అన్వేషించండి

ICICI Bank Result: 17 శాతం పెరిగిన ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభం, ఒక్కో షేర్‌కు రూ.10 డివిడెండ్‌

రిపోర్టింగ్‌ టైమ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ మెరుగైన గ్రాస్‌ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (GNPAs) నిష్పత్తి 2.30% YoY నుంచి 2.16 శాతానికి తగ్గింది.

ICICI Bank Q4 FY24 Result: 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (Q4 FY24) ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.10,708 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, YoY ప్రాతిపదికన ఇది 17.4% జంప్‌. ఈ ఏడాది కాలంలో నికర వడ్డీ ఆదాయం, అడ్వాన్సులు పెరగడం + కేటాయింపులు తగ్గడం వల్ల బ్యాంక్ లాభం పెరిగింది. QoQ (Q3 FY24) ప్రాతిపదికన లాభం రూ.10,272 కోట్ల నుంచి 4.24% పెరిగింది.

వడ్డీ ఆదాయం - వడ్డీయేతర ఆదాయం
బ్యాంక్‌ ఆర్థిక ఫలితాల్లో చూడాల్సిన కీలక అంశం నికర వడ్డీ ఆదాయం (NII). ఐసీఐసీఐ బ్యాంక్‌ NII YoYలో 8.1% పెరిగింది, రూ.19,093 కోట్ల నుంచి రూ.17,667 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (NIM) మాత్రం 4.40 శాతానికి దిగి వచ్చింది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో ఇది 4.90%గా ఉంది, FY24 మూడో త్రైమాసికంలో 4.43%గా నమోదైంది. వడ్డీయేతర ఆదాయం 15.7% జంప్‌తో రూ.5,930 కోట్లకు పెరిగింది.

కస్టమర్ల నుంచి వసూలు చేసిన ఫీజ్‌ నాలుగో త్రైమాసికంలో 12.5% వృద్ధితో రూ.4,830 కోట్ల నుంచి రూ.5,436 కోట్లకు పెరిగింది.

లోన్లు - డిపాజిట్లు
జనవరి-మార్చి కాలంలో బ్యాంక్‌ ఇచ్చిన అడ్వాన్స్‌లు 16.8% YoY పెరిగి రూ. 11.84 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం రుణాల్లో రిటైల్ లోన్లు 19.4% పెరిగి రూ.6,662.61 కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తిగత రుణాలు 32.5% పెరిగి రూ.1,166.77 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్‌ పోర్ట్‌ఫోలియోలో రిటైల్‌ లోన్ల వాటా 54.9%.

ఐసీఐసీఐ బ్యాంక్‌ డిపాజిట్లలో మంచి గ్రోత్‌ కనిపించింది. 2024 మార్చి 31 నాటికి, ఈ రుణదాత డిపాజిట్లు  19.6% YoY జంప్‌తో రూ. 14.13 లక్షల కోట్లకు పెరిగాయి. వీటిలో... టర్మ్/ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 27.7% YoY గ్రోత్‌తో రూ.8.17 లక్షల కోట్లకు చేరాయి. కరెంట్ ఖాతా డిపాజిట్లు 13% & సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు 4.6% పెరిగాయి.

ఆస్తుల నాణ్యత
బ్యాంక్‌ రిపోర్ట్‌ కార్డ్‌లో చూడాల్సిన మరో కీలక అంశం ఆస్తుల నాణ్యత. రిపోర్టింగ్‌ టైమ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌ మెరుగైన గ్రాస్‌ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (GNPAs) నిష్పత్తి 2.30% YoY నుంచి 2.16 శాతానికి తగ్గింది. దీని అర్ధం మొండి బకాయిలు తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తుల (NNPAs) నిష్పత్తిని చూస్తే.. 2023 డిసెంబర్ 31 నాటికి 0.44% నుంచి 2024 మార్చి 31 నాటికి 0.42 శాతానికి మెరుగుపడింది. మొత్తం కేటాయింపులు (Provisions) రూ.1619 కోట్ల నుంచి 50% పైగా తగ్గి రూ.718 కోట్లకు పరిమితమయ్యాయి, ఇది చాలా మంచి పరిణామం.

డివిడెండ్‌
ICICI బ్యాంక్‌ ప్రతి ఈక్విటీ షేరుకు రూ.10 డివిడెండ్‌ ప్రకటించింది. త్వరలో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో (AGM) వాటాదార్ల నుంచి దీనికి ఆమోదం తీసుకుంటారు. ఆ తర్వాత డివిడెండ్‌ ప్రయోజనం షేర్‌హోల్డర్లకు అందుతుంది.

శుక్రవారం (26 ఏప్రిల్‌ 2024) ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ ధర స్వల్పంగా 0.53% తగ్గి రూ.1,107.15 దగ్గర ఆగింది. గత 6 నెలల కాలంలో దాదాపు 20%, గత 12 నెలల కాలంలో దాదాపు 21%, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 10% పైగా లాభాలను ఈ స్టాక్‌ అందించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: స్టాక్‌ మార్కెట్‌లో సొమ్ములు సంపాదించే ఛాన్స్‌! - వచ్చే వారం 3 ఐపీవోలు, 4 లిస్టింగ్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Deeksha Diwas Telangana: 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇదే రోజు ఏం జరిగింది? దీక్షా దివస్‌కు స్ఫూర్తి ఏంటీ?
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
Embed widget