Stock Market News: వరుసగా 3వ రోజు నష్టాలే! ఆందోళనలో ఇన్వెస్టర్లు
Stock Market Closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) వరుసగా మూడో సెషన్లో నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,500 దిగువన ముగిసింది.
Stock Market Closing bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) వరుసగా మూడో సెషన్లో నష్టపోయాయి. ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోనూ జోష్ లేదు. బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,500 దిగువన ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 237 పాయింట్ల మేర నష్టపోయింది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,576 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,910 వద్ద లాభాల్లో మొదలైంది. కాసేపటికే సూచీ ఒడుదొడుకులకు లోనైంది. 58,291 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 59,003 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 237 పాయింట్ల నష్టంతో 58,338 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 17,530 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,599 వద్ద ఓపెనైంది. ఉదయం 17,663 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత 17,457 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. చివరికి 54 పాయింట్ల నష్టంతో 17,475 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ 37,887 వద్ద మొదలైంది. 37,408 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,988 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 284 పాయింట్ల నష్టంతో 37,463 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభపడగా 28 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్, యూపీఎల్, ఐటీసీ, సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్ఆయంక్, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్ నష్టపోయాయి. రియాల్టీ, ఆటో, బ్యాంక్ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 0.5 శాతం ఎగిశాయి.
Market Update for the day.
— NSE India (@NSEIndia) April 13, 2022
See more> https://t.co/xBwq7mn9EL https://t.co/F6ARBUOvcp #NSEUpdates #Nifty #Nifty50 #NSEIndia #StockMarketIndia #ShareMarket #MarketUpdates pic.twitter.com/k5SWuwPPqs
Did you know?
— NSE India (@NSEIndia) April 13, 2022
NSE Clearing as an Approved Intermediary launched the Securities Lending & Borrowing Scheme on April 21, 2008.
In this post, we highlight a few features of this scheme #NSE #StockMarket #ShareMarket #Trading pic.twitter.com/4jUQ23KAma
13.04.2022
— BSE India (@BSEIndia) April 13, 2022
Pre-opening sensex update pic.twitter.com/tnXtaI996J