Stock Market News: నిన్న ఆకాశంలోకి ఎగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. నేడేమో!
Stock Market closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం నష్టపోయాయి. బెంచ్‌మార్క్ సూచీలు గరిష్ఠ స్థాయిల నుంచి కాస్త కిందకు దిగొచ్చాయి. కెళ్లాయి.
Stock Market closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం నష్టపోయాయి. రెండు రోజుల లాభాలకు స్వల్ప విరామం లభించింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం, మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టడంతో బెంచ్‌మార్క్ సూచీలు గరిష్ఠ స్థాయిల నుంచి కాస్త కిందకు దిగొచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 18,000 దిగువన ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 435 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకు షేర్లు నష్టపోగా పవర్ షేర్లు దూసుకెళ్లాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 60,611 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 50,786 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. మధ్యాహ్నం వరకు సూచీ ఫ్లాట్‌గానే కదలాడింది. ఐరోపా మార్కెట్లు తెరుచుకున్న తర్వాత ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగాయి. 60,786 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సూచీ 60,067 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. చివరకు 435 పాయింట్ల నష్టంతో 60,176 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 18,053 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,080 వద్ద ఓపెనైంది. 18,095 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రయాలు పెరగడంతో 17,921 వద్ద ఇంట్రాడే కనిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరికి 96 పాయింట్ల నష్టంతో 17,957 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ 38,731 వద్ద మొదలైంది. 37,935 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,731 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 567 పాయింట్ల నష్టంతో 38,067 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభపడగా 24 నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, టాటా కన్జూమర్ షేర్లు లాభపడ్డాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, పవర్ సూచీలు 1-3 శాతం లాభపడగా బ్యాంకు సూచీలు నష్టపోయాయి.
Market Update for the day.
— NSE India (@NSEIndia) April 5, 2022
See more> https://t.co/xBwq7m50qD https://t.co/F6ARBV5yep #NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/j6UO4RNJ0d
Shri @pragyanojha, Former Indian Cricketer along with Shri @SameerPatil2019, CBO, @BSEIndia and Shri Bhavin Thakkar, Ranji Player pose with the #BSEBull during visit to @BSEIndia on 5th April, 2022 pic.twitter.com/r5ye4G6UFQ
— BSE India (@BSEIndia) April 5, 2022