Share Market Opening: స్టాక్ మార్కెట్‌లో మిక్స్‌డ్ ఓపెనింగ్ - కళ కోల్పోయిన మెటల్స్, ఆటో షేర్లు
Share Market Updates: స్టాక్ మార్కెట్ మిశ్రమ ట్రెండ్‌లో ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్ & నిఫ్టీలో ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది. సరైన మార్గనిర్దేశనం కోసం ప్రధాన సూచీలు ఎదురు చూస్తున్నాయి.
Stock Market News Updates Today 08 Oct: ఇండియన్ స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఈ రోజు (మంగళవారం, 08 అక్టోబర్ 2024) మిక్స్‌డ్ ట్రెండ్‌లో ఓపెన్ అయ్యాయి. BSE సెన్సెక్స్ 223 పాయింట్లు తక్కువలో, నిఫ్టీ 36 పాయింట్లు ఎక్కువలో ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే ఇతర ఆసియా మార్కెట్లలోని బలహీనత ప్రభావానికి గురయ్యాయి. ఈ రోజు ఓపెనింగ్ టైమ్‌లో చైనా మార్కెట్‌లు పుంజుకోవడంతో మన మార్కెట్లు రెడ్ జోన్‌లోకి జారిపోయి ప్రారంభ లాభాలను వదులుకున్నాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..
గత సెషన్‌లో (సోమవారం) 81,050 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 223 పాయింట్లు లేదా 0.28 శాతం తగ్గి 80,826.56 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. సోమవారం 24,795 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 36 పాయింట్లు లేదా 0.15 శాతం పెరిగి 24,832.20 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
షేర్ల పరిస్థితి
మార్కెట్ ఓపెనింగ్ బెల్ కొట్టినప్పుడు, BSE సెన్సెక్స్‌లో సగానికి పైగా స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాప్ లూజర్స్‌లో... టాటా స్టీల్ 3.35 శాతం క్షీణించింది. టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టాప్ గెయినర్స్‌లో... మహీంద్రా అండ్ మహీంద్రా 1.57 శాతంతో ముందంజలో ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ దీనిని ఫాలో అవుతున్నాయి.
నిఫ్టీ ప్యాక్‌లోని 50 షేర్లలో 29 స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 1.33 శాతం పెరిగింది. హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, లార్సెన్ & టూబ్రో టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇక్కడ కూడా టాటా స్టీల్ 3.57 శాతం పడిపోయింది. టాటా మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, JSW స్టీల్, BPCL ఆ తర్వాతి స్థానాల్లో నేలచూపులు చూస్తున్నాయి.
రంగాల వారీగా...
అన్ని రంగాల్లో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా నష్టపోయింది, 2.80 శాతం ఆవిరైంది. ఆటో, ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ సూచీలు కూడా లోయర్ సైడ్‌లో ట్రేడవుతున్నాయి. వీటికి విరుద్ధంగా.. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు హైయ్యర్ సైడ్‌లో ట్రేడవుతున్నాయి.
బ్రాడర్ మార్కెట్లలో.. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 0.13 శాతం, BSE స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ ఫ్లాట్‌గా ఉంది.
ఉదయం 09.50 గంటలకు, సెన్సెక్స్ 292.77 పాయింట్లు లేదా 0.36% పెరిగి 81,342.77 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి నిఫ్టీ 84.55 పాయింట్లు లేదా 0.34% పెరిగి 24,880.30 దగ్గర ట్రేడవుతోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియాలో మొయిన్‌ల్యాండ్ చైనా మార్కెట్లు వారం రోజుల సెలవు తర్వాత మంగళవారం ఓపెన్ అయ్యాయి. చైనాకు చెందిన CSI 300 ఇండెక్స్ 10 శాతం పైగా కంటే ఎక్కువే లాభపడింది. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 6 శాతానికి పైగా పెరిగింది. అయితే, ఈ లాభాలు క్రమంగా ఆవిరవుతున్నాయి. జపాన్‌కు చెందిన నికాయ్ 225 ఇండెక్స్ 1.01 శాతం క్షీణించగా, హాంగ్ కాంగ్‌లోని హ్యాంగ్ సెంగ్ సూచీ దాదాపు 4 శాతం క్షీణించింది. ఆస్ట్రేలియా స్టాక్స్ బెంచ్‌మార్క్ 0.08 శాతం, దక్షిణ కొరియా కోస్పీ 0.78 శాతం చొప్పున క్షీణించాయి.
సోమవారం, వాల్‌స్ట్రీట్‌లో S&P 500 ఫ్యూచర్స్ 0.03 శాతం, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 0.01 శాతం నష్టపోయాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ఇది కూడా చదవండి: సెలవుల్లో టూర్ వెళుతున్నారా, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా, అది ఎందుకు ముఖ్యమో తెలుసా?