Stocks To Watch 06 September 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' NBCC, Jio Financial
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
![Stocks To Watch 06 September 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' NBCC, Jio Financial Stocks to watch today 06 September 2023 todays stock market todays share market Stocks To Watch 06 September 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' NBCC, Jio Financial](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/06/3161abeb650226f414e565fd195ffdda1693967696744545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Today, 06 September 2023: ఇవాళ, ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి, హాంకాంగ్ మార్కెట్ అండర్‌పెర్ఫార్మ్ చేస్తోంది. నిన్న వాల్ స్ట్రీట్ లోయర్ సైడ్‌లో ముగియడం ఆసియా షేర్లు మిశ్రమంగా స్పందించేందుకు కారణం. చమురు ధరల పెరుగుదల, ట్రెజరీ ఈల్డ్స్‌లో పెరిగిన బలం కలిసి ఆసియన్ ఈక్విటీలను కింద పడేశాయి.
జపాన్ నికాయ్ 225 ఇండెక్స్ 166.65 పాయింట్లు జంప్ చేయగా, దక్షిణ కొరియా KOSPI, ఆస్ట్రేలియా ASX 200 0.5% చొప్పున పతనమయ్యాయి. ఆస్ట్రేలియా రిజర్వ్ బ్యాంక్, కీలక వడ్డీ రేట్లను వరుసగా మూడో నెలలోనూ 4.10%గా ఉంచడంతో ఆస్ట్రేలియన్ షేర్లు ఫోకస్‌లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్ మార్కెట్ 0.9% నష్టపోయింది, చైనా మెయిన్‌బోర్డ్ షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ కూడా 0.4% పడింది.
ఇండియా విషయానికి వస్తే... గత సెషన్‌లో, సెన్సెక్స్ & నిఫ్టీ 50 లాభాల్లో క్లోజ్ అయ్యాయి. మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ స్టాక్స్ మెరుగైన పనితీరు కనబరిచాయి.
గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY), ఉదయం 8.00 గంటల సమయానికి 08 పాయింట్లు లేదా 0.04 శాతం రెడ్ కలర్‌లో 19,662 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
NBCC: కేరళ స్టేట్ హౌసింగ్ బోర్డుతో NBCC ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 2,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ కోసం ఈ ఒప్పందం కుదిరింది. అగ్రిమెంట్‌లో భాగంగా కోచిలో 17.9 ఎకరాల భూమిని అభివృద్ది చేస్తారు.
జియో ఫైనాన్షియల్: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లను రేపటి (సెప్టెంబర్ 7, 2023) నుంచి నిఫ్టీ 50 సహా NSEకి చెందిన ఇతర సూచీల నుంచి తొలగిస్తారు.
గెయిల్: గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుల్లో కొందరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా డబ్బులు చేతులు మారిన ఆరోపణలకు సంబంధించి, రూ.50 లక్షల లంచం కేసులో గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.
జెన్సోల్ ఇంజినీరింగ్: ఈ ఇంజినీరింగ్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీని ఆమోదించింది. పెట్టుబడిదార్లు కలిగి ఉన్న ప్రతి ఒక్క షేర్‌కు, అదనంగా మరో రెండు బోనస్ షేర్లను కంపెనీ జారీ చేస్తుంది.
వెల్‌స్పన్ ఇండియా: తక్షణ భవిష్యత్తులో దాదాపు రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టాలని వెల్‌స్పన్ ఇండియా ప్లాన్ చేసిందని కంపెనీ సీఈవో & ఎండీ ప్రకటించారు.
పటేల్ ఇంజినీరింగ్: మధ్యప్రదేశ్‌లో ఉన్న తమ జాయింట్ వెంచర్ రూ.1,275.30 కోట్ల ఆర్డర్ పొందినట్లు పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (PEL) తెలిపింది.
హిందూజా గ్లోబల్: హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ (HGS), UKలోని గవర్నమెంట్ డిజిటల్ సర్వీస్‌తో (GDS) వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. GOV.UK One Login యూజర్లకు కాంటాక్ట్ సెంటర్ సపోర్టును ఇది అందిస్తుంది.
ఇది కూడా చదవండి: మూడు సెక్టార్ల మీదే ముకేష్ అంబానీ మాస్టర్ ప్లాన్స్, లక్షల కోట్ల పెట్టుబడులు వాటిలోకే!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)