Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' ABFRL, Infy, Hero Moto, AU SFB
మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 02 April 2024: FY25 తొలి రోజును అద్భుతంగా ప్రారంభించిన ఇండియన్ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు, గ్లోబల్ మార్కెట్ల సిగ్నల్స్‌ను అనుసరించి ఈ రోజు (మంగళవారం) కొంత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. విస్తృత మార్కెట్‌లో, మిడ్ & స్మాల్ క్యాప్ స్టాక్స్ నిన్న సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాయి. 2024 మార్చి నెలలో GST వసూళ్లు 11.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి, ఇది రెండో అత్యధిక మొత్తం. అంతకుముందు, 2023 ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. తాజా గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థలో బలాన్ని సూచిస్తున్నాయి.
ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 60 పాయింట్లు లేదా 0.27 శాతం గ్రీన్ కలర్‌లో 22,553 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
2022 సెప్టెంబర్ తర్వాత US తయారీ రంగం మొదటిసారిగా పెరిగిందని డేటా రావడంతో, అగ్రరాజ్యంలో ముందస్తు రేటు తగ్గింపు ఆశలు సన్నగిల్లాయి. US ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కనిపిస్తోంది కాబట్టి రేటు తగ్గింపు త్వరలో ప్రారంభం కాకపోవచ్చని విశ్లేషకులు నమ్ముతున్నారు. దీంతో సోమవారం US మార్కెట్లు లోయర్ సైడ్‌లో ముగిశాయి. డౌ జోన్స్ 0.6 శాతం, S&P 500 0.2 శాతం క్షీణించగా, నాస్‌డాక్ 0.1 శాతం పెరిగింది.
ఆసియా మార్కెట్లలో.. ఈ ఉదయం తైవాన్ 1 శాతం ఎగబాకగా, నికాయ్, కోస్పి ఫ్లాట్ నోట్‌లో ట్రేడ్ అయ్యాయి.
అమెరికాలో బెంచ్‌మార్క్ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ కొద్దిగా పెరిగి 4.30 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $88 సమీపానికి చేరాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఆదిత్య బిర్లా ఫ్యాషన్: ABFRL నుంచి 'మధుర ఫ్యాషన్ & లైఫ్‌స్టైల్' వ్యాపారాన్ని విడదీసి, సెపరేట్ ఎంటిటీగా లిస్ట్ చేయడానికి కంపెనీ బోర్డ్ కంపెనీ ఆమోదముద్ర వేసింది.
హీరో మోటోకార్ప్: 2024 మార్చి నెలలో 4,90,415 యూనిట్ల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 5.57 శాతం క్షీణత. మొత్తం FY24లో 56,21,455 యూనిట్లను అమ్మింది, ఇది 5.49 శాతం YoY జంప్.
ఇన్ఫోసిస్: 2020-21 మదింపు సంవత్సరానికి (వడ్డీతో సహా) ఆదాయ పన్ను విభాగం నుంచి రూ.341 కోట్ల టాక్స్ డిమాండ్ నోటీస్ అందుకుంది.
TVS మోటార్స్: మార్చి నెలలో 12 శాతం YoY పెరుగుదలతో మొత్తం 3,54,592 వాహన యూనిట్లను విక్రయించింది. మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 12 శాతం పెరిగి 3,44,446 యూనిట్లకు చేరాయి. దేశీయ విక్రయాల్లో 8 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం FY24లో 4.19 మిలియన్ యూనిట్ల మొత్తం సేల్స్‌తో, రికార్డు స్థాయిలో 14 శాతం YoY వృద్ధిని సాధించింది.
అశోక్ లేలాండ్: ఈ కంపెనీ మొత్తం సేల్స్ మార్చిలో 4 శాతం YoY తగ్గి 22,866 యూనిట్లకు పడిపోయాయి.
మారుతి సుజుకి ఇండియా: 2023 మార్చి నెలలోని 1,54,148 యూనిట్లతో పోలిస్తే, MSIL మొత్తం ఉత్పత్తి 2024 మార్చి నాటికి 1,66,730 యూనిట్లుగా ఉంది.
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సోమవారం నాడు, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ను తనలో విలీనం చేసుకుంది. ఫిన్‌కేర్ SFB మాజీ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ యాదవ్, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిప్యూటీ CEOగా బాధ్యతలు తీసుకున్నారు.
టెలికాం డేటా: 2024 జనవరిలో రిలయన్స్ జియో 4.17 మిలియన్ల మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను యాడ్ చేసుకుంది. భారతి ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్యను 7.52 లక్షలకు పెరిగింది. వొడాఫోన్ ఐడియా 1.52 మిలియన్ల వైర్‌లెస్ వినియోగదార్లను కోల్పోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: కళ్లెం వదిలిన గుర్రంలా పసిడి - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి