Share Market Opening: ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో కొనుగోళ్ల తుపాను - బుల్లిష్ మూడ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ
Stock Markets: ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి నిఫ్టీ 190 పాయింట్లు లేదా 0.98% పెరిగి 19,633.55 స్థాయి వద్ద; సెన్సెక్స్ 610 పాయింట్లు లేదా 0.94% పెరిగి 65,543.86 వద్ద కదులుతున్నాయి.
Indian Stock Market Opening Today on 15 November 2023: ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ రోజు ఫుల్ రైజింగ్‌లో ఓపెన్ అయింది. సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా జంప్‌తో, నిఫ్టీ 200 పాయింట్ల భారీ లాభంతో పాజిటివ్ నోట్‌లో ప్రారంభమైంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో కనిపించిన బలమైన ఊపు బ్యాంకింగ్ రంగానికి దన్నుగా మారింది.
ఈ రోజు స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ ఇలా ఉంది..
గత సెషన్‌లో (సోమవారం, 13 నవంబర్ 2023) 64,994 స్థాయి వద్ద ముగిసిన BSE సెన్సెక్స్, ఈ రోజు 527 పాయింట్లు లేదా 0.81 శాతం పెరుగుదలతో 65,461 స్థాయి వద్ద ప్రారంభమైంది. సోమవారం 19,444 వద్ద క్లోజయిన NSE నిఫ్టీ, ఈ రోజు 207.85 పాయింట్లు లేదా 1.07 శాతం వృద్ధితో 19,651 వద్ద ఓపెన్ అయింది.
యూఎస్, ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సిగ్నల్స్ సెంటిమెంట్‌ను బలపరచడంతో, ఈ రోజు మన మార్కెట్ ఓపెనింగ్ ట్రేడ్‌లో, BSEలో 2,829 షేర్లు ట్రేడ్ అయ్యాయి. వాటిలో 2,121 షేర్లు బుల్లిష్‌గా ఉన్నాయి. 550 షేర్లు క్షీణించగా, 158 షేర్లు ఎలాంటి మార్పు లేకుండా ట్రేడవుతున్నాయి.
సెన్సెక్స్-నిఫ్టీ షేర్ల పరిస్థితి
మార్కెట్ ప్రారంభ సమయంలో.. సెన్సెక్స్ 30 ప్యాక్‌లోని 25 షేర్లు గ్రీన్ మార్క్‌లో ఉండగా కేవలం 5 స్టాక్స్ మాత్రమే రెడ్ జోన్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లోని 47 స్టాక్స్ పెరుగుతుండగా, 3 స్టాక్స్ క్షీణత చూపుతున్నాయి.
సెక్టోరల్ ఇండెక్స్ చిత్రం
నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు గ్రీన్ జోన్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియాల్టీ గరిష్టంగా 2.42 శాతం పెరిగింది. మెటల్ షేర్లు 2 శాతం, ఐటీ షేర్లు 1.94 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. PSU బ్యాంక్ 1.10 శాతం, నిఫ్టీ 1 శాతం అప్‌సైడ్‌తో కనిపించాయి.
ఈ రోజు ఉదయం 10 గంటల సమయానికి నిఫ్టీ 190 పాయింట్లు లేదా 0.98% పెరిగి 19,633.55 స్థాయి వద్ద; సెన్సెక్స్ 610 పాయింట్లు లేదా 0.94% పెరిగి 65,543.86 వద్ద కదులుతున్నాయి.
పెరిగిన US స్టాక్స్
మంగళవారం సెషన్‌లో, US కీలక సూచీలు S&P 500, నాస్‌డాక్ విపరీతంగా లాభపడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్ 27 తర్వాత అతి పెద్ద వన్-డే లాభాలను సృష్టించాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇక పెంచదు అనే అభిప్రాయానికి, మార్కెట్ అంచనా వేసిన దాని కంటే తగ్గిన ద్రవ్యోల్బణం డేటా మద్దతుగా నిలిచింది.
ఆసియా స్టాక్స్‌లో ర్యాలీ
ద్రవ్యోల్బణం చల్లబడడం వల్ల ఫెడరల్ రిజర్వ్ దూకుడుకు బ్రేక్ పడిందన్న అంచనాలతో ఆసియాలోని స్టాక్స్ ర్యాలీ చేశాయి. గత సెషన్‌లో జారిపోయిన ట్రెజరీ ఈల్డ్స్, డాలర్ వాల్యూ ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: భారత అతిథ్యానికి వెలుగు రేఖ ఒబెరాయ్ ఇక లేరు, ఆయన జీవిత విశేషాలు, ఘనతలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial