By: ABP Desam | Updated at : 01 Dec 2022 08:34 AM (IST)
Edited By: Arunmali
స్టాక్స్ టు వాచ్ టుడే - 01 డిసెంబర్ 2022
Stocks to watch today, 01 December 2022: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 69 పాయింట్లు లేదా 0.37 శాతం గ్రీన్ కలర్‌లో 18,986 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): యూకే రైల్ డేటా మార్కెట్‌ప్లేస్‌ను డిజైన్ చేయడం, డెవలప్ చేయడం, అమలు చేయడం, నిర్వహించడం కోసం రైల్ డెలివరీ గ్రూప్ (Rail Delivery Group) నుంచి ఒక ఆర్డర్‌ను ఈ IT మేజర్ గెలుచుకుంది. TCS, RDG మధ్య ఒప్పంద వ్యవధి ఆరు సంవత్సరాలు. నిర్వహణ కాలం పొడిగింపునకు అవకాశం కూడా ఉంది.
విప్రో: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కోసం విప్రో డేటా ఇంటెలిజెన్స్ సూట్‌ను ఈ IT కంపెనీ ప్రారంభించింది. ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫామ్‌ల నుంచి క్లౌడ్‌కి మారడానికి నమ్మకమైన, సురక్షిత మార్గాలను ఈ సూట్ అందిస్తుంది.
అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (NCDలు) జారీ ద్వారా రూ. 105 కోట్ల వరకు నిధుల సమీకరణ కోసం ఈ హాస్పిటల్ చైన్ బోర్డు ఆమోదం పొందింది. ఒక్కొక్కటి రూ. 10 లక్షల ముఖ విలువ కలిగిన 1,050 NCDలన కంపెనీ జారీ చేస్తుంది.
జొమాటో: చైనీస్ ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాకు చెందిన అలీపే సింగపూర్ (Alipay Singapore), 26,28,73,507 జొమాటో షేర్లను లేదా 3.07 శాతం వాటాను సగటు ధర రూ. 62.06 చొప్పున బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా విక్రయించింది. డీల్ వాల్యూ రూ. 1,631.39 కోట్లు. కామాస్ ఇన్వెస్ట్‌మెంట్స్ 9.80 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది.
NMDC: ప్రభుత్వ యాజమాన్యంలోని మైనింగ్ మేజర్ ఇనుప ఖనిజం ధరను టన్నుకు రూ. 300 పెంచింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఖనిజ ఎగుమతుల మీద సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించిన కొన్ని రోజుల్లోనే ఈ కంపెనీ నుంచి ప్రకటన వచ్చింది.
హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్: కొలంబియాలో కొత్త మల్టీ లింగ్వల్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ హబ్‌ను తెరిచింది. ఈ సెంటర్ కోసం మొదట 150 మందిని నియమించుకోవాలని యోచిస్తోంది. ఇంగ్లీష్, స్పానిష్, పోర్చుగీస్ కస్టమర్లకు ఈ కేంద్రం సేవలు అందిస్తుంది.
అదానీ పవర్: DB పవర్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు విద్యుత్ కేంద్రం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు, రూ. 7,017 కోట్ల డీల్ పూర్తి చేయడానికి గడువును ఈ నెల (డిసెంబర్) 31 వరకు పొడిగించింది. నవంబర్ 30తో డీల్ పూర్తి చేయాలని తొలుత అనుకున్నా, మరో నెల రోజులు పొడిగించింది.
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్: RBI తరపున ప్రభుత్వ వ్యవహారాలు చేపట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా తమకు ఆథరైజేషన్ వచ్చిందని ఈ ప్రైవేట్ రంగ రుణదాత తెలిపింది. గవర్నమెంట్ ఏజెన్సీ బిజినెస్ చేపట్టడానికి TMBని RBI ఏజెన్సీ బ్యాంక్‌గా నియమించేలా, రెండు బ్యాంకుల మధ్య ఒప్పందం కుదిరింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
Budget 2023: బడ్జెట్- 2023లో పన్ను మినహాయింపులు- 1992 నాటి పన్ను శ్లాబ్ ఫొటో వైరల్
Income Tax Slab: గుడ్‌న్యూస్! రూ.7 లక్షల వరకు 'పన్ను' లేదు - పన్ను శ్లాబుల్లో భారీ మార్పులు!
New Tax Regime: రూ.9 లక్షల ఆదాయానికి రూ.45వేలు, రూ.15 లక్షలకు రూ.1.5 లక్షలే టాక్స్!
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం
Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం