Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' SpiceJet, Adani Green, Aster DM, Polycab
Stock Market News: మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 11 January 2024: గ్లోబల్ మార్కెట్ల నుంచి గ్రీన్ సిగ్నల్స్ వస్తున్నాయి, ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం) పాజిటివ్ నోట్‌తో ప్రారంభం కావచ్చు. ఈ రోజు వెలువడే TCS, ఇన్ఫోసిస్ Q3 ఫలితాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించే అవకాశం ఉంది.
యూఎస్ డిసెంబర్ నెల ఇన్‌ఫ్లేషన్ డేటా ఈ రోజు వెలువడుతుంది. ఈ నేపథ్యంలో, నిన్న, US మార్కెట్లు 0.8 శాతం వరకు లాభాలతో ముగిశాయి. డౌ జోన్స్, S&P 500 వరుసగా 0.45 శాతం, 0.57 శాతం పెరిగాయి, నాస్‌డాక్ కాంపోజిట్ 0.75 శాతం లాభపడింది.
అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపును ప్రారంభిస్తే, అది తొందరపాటు చర్య అవుతుందని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ ప్రెసిడెంట్ జాన్ విలియమ్స్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. బిట్‌కాయిన్‌ను ట్రాక్ చేయడానికి US-లిస్టెడ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌కు (ETFలు) US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆసియా స్టాక్స్ కూడా ఈ రోజు లాభాల బాటలో నడుస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ అల్ట్రా-లూజ్ విధానాలు ముగుస్తాయన్న పెట్టుబడిదార్ల అంచనాల మధ్య, నికాయ్ ఈ ఉదయం 2 శాతం ఎగబాకి 34 సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకింది. ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియా కోప్సీ 0.46 శాతం వరకు పెరిగాయి. హ్యాంగ్ సెంగ్ 0.7 శాతం ర్యాలీ చేసింది.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 14 పాయింట్లు లేదా 0.06% గ్రీన్ కలర్‌లో 21,728 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: టీసీఎస్, ఇన్ఫోసిస్, GTPL హాత్‌వే, 5పైసా, HDFC AMC, ఇతర వాటితో పాటుగా ఈ రోజు వారి Q3 ఆదాయాలను విడుదల చేస్తాయి.
ఇన్ఫోసిస్: మార్కెట్ ముగిసిన తర్వాత ఈ కంపెనీ ఫలితాలు విడుదలవుతాయి. ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికం (Q3 FY24) నికర లాభం QoQ, YoY ప్రాతిపదికన క్షీణించవచ్చని అంచనా. గత ఏడాదితో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికం (Q3FY24)లో
టీసీఎస్: ఈ కంపెనీ ఫలితాలు కూడా మార్కెట్ ముగిసిన తర్వాత వస్తాయి. Q3 ఆదాయం, లాభాల్లో సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయవచ్చని ఎక్స్‌పర్టుల అంచనా.
స్పైస్‌జెట్: రుణ భారాన్ని తగ్గించుకోవడానికి షేర్లు, వారెంట్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.2,250 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది.
మారుతి సుజుకి: రూ.35,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న రెండో ప్లాంట్‌కు భూమి కోసం గుజరాత్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
అదాని గ్రీన్: ప్రాక్సీ అడ్వైజరీ కంపెనీ 'ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అడ్వైజరీ సర్వీసెస్' (IIAS), అదానీ గ్రీన్ ఎనర్జీ చేపట్టిన రూ.9,350 కోట్ల విలువైన ప్రిఫరెన్షియల్ ఇష్యూకి 'వ్యతిరేకంగా' ఓటు వేయాలని సిఫార్సు చేసింది.
ఆస్టర్ DM: ఒక యూనిట్‌ను విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్టర్ DM ఎలా ఉపయోగించుకుంటుందనే దానిపై స్పష్టత లేదని, ఆ తీర్మానానికి 'వ్యతిరేకంగా' ఓటు వేయాలని IIAS సిఫార్సు చేసింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా: బ్యాంక్ మొత్తం వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 9.9 శాతం పెరిగి రూ.12.76 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం డిపాజిట్లు 8.66 శాతం పెరిగి రూ.7.10 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ మార్కెట్‌లో మొత్తం డిపాజిట్లు 7.62 శాతం పెరిగి రూ.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
మణప్పురం ఫైనాన్స్: తన అనుబంధ సంస్థ అయిన ఆశిర్వాద్ మైక్రో ఫైనాన్స్ కోసం ప్రతిపాదించిన రూ.1,500 కోట్ల IPOని సెబీ "అబెయాన్స్"లో ఉంచింది.
పాలీక్యాబ్ ఇండియా: ఆదాయపు పన్ను విభాగం ఇటీవల పాలీక్యాబ్ గ్రూప్‌పై జరిపిన దాడుల్లో, "ఖాతాల్లో చూపని దాదాపు రూ. 1,000 కోట్ల విక్రయాలు" గుర్తించినట్లు PTI నివేదించింది.
ఫీనిక్స్ మిల్స్: డిసెంబర్ త్రైమాసికంలో గ్రాస్ రిటైల్ కలెక్షన్లలో 30 శాతం వృద్ధితో రూ.700 కోట్లను కంపెనీ అప్‌డేట్ చేసింది. మొత్తం వినియోగం ఏడాదిలో 24 శాతం పెరిగి రూ.3,287 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.