అన్వేషించండి

Stock Market Today: పెరిగిన మిడిల్‌ ఈస్ట్‌ టెన్షన్‌ - కీలక స్థాయుల దిగువన ఓపెన్‌ అయిన మార్కెట్లు

ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్ రంగాలు లాభాల్లో ఓపెన్‌ అయ్యాయి.

Stock Market Opening 18 October 2023: మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధం విస్తరించొచ్చన్న భయాలు, మార్కెట్‌ ఊహించినదానికి కంటే మెరుగ్గా వచ్చిన US రిటైల్ విక్రయాల డేటాతో దీర్ఘకాలం పాటు అధిక వడ్డీ రేట్లు ఉంటాయన్న ఆందోళనలు సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయి. దీంతో, ఈ రోజు (బుధవారం, 18 అక్టోబర్‌ 2023) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు స్వల్పంగా తగ్గాయి.

ఉదయం 9.19 గంటలకు BSE సెన్సెక్స్ 129 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణించి 66,298 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు లేదా 0.14% తగ్గి 19,784 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్ స్టాక్స్‌లో... బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, M&M, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్ రెడ్‌ కలర్‌లో ఈ రోజును ప్రారంభించాయి. JSW స్టీల్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ITC గ్రీన్‌లో ఓపెన్‌ అయ్యాయి.

Q2లో ఏకీకృత నికర లాభంలో పెరుగుదలను పోస్ట్ చేసినప్పటికీ, L&T టెక్నాలజీ సర్వీసెస్ స్టాక్‌ దాదాపు 4% లోయర్‌ సైడ్‌లో ట్రేడవుతోంది. దీర్ఘకాల డీల్ డెసిషన్ సైకిల్స్, స్థూల ఆర్థిక సవాళ్లతో FY24 వృద్ధి అంచనా తగ్గడం దీనికి కారణం.

సెప్టెంబరు త్రైమాసిక లాభంలో గ్రోత్‌ రిపోర్ట్‌ చూపిన టాటా ఎలెక్సీ షేర్లు 2.3% పెరిగాయి.

సెక్టార్ల వారీగా చూస్తే... నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.4% క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్ 0.2% పడిపోయింది. ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ & గ్యాస్ రంగాలు లాభాల్లో ఓపెన్‌ అయ్యాయి.

నిఫ్టీ మిడ్‌క్యాప్100 0.14% లాభపడగా, స్మాల్‌క్యాప్100 0.55% లాభపడింది.

గ్లోబల్ మార్కెట్లు
చైనా ఉద్దీపన చర్యలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడొచ్చన్న సూచనలతో ఆసియా మార్కెట్లు బుధవారం స్థిరంగా ఉన్నాయి. అయితే గాజా ఆసుపత్రిలో పేలుడు ఆశలను దెబ్బతీసింది. జపాన్‌ నికాయ్‌ 0.18% పడిపోయింది. చైనా షాంఘై కాంపోజిట్ 0.6% క్షీణించగా, కొరియా కోస్పి 0.14% పెరిగింది.

మంగళవారం US స్టాక్స్ దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 33,997 వద్ద స్థిరపడింది. S&P 500 కూడా 4,373 వద్ద ఫ్లాట్‌గా ఉంది. టెక్-హెవీ నాస్‌డాక్ కాంపోజిట్ 0.3% పెరిగి 13,533కి చేరుకుంది.

FII/DII ట్రాకర్
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIలు), మంగళవారం, నికరంగా రూ.264 కోట్ల విలువైన ఇండియన్‌ షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదార్లు (DIIలు) రూ.113 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.

పెరిగిన చమురు ధరలు
గాజా ఆసుపత్రి పేలుడులో వందలాది మంది మరణంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెరిగాయి, ఆ ప్రాంతం నుంచి చమురు సరఫరాపై ఆందోళనలు తలెత్తాయి. దీంతో ముడి చమురు రేట్లు ఒకేసారి 2% పైగా పెరిగాయి.

కరెన్సీ వాచ్
ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభంలో, అమెరికన్‌ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి 2 పైసలు పెరిగి 83.23 డాలర్లకు చేరుకుంది. డాలర్ ఇండెక్స్ 0.07% తగ్గి 106.17 స్థాయికి చేరుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget