By: ABP Desam | Updated at : 13 Apr 2022 12:26 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Stock Market News: పుంజుకొనే సంకేతాల్లేవ్! ఫ్లాట్‌గా నిఫ్టీ, సెన్సెక్స్
Stock Market @ 12 PM: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,483 వద్ద ట్రేడ్‌అవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 134 పాయింట్ల మేర నష్టాల్లో ఉంది.
BSE Sensex
క్రితం సెషన్లో 58,576 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,910 వద్ద లాభాల్లో మొదలైంది. కాసేపటికే సూచీ ఒడుదొడుకులకు లోనైంది. 58,425 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 59,003 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 134 పాయింట్ల నష్టంతో 58,438 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 17,530 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,599 వద్ద ఓపెనైంది. ఉదయం 17,663 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత 17,493 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ప్రస్తుతం 42 పాయింట్ల నష్టంతో 17,487 వద్ద ట్రేడ్ అవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ 37,887 వద్ద మొదలైంది. 37,541 ఇద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 37,988 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 182 పాయింట్ల లాభంతో 37,564 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభపడగా 26 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, అపోలో హాస్పిటల్స్, యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, సన్ ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్స్, టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ మాత్రం ఒక శాతం లాభపడ్డాయి.
Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్ రూల్స్
Cryptocurrency Prices Today: బిట్కాయిన్ ఓకే! ఆ రెండో కాయిన్ మాత్రం భయపెడుతోంది!
Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Top Gainer May 22, 2022 : స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
Top Loser Today May 22, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి
Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల