Stock Market Update: అమాంతం పెరిగిన టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ, నం.1 ర్యాంక్‌లో రిలయన్స్
గత వారంలో, BSE సెన్సెక్స్ 2,344.41 పాయింట్లు లేదా 3.47 శాతం పెరిగింది.
Stock Market News in Telugu: గత వారం ఇండియన్ స్టాక్ మార్కెట్ వరద గోదారిలా ఉరకలెత్తింది, కొత్త రికార్డులు సృష్టించింది. 05 డిసెంబర్ 2023న, సెన్సెక్స్ తొలిసారిగా 69,000 మైలురాయిని దాటింది. గత వారంలో, దేశంలోని టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ రూ.3,04,477.25 కోట్లు పెరిగింది. BSEలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ (Total market cap of listed companies on BSE) రూ.343.5 లక్షల కోట్లకు పెరిగింది.
గత వారంలో, BSE సెన్సెక్స్ 2,344.41 పాయింట్లు లేదా 3.47 శాతం పెరిగింది.
అత్యధికంగా పెరిగిన HDFC బ్యాంక్, LIC షేర్లు
స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం, గత వారంలో, ప్రైవేట్ రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ (HDFC Bank market cap) రూ. 74,076.15 కోట్లు పెరిగి రూ.12,54,664.74 కోట్లకు చేరుకుంది. దేశంలోని అతి పెద్ద బీమా కంపెనీ ఎల్‌ఐసీ మార్కెట్ క్యాప్ (LIC market cap) కూడా రూ. 65,558.6 కోట్లు పెరిగి రూ. 4,89,428.32 కోట్లకు చేరుకుంది. గురువారం ఎల్‌ఐసీ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దీంతో బీమా కంపెనీ రూ.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ కూడా రూ. 45,466.21 కోట్లు పెరిగి రూ.7,08,836.92 కోట్లకు చేరుకుంది.
లాభాల్లో టీసీఎస్, రిలయన్స్, ఎస్‌బీఐ
దేశంలో అతి పెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ మార్కెట్ క్యాప్ (TCS market cap) గత వారంలో రూ.42,732.72 కోట్లు పెరిగి రూ.13,26,918.39 కోట్లకు చేరుకుంది. అదే కాలంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (RIL market cap) రూ. 42,454.66 కోట్లు పెరిగి రూ. 16,61,787.10 కోట్లకు చేరుకుంది. స్టేట్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (SBI market cap) రూ.37,617.24 కోట్లు పెరిగి రూ.5,47,971.17 కోట్లకు చేరుకుంది. ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ (Infosys market cap) రూ.15,916.92 కోట్లు పెరిగి రూ.6,18,663.93 కోట్లకు చేరుకుంది.
మార్కెట్ విలువ తగ్గిన కంపెనీలు
హిందుస్థాన్ యూనిలీవర్ మార్కెట్ విలువ (HUL market cap) రూ.9,844.79 కోట్లు తగ్గి రూ.5,92,414.19 కోట్లకు పరిమితమైంది. భారతి ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ (Bharti Airtel market cap) కూడా రూ.8,569.98 కోట్లు తగ్గి రూ.5,61,896.90 కోట్లకు దిగి వచ్చింది. ఐటీసీ క్యాపిటలైజేషన్ (ITC market cap) కూడా రూ.935.48 కోట్లు తగ్గి రూ.5,60,223.61 కోట్లకు చేరుకుంది.
దేశంలో అత్యంత విలువైన కంపెనీలు (most valuable companies in India)
రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. ఆ తర్వాత టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ ఉన్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.