Stock market news: జొమాటో మాత్రమే హీరో, మిగిలిన కంపెనీల ఇన్వెస్టర్లు ఇప్పటికీ ఏడుస్తున్నారు
2021లో, ప్రైమరీ మార్కెట్ నుంచి సెకండరీ మార్కెట్‌లోకి వచ్చిన నవతరం కంపెనీలు (new-age companies) ఎక్కువగా సవాళ్లు ఎదుర్కొన్నాయి.
Stock market news in telugu: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా స్టాక్ మార్కెట్ అరంగేట్రం చేసే షేర్లు ఆ తర్వాత హీరోలు కావచ్చు, జీరోలుగా మిగలొచ్చు. సదరు కంపెనీ చేసే బిజినెస్, ఔట్‌పుట్‌కు ఉన్న డిమాండ్, వ్యూహాలు, దాని భవిష్యత్ చిత్రం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా స్టాక్స్ పెర్ఫార్మ్ చేస్తాయి.
2021లో, ప్రైమరీ మార్కెట్ (IPO Market) నుంచి సెకండరీ మార్కెట్‌లోకి వచ్చిన నవతరం కంపెనీలు (new-age companies) ఎక్కువగా సవాళ్లు ఎదుర్కొన్నాయి. విపరీతమైన ఒడుదొడుకులు ఎదుర్కొన్నాక, ఒక్క జొమాటో (Zomato share price 2023) మాత్రమే హీరోగా నిలిచింది. మిగిలిన స్టాక్స్ ఇప్పటికీ నెగెటివ్ రిటర్న్స్‌లోనే ఉన్నాయి.
జొమాటో, స్టాక్ ధర ఇష్యూ ధర (Zomato IPO issue price) ఇప్పటి వరకు 49% పెరిగింది. అదే సమయంలో... కార్‌ట్రేడ్ టెక్, వన్97 కమ్యూనికేషన్స్ (Paytm) మాత్రం వరుసగా 51%, 57% పడిపోయాయి. వీటితో పోలిస్తే గుడ్డిలో మెల్ల అన్నట్లు... PB ఫిన్‌టెక్ (Policybazaar) 18%, FSN ఇ-కామర్స్ వెంచర్స్ (Nykaa) 8% తగ్గాయి.
ఇష్యూ నుంచి ఇప్పటి వరకు న్యూ-ఏజ్ కంపెనీల స్టాక్ పెర్ఫార్మెన్స్:
స్టాక్ పేరు: జొమాటో (Zomato share price)
IPO ఇష్యూ ధర: రూ. 76
చివరి ముగింపు ధర: రూ. 113
ఇష్యూ ధర నుంచి మార్పు: 49% గెయిన్స్
స్టాక్ పేరు: కార్‌ట్రేడ్ టెక్ (Zomato share price)
IPO ఇష్యూ ధర: రూ 1,618
చివరి ముగింపు ధర: రూ. 787.65
ఇష్యూ ధర నుంచి మార్పు: 51% తగ్గుదల
స్టాక్ పేరు: FSN ఈ-కామర్స్ వెంచర్స్ (Nykaa share price)
IPO ఇష్యూ ధర: రూ. 187 (బోనస్ ఇష్యూ కారణంగా సర్దుబాటు చేసిన ప్రైస్ ఇది, వాస్తవ ధర రూ. 1125)
చివరి ముగింపు ధర: రూ 172
ఇష్యూ ధర నుంచి మార్పు: 8.24% క్షీణత
స్టాక్ పేరు: వన్97 కమ్యూనికేషన్స్ (Paytm share price)
IPO ఇష్యూ ధర: రూ 2.150
చివరి ముగింపు ధర: రూ. 923
ఇష్యూ ధర నుంచి మార్పు: 57% నెగెటివ్ రిటర్న్స్
స్టాక్ పేరు: పీబీ ఫిన్‌టెక్ (PB Fintech share price)
IPO ఇష్యూ ధర: రూ 980
చివరి ముగింపు ధర: రూ. 804
ఇష్యూ ధర నుంచి మార్పు: 18% పతనం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
మరో ఆసక్తికర కథనం: ఈ రోజు స్టాక్ మార్కెట్‌కు సెలవు, MCXలో ఒక పూట ట్రేడింగ్