By: ABP Desam | Updated at : 18 Sep 2023 08:28 AM (IST)
స్టాక్స్ టు వాచ్ - 18 సెప్టెంబర్ 2023
Stock Market Today, 18 September 2023: గ్లోబల్ పీర్స్‌ను అనుసరించి దేశీయ ఈక్విటీలు విజయాల పరంపరను కొనసాగించవచ్చు. ప్రస్తుత వారంలో, మార్కెట్ దిశను నిర్దేశించే ఫెడ్ పాలసీ ఫలితాలపై మార్కెట్ ఫోకస్ ఉంటుంది.
US స్టాక్స్ పతనం
చిప్‌మేకర్లు వినియోగదార్ల డిమాండ్‌పై ఆందోళనల చెందడంతో శుక్రవారం US స్టాక్స్ బాగా తగ్గాయి.
ఆసియా షేర్లు అప్రమత్తం
ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సమావేశాలు ఈ వారంలో ఉండడంతో ఆసియా షేర్లు సోమవారం జాగ్రత్తతో ప్రారంభమయ్యాయి. ప్రపంచ వడ్డీ రేటు దృక్పథాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.
గిఫ్ట్ నిఫ్టీ
ఇవాళ ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 22 పాయింట్లు లేదా 0.11 శాతం గ్రీన్ కలర్‌లో 20,188 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్/నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
వేదాంత: రొటీన్ రీఫైనాన్సింగ్‌లో భాగంగా, ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDలు) జారీ ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ రోజు సమావేశం అవుతుంది.
రెస్టారెంట్ బ్రాండ్స్: ICICI ప్రుడెన్షియల్ లైఫ్, నోమురా, గోల్డ్‌మన్ సాక్స్, సొసైటీ జెనరల్, టాటా MF, సిటీ గ్రూప్, అవెండస్‌తో సహా మార్క్యూ ఫండ్స్ శుక్రవారం బ్లాక్ డీల్స్ ద్వారా రెస్టారెంట్ బ్రాండ్స్‌లో వాను కైవసం చేసుకున్నాయి.
జెన్సోల్ ఇంజినీరింగ్: స్కార్పియస్ ట్రాకర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 54.38%ను జెన్సోల్ ఇంజినీరింగ్ కొనుగోలు చేసింది. దీంతో స్కార్పియస్ ఇప్పుడు జెన్సోల్ అనుబంధ సంస్థగా మారింది.
ఇండియన్ ఆయిల్: హిందుస్థాన్ ఉర్వరాక్ అండ్ రసాయన్‌లో రూ.904 కోట్ల అదనపు పెట్టుబడిని ఇండియన్ ఆయిల్ ఆమోదించింది.
HAL: HAL నుంచి అనుబంధ పరికరాలు సహా 12 Su-30MKI ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఏవియానిక్స్ అప్‌గ్రేడేషన్‌తో డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) ఆమోదం తెలిపింది.
BEL: వివిధ పరికరాల సరఫరా కోసం కొచ్చిన్ షిప్‌యార్డ్ నుంచి 2,118.57 కోట్ల రూపాయల ఆర్డర్‌ను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) అందుకుంది.
టెక్స్‌మాకో రైల్: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.1,000 కోట్ల వరకు సమీకరించే ప్రతిపాదనకు ఈ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
టాటా స్టీల్: వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్ సైట్‌ను డీకార్బనైజ్ చేయడంలో సాయపడేందుకు UK టాటా స్టీల్‌లోకి 500 మిలియన్ పౌండ్లను ($621 మిలియన్లు) టాటా స్టీల్ పంప్ చేయనుంది.
వొడాఫోన్ ఐడియా: 2022 వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్ వార్షిక వాయిదాల్లో భాగంగా, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌కు (DoT) 1701 కోట్ల రూపాయలను వొడాఫోన్ ఐడియా చెల్లించింది.
అదానీ ఎనర్జీ: BSE ఫైలింగ్ ప్రకారం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రమోటర్లు ఆగస్టు 16 - సెప్టెంబర్ 14 కాలంలో కంపెనీలో వాటాను 70.41% నుంచి 72.56%కు పెంచుకున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: యూపీఐ ఏటీఎంను ఉపయోగించడం సురక్షితమేనా?, FAQs సమాధానాలు ఇవిగో...
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?
Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే
Bank Locker Rule: లాకర్‌లో దాచిన ఆస్తి మొత్తానికి బ్యాంక్ బాధ్యత ఉండదు, కొత్త రూల్స్ గురించి తెలుసుకోండి
Latest Gold-Silver Price 30 September 2023: పసిడి పతనం కంటిన్యూస్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Rs 2000 Notes: రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి ఈ రోజే లాస్ట్ డేట్, ఈ గడువు పొడిగిస్తారా?
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>