అన్వేషించండి

Share Market Today: ఫెడ్‌ ఇచ్చిన ధైర్యంతో కొత్త గరిష్టాలకు స్టాక్‌ మార్కెట్లు - రికార్డ్‌ స్థాయిలో ఓపెనింగ్స్‌

Share Market Opens At Record High: ముందు నుంచీ ఊహించిన విధంగానే జరిగింది, మన స్టాక్ మార్కెట్ బలంగా ప్రారంభమైంది. యుఎస్ ఫెడ్ నిర్ణయంతో భారతీయ మార్కెట్లలో బాణసంచా పేలింది.

Stock Markets At Record Levels: అమెరికన్ సెంట్రల్‌ బ్యాంక్‌ యూఎస్‌ ఫెడ్‌ (US FED) నాలుగేళ్ల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడంతో స్టాక్‌ మార్కెట్లు పండగ చేసుకుంటున్నాయి. యూఎస్‌ ఫెడ్‌, అమెరికాలో వడ్డీ రేట్లను 0.50% మేర కోసేసింది. ఫెడ్‌ ఇచ్చిన బూస్ట్‌తో, భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు (గురువారం, 19 సెప్టెంబర్‌ 2024), ఊహించిన విధంగానే బుల్లిష్‌గా ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ఫెడ్ నిర్ణయ తక్షణ ప్రభావం భారతీయ మార్కెట్ల స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాన సూచీలు BSE సెన్సెక్స్, NSE నిఫ్టీ రికార్డు గరిష్ట స్థాయుల్లో ఓపెన్‌ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా కొత్త శిఖరాన్ని తాకింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు వేగంగా పరుగులు పెడుతున్నాయి. HDFC బ్యాంక్ షేర్లు రూ. 1711 పైన ట్రేడ్‌ అవుతున్నాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..

గత సెషన్‌లో (బుధవారం) 82,948 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 410.95 పాయింట్లు లేదా 0.50 శాతం పెరిగి 83,359.17 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. బుధవారం 25,377 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 109.50 పాయింట్లు లేదా 0.43 శాతం పెరిగి 25,487.05 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.

యునైటెడ్ స్పిరిట్స్ వాటా ఈ రోజు కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ కొత్త మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలపడంతో, మద్యానికి సంబంధించిన షేర్లు పెరిగే అవకాశం ఉంది.

సెన్సెక్స్ షేర్ల అప్‌డేషన్‌
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 29 స్టాక్స్ పెరిగితే, ఒక్క స్టాక్ మాత్రమే తగ్గింది. సెన్సెక్స్ షేర్లు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉన్నారు. బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు మాత్రమే పడిపోతున్నాయి. 

నిఫ్టీ షేర్ల స్టేటస్‌
నిఫ్టీ 50 ప్యాక్‌లోని 44 షేర్లు లాభపడగా, 6 మాత్రమే క్షీణతలో ఉన్నాయి. 

బ్యాంక్ నిఫ్టీ జీవితకాల గరిష్ఠ స్థాయి 53,357.70గా ఉంది. ఈ రోజే ఇది ఆల్ టైమ్ హైని అధిగమించే అవకాశం ఉంది. మార్కెట్‌ ప్రారంభ నిమిషాల్లో బ్యాంక్‌ నిఫ్టీ 53,353.30 వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని నమోదు చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లో అన్ని షేర్లు పెరుగుతున్నాయి. HDFC బ్యాంక్ 1 శాతం పైగా జంప్‌ చేసింది.

మార్కెట్ ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత.. BSE సెన్సెక్స్‌ 643.43 పాయింట్లు లేదా 0.78 శాతం జంప్‌తో 83,591.66 స్థాయి వద్ద ట్రేడవుతోంది. NSE నిఫ్టీ 183.30 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 25,560.85 వద్ద ట్రేడవుతోంది.

మార్కెట్ ప్రారంభమైన 35 నిమిషాల తర్వాత, ఉదయం 09.50 గంటలకు, BSE సెన్సెక్స్ 693.50 పాయింట్లు లేదా 0.84% పెరిగి 83,641.73 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ కూడా 172.25 పాయింట్లు లేదా 0.68% లాభంతో 25,549.80 దగ్గర ట్రేడవుతోంది.

అదే సమయానికి, సెన్కెస్‌ 83,773.61 వద్ద లైఫ్‌ టైమ్‌ హైని ‍(Sensex at fresh all-time high); నిఫ్టీ 25,611.95 వద్ద జీవితకాల గరిష్టాన్ని (Nifty at fresh all-time high) నమోదు చేశాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: అమెరికాలో వడ్డీ రేట్ల కోత, నాలుగేళ్ల తర్వాత చారిత్రాత్మక నిర్ణయం, ఇప్పుడు RBI ఏం చేస్తుంది? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget