్తుంది.
NTPC: 2 సంవత్సరాల కాల వ్యవధికి సంవత్సరానికి 7.48 శాతం కూపన్‌తో రూ.1500 కోట్ల విలువైన NCDలను జారీ చేస్తుంది.
ప్రిన్స్ పైప్స్: "అక్వెల్" బ్రాండ్‌తో సహా అన్ని రకాల ఆస్తులను కొనుగోలు చేయడానికి క్లాస్ వారెన్ ఫిక్చర్స్, ఎన్‌ఐఎం షాతో ఆస్తి కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రూ.66,000 పైనే పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి