By: ABP Desam | Updated at : 12 Nov 2021 04:14 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Stock Market
మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం కళకళలాడాయి. ద్రవ్యోల్బణం ఆందోళనలను పక్కన పెట్టిన మదుపర్లు తమ దృష్టిని కంపెనీల త్రైమాసిక ఫలితాలపై నిలిపారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, స్థూల ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల సంకేతాలు రావడంతో కొనుగోళ్లకు దిగారు. దాంతో సెన్సెక్స్ 762, నిఫ్టీ 229 పాయింట్లు లాభపడ్డాయి.
క్రితం రోజు 59,919 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయం భారీ గ్యాప్ అప్‌తో 60,248 వద్ద మొదలైంది. క్రమంగా పెరుగుతూ 60,750 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివరికి 762 పాయింట్ల లాభంతో 60,686 వద్ద ముగిసింది. ఉదయం 17,997 వద్ద మొదలైన నిఫ్టీ 18,123 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 226 పాయింట్ల లాభంతో 18,102 వద్ద ముగిసింది. 1556 కంపెనీల షేర్లు లాభపడగా 1628 నష్టాల్లో కొనసాగాయి.
టెక్ మహీంద్రా, హిందాల్కో ఇండస్ట్రీస్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్ లాభపడ్డాయి. బజాజ్ ఆటో, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, యాక్సిస్ బ్యాంక్, ఐఓసీ నష్టపోయాయి. ఇక ఐటీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు రాణించాయి.
మార్కెట్ కబుర్లు
* లేటెంట్ వ్యూ అనలిటిక్స్ ఐపీవోకు స్పందన విపరీతంగా లభించింది. మదుపర్లు షేర్లు దక్కించుకొనేందుకు పోటీపడుతున్నారు. ఇష్యూలో 1.75 కోట్ల షేర్లు విక్రయిస్తుండగా 505 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి. ఆఖరి రోజు 288 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
* వొడాఫోన్ ఐడియా నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2021 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.7132 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. రుణం కోసం ఎస్‌బీఐని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి.
* పేటీఎం షేరు ధరను రూ.2150గా నిర్ణయించారు. నవంబర్ 18న మార్కెట్లో ఈ కంపెనీ నమోదు అవుతోంది. ఐపీవోకు 1.89 రెట్ల స్పందన లభించింది.
* హిందాల్కో ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం రూ.3417 కోట్లు నమోదైంది. మొత్తం రాబడి రూ.47,665 కోట్లుగా ఉంది.
Also Read: EPFO Update: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు శుభవార్త! మరణ పరిహారం రెట్టింపు చేసిన కేంద్రం.. ఎంత వస్తుందంటే?
Also Read: RBI on Cryptocurrency: క్రిప్టోపై ఆర్‌బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..! ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్
Petrol-Diesel Price, 23 May: శుభవార్త! నేడూ తగ్గిన ఇంధన ధరలు, ఈ ఒక్క నగరంలోనే పెరుగుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త ఊరట! నేటి ధరలు ఇవీ - నగరాల వారీగా రేట్లు ఇలా
Buying Gold: ధర తగ్గిందని బంగారం కొంటున్నారా? మొదట ఇన్‌కం టాక్స్ రూల్స్ తెలుసుకోండి
Business Idea: ఈ పూలు పూయించండి! లక్షల్లో ఆదాయం పొందండి!
LIC Home Loan: తక్కువ వడ్డీకి హోమ్ లోన్ కావాలా? ఈ ఒక్కటీ ఉంటే LIC ఇచ్చేస్తోంది!
Monkeypox Virus Advisory: మంకీపాక్స్ వైరస్ ముప్పుపై కేంద్రం అప్రమత్తం- కేరళ, మహారాష్ట్ర, దిల్లీకి కీలక ఆదేశాలు
Major Movie: 'మేజర్' లేటెస్ట్ అప్డేట్ - మే 24 నుంచే స్క్రీనింగ్
MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్
Vizag Bride Death: పెళ్లి పీటలపై వధువు మృతి కేసులో వీడిన చిక్కుముడి - అసలు నిజం కనిపెట్టేసిన పోలీసులు