Stocks To Watch 16 October 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' HDFC Bank, DMart, Tata Motors
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 16 October 2023: ఐటీ ఆదాయాల్లో ఆకర్షణ లేకపోవడం, ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా శుక్రవారం మన మార్కెట్ వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసింది. ఈ వారంలో, కొన్ని కీలక బ్యాంక్‌లు Q2 రిజల్ట్స్ ప్రకటిస్తున్నాయి, ఫైనాన్షియల్స్ మీద మార్కెట్ ఫోకస్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ రేట్ల పెరుగుదల, ఇజ్రాయెల్ వివాదం కూడా మార్కెట్ డైరెక్షన్‌ను డిసైడ్ చేస్తాయి.
మిశ్రమంగా US స్టాక్స్
S&P 500, నాస్‌డాక్ శుక్రవారం లోయర్ సైడ్‌లో ముగిశాయి. సెంటిమెంట్ తగ్గడం, మిడిల్ ఈస్ట్ వివాదం వినియోగదార్లను రిస్కీ బెట్స్ వైపు నడిపించాయి.
ఆసియా షేర్లు పతనం
ముడి చమురు బ్యారెల్‌కు $90 పైకి చేరింది, ఈక్విటీస్ బలహీనంగా ఉన్నాయి. డాలర్ స్థిరంగా ఉంది. గాజాలో పెరుగుతున్న హింస ఇజ్రాయెల్-హమాస్ పరిధికి మించి విస్తరిస్తుందేమోనని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.
ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 22 పాయింట్లు లేదా 0.11 శాతం గ్రీన్ కలర్‌లో 19,722 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Q2 FY24 ఫలితాలను ఈ రోజు ప్రకటించనున్న కంపెనీలు: HDFC బ్యాంక్, గ్రాసిమ్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ICICI సెక్యూరిటీస్. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
డీమార్ట్: అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీమార్ట్) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 623 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, ఇది ఏడాది ప్రాతిపదికన (YoY) 9% పైగా తగ్గింది.
దాల్మియా భారత్: సెకండ్ క్వార్టర్‌లో దాల్మియా భారత్ రూ. 124 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది, రూ. 3,149 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: తన రెండు అనుబంధ సంస్థలు - ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌కు సంబంధించిన అకౌంట్స్ బుక్స్ మీద విచారణ కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు అందుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది.
పెర్సిస్టెంట్ సిస్టమ్స్: అయోన్ బెనర్జీని కంపెనీ చీఫ్ స్ట్రాటజీ అండ్ గ్రోత్ ఆఫీసర్‌గా పెర్సిస్టెంట్ సిస్టమ్స్ నియమించింది, అక్టోబర్ 13, 2023 నుంచి ఇది వర్తిస్తుంది.
టాటా మోటార్స్: IPOకి ముందు, టాటా టెక్నాలజీస్‌లో 9.9% వాటాను సుమారు రూ.1,614 కోట్లకు మాతృ సంస్థ టాటా మోటార్స్ అమ్ముతోంది. TPG రైజ్ క్లైమేట్ ఈ లావాదేవీలో దాదాపు 9% వాటాను కైవసం చేసుకుంటుంది. ఈ ప్రకారం టాటా టెక్నాలజీస్ విలువ రూ. 16,300 కోట్లు ($2 బిలియన్లు).
టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్: Q2లో, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ రూ.136 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 9% తగ్గి రూ. 1,734 కోట్లకు పరిమితమైంది.
బజాజ్ ఫైనాన్స్: మోసాలకు సంబంధించిన సరైన పర్యవేక్షణ లేనందుకు బజాజ్ ఫైనాన్స్‌పై RBI రూ. 8.50 లక్షల పెనాల్టీ విధించింది.
RBL బ్యాంక్: RBI జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు RBL బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ 64 లక్షల రూపాయల పెనాల్టీని విధించింది.
ఇండియన్ ఆయిల్: పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం, ఎన్‌టీపీసీ జాయింట్ వెంచర్‌లో ఇండియన్ ఆయిల్ రూ.1,660 కోట్లు పెట్టుబడి పెడుతోంది.
డెల్టా కార్పొరేషన్: డెల్టా కార్ప్‌కు చెందిన డెల్టాటెక్ గేమింగ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ నుంచి రూ. 6,384 కోట్ల GST డిమాండ్ నోటీస్ అందుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ₹5 లక్షల 'ఫ్రీ' ఇన్సూరెన్స్ మీ జేబులోనే ఉంది, మీకే ఆ విషయం తెలీట్లా!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial