Stocks Watch Today, 20 April 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - ఇవాళ HCL Tech ఫలితాలు
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
Stock Market Today, 20 April 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 39 పాయింట్లు లేదా 0.22 శాతం గ్రీన్ కలర్‌లో 17,692 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: HCL టెక్, CICI ప్రు లైఫ్, సైయంట్, లక్ష్మి ఆర్గానిక్ ఇండస్ట్రీస్. వీటిపై మార్కెట్ దృష్టి ఉంటుంది.
HCL టెక్: TCS, ఇన్ఫోసిస్ నుంచి నిరాశాజనక Q4 ఫలితాల తర్వాత, HCL టెక్నాలజీస్ ఈ రోజు నాలుగో త్రైమాసిక ఫలితాలతో మార్కెట్ ముందుకు వస్తోంది. మొదటి రెండు కంపెనీల ఫలితాల మ్యూటెడ్ రిజల్ట్స్ నేపథ్యంలో, హెచ్‌సీఎల్ టెక్ స్టాక్‌ను మార్కెట్ ఇప్పటికే డిస్కౌంట్ చేసింది.
టాటా కమ్యూనికేషన్స్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా కమ్యూనికేషన్స్ ఏకీకృత కన్సాలియేటెడ్ నికర లాభం 11% తగ్గి రూ. 326 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ. 365 కోట్లుగా ఉంది.
ICICI సెక్యూరిటీస్: ఐసీఐసీఐ సెక్యూరిటీస్, 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 263 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నివేదించింది. గత సంవత్సరం ఇదే కాలంలోని లాభం రూ. 340 కోట్లతో పోలిస్తే ఈసారి 23% తగ్గింది.
మాస్టెక్: మార్చి త్రైమాసికంలో రూ. 73 కోట్ల నికర లాభాన్ని ఈ కంపెనీ నివేదించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 709 కోట్లుగా ఉంది.
అదానీ పోర్ట్స్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డెట్ సెక్యూరిటీల మొదటి & పాక్షిక బైబ్యాక్‌ను పరిశీలించేందుకు అదానీ పోర్ట్స్ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 22న (శనివారం) సమావేశం కానుంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: ఫారిన్ ఎక్స్ఛేంజ్‌లో డీల్ చేయడానికి ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు RBI నుంచి అనుమతి లభించింది.
అల్ట్రాటెక్ సిమెంట్: పాటలీపుత్రలోని గ్రైండింగ్ యూనిట్ సామర్థ్యాన్ని మరో 2.2 mtpa పెంచే పనులు ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయితే, బ్రౌన్ ఫీల్డ్ విస్తరణ 4.7 mtpaకి చేరుతుందని అల్ట్రాటెక్ సిమెంట్ ప్రకటించింది.
NBCC: పుదుచ్చేరిలో రూ. 207 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను NBCC (ఇండియా) దక్కించుకుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO)/ రైట్స్ ఇష్యూ/ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్/ ప్రిఫరెన్షియల్ ఇష్యూ లేదా ఏదైనా ఇతర మోడ్ లేదా వీటిలో కొన్నింటి కాంబినేషన్ ద్వారా రూ. 7,500 కోట్ల వరకు మూలధనాన్ని సమీకరించే ప్రతిపాదనను పరిశీలించడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డైరెక్టర్ల బోర్డు ఈ నెల 24న (సోమవారం) సమావేశం అవుతుంది.
టాటా మోటార్స్: టాటా మోటార్స్ అనుబంధ కంపెనీ JLR, తన ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా, వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్ పౌండ్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.