By: ABP Desam | Updated at : 27 Jan 2022 04:38 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్
ఉదయం రక్తమోడిన స్టాక్ మార్కెట్లు కాస్త కోలుకున్నాయి! భారీగా పతనమైన కీలక సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. సమీప భవిష్యత్తులో అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు పెరుగుతాయన్న వార్తలు రావడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గురువారం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. దాంతో మార్కెట్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 1400 పాయింట్ల వరకు పతనమై తిరిగి పుంజుకుంది. నిప్టీ 17,200 దిగువన ముగిసింది.
క్రితం సెషన్లో 57,858 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,317 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. అక్కడ్నుంచి దిగువ ముఖంగానే సూచీ పయనించింది. 56,439 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యా్హ్నం సమయంలో దాదాపుగా 1400 పాయింట్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత పుంజుకోవడంతో చివరికి 581 పాయింట్ల నష్టంతో 57,276 వద్ద ముగిసింది.
మంగళవారం 17,277 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,062 వద్ద గ్యాప్‌డౌన్ ఆరంభమైంది. ఆ తర్వాత అథో ముఖంగా పయనిస్తూ 16,866 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఒకానొక దశలో దాదాపుగా 410 పాయింట్ల మేర పతనమైంది. ఆ తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో చివరికి 167 పాయింట్ల నష్టంతో 17,110 వద్ద ముగిసింది.
Also Read: LIC Profits: ఎల్‌ఐసీ బంపర్ ప్రాఫిట్..! ఐపీవో ముందు అదరగొట్టిన బీమా సంస్థ
బ్యాంక్ నిఫ్టీ ఒడుదొడుకుల మధ్య కొనసాగింది. ఉదయం 37,058 వద్ద మొదలైన సూచీ 37,012 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 500 పాయింట్ల మేర నష్టపోయింది. ఆ తర్వాత టర్న్ అరౌండ్ కావడంతో 275 పాయింట్ల లాభంతో 37,058 వద్ద ముగిసింది.
నిఫ్టీలో 15 కంపెనీలు లాభాల్లో 35 నష్టాల్లో ముగిశాయి. సిప్లా, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎస్‌బీఐ, మారుతీ లాభాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, విప్రో నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు సూచీ ఏకంగా ఐదు శాతం లాభపడింది. ఆటో, బ్యాంకు సూచీలు ఒక శాతం వరకు లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, ఫార్మా, ఐటీ సూచీలు 1-3 శాతం వరకు పతనం అయ్యాయి.
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!
Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్ చేతిలో ఉంటే చాలు, టాప్ క్లాస్ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి
Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్ మార్క్ దాటిన ఫారెక్స్ నిల్వలు
Latest Gold-Silver Prices Today: ఒక్కసారిగా పడిపోయిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>