Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Nestle, Zee Ent, Apollo Tyres, Sun Pharma
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు ఫ్లాట్‌గా ఓపెన్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 19 December 2023: గత మూడు సెషన్లలో భారీ ర్యాలీ తర్వాత, నిన్న (సోమవారం) ప్రాఫిట్ బుకింగ్స్‌తో ఇండియన్ ఈక్విటీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ రోజు గ్లోబల్ మార్కెట్ల నుంచి ఎలాంటి సిగ్నల్స్ లేవు. కాబట్టి, మంగళవారం మన మార్కెట్ల స్తబ్దుగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముడి చమురు ధరల్లో పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపవచ్చు.
బలంగా ఉన్న భారతదేశ ఆర్థిక డేటా, ఆరోగ్యకరమైన కార్పొరేట్ ఆదాయాలు, పెరిగిన FII ఇన్‌ఫ్లోస్ కారణంగా ఓవరాల్ మార్కెట్‌పై బుల్లిష్‌గా ఉన్నామని మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. అయితే, ఇటీవలి బలమైన ర్యాలీని దృష్టిలో పెట్టుకుని, షార్ట్‌టైమ్‌లో కొంత అస్థిరత కనిపించొచ్చని చెబుతోంది.
2024లో వడ్డీ రేట్ల తగ్గింపు ఆశావాదాన్ని నిన్న (సోమవారం) కూడా యూఎస్ మార్కెట్లు కొనసాగించాయి, లాభాల మధ్య ముగిశాయి. S&P 500, నాస్‌డాక్ 0.5 శాతం చొప్పున లాభపడగా, డౌ జోన్స్ పెద్దగా మారలేదు.
2023లో, బ్యాంక్ ఆఫ్ జపాన్ తుది వడ్డీ రేట్ల నిర్ణయం నేపథ్యంలో ఆసియా స్టాక్స్ లోయర్ సైడ్‌లో ఉన్నాయి. నికాయ్, హాంగ్ సెంగ్, కోస్పి 0.06-1 శాతం వరకు క్షీణించాయి.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 05 పాయింట్లు లేదా 0.02% రెడ్ కలర్‌లో 21,481 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు ఫ్లాట్‌గా ఓపెన్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
జీ ఎంటర్‌టైన్‌మెంట్: సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్, తన ఇండియన్ బిజినెస్‌ను జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విలీనం చేసే గడువును పొడిగించే అవకాశం లేదని నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ గడువు పొడిగింపు కోరిందని నిన్న వార్తలు వచ్చాయి.
అపోలో టైర్స్: బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం, వార్‌బర్గ్ పింకస్ అనుబంధ సంస్థ అపోలో టైర్స్‌లో 3 శాతం వాటా విక్రయం ద్వారా సుమారు 100 మిలియన్ డాలర్లను సేకరించబోతోంది. ఒక్కో షేర్ ఫ్లోస్ ప్రైస్‌ను రూ.440గా నిర్ణయించింది.
సఫైర్ ఫుడ్స్: ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీలు (సఫైర్ ఫుడ్స్ మారిషస్, సమారా క్యాపిటల్) సఫైర్ ఫుడ్స్‌లో కొంత వాటాను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా విక్రయించాయి.
ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్: ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్‌లో 3.4% షేర్లను ఓపెన్ మార్కెట్ డీల్స్ ద్వారా పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ అమ్మేసింది, దాదాపు రూ. 252 కోట్లను సేకరించింది.
PNC ఇన్‌ఫ్రా టెక్: మధ్యప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MPRDC) హైవే ప్రాజెక్ట్ కోసం వేసిన టెండర్లలో PNC ఇన్‌ఫ్రా టెక్ L1 బిడ్డర్‌గా నిలిచింది. అంటే, మిగిలిన కంపెనీల కంటే తక్కువ మొత్తాన్ని ఈ కంపెనీ కోట్ చేసింది.
నెస్లే: 2023 అక్టోబర్ నెలలో ప్రకటించిన స్టాక్ స్ప్లిట్ కోసం రికార్డ్ తేదీని నెస్లే ఇండియా వెల్లడించింది. 2024 జనవరి 5ని రికార్డు తేదీగా నిర్ణయించింది. ఆ తేదీ లోపు ఎవరి డీమ్యాట్ ఖాతాల్లో నెస్లే షేర్లు ఉంటాయో, వాళ్లు స్టాక్ స్ప్లిట్‌కు అర్హులు అవుతారు.
NHPC: నిర్దిష్ట సమయానికి లోబడి, ఈ కంపెనీకి చెందిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పవర్ స్టేషన్ల భవిష్యత్ క్యాష్ ఫ్లోస్‌ను మానిటైజేషన్ చేసే ప్రతిపాదనను పరిశీలించడానికి ఈ నెల 22న NHPC డైరెక్టర్ల బోర్డు సమావేశం జరగనుంది.
సన్ ఫార్మా: లాంగ్ యాక్టింగ్ ఓరల్ (LAO) థెరపీల కోసం సరికొత్త డెలివరీ టెక్నాలజీని అభివృద్ధి చేసే బిజినెస్ చేస్తున్న లిండ్రా థెరప్యూటిక్స్‌లో 16.7% షేర్లను కొనుగోలు చేయడానికి సన్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది బంపర్ కలెక్షన్స్ సాధించిన 10 హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్