News
News
X

Adani Group Stocks: అదానీ స్టాక్స్‌లో మరో లక్ష కోట్ల చిల్లు, మూడు రోజుల్లో ₹5 లక్షల కోట్లు ఆవిరి

ఇన్వెస్టర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి కాబట్టే షేర్ల పతనం కొనసాగుతోంది. దీంతో, గ్రూప్‌ మార్కెట్‌ విలువ కూడా భారీగా తగ్గింది.

FOLLOW US: 
Share:

Adani Group Stocks: వరుసగా మూడో ట్రేడింగ్‌ రోజున (సోమవారం, 30 జనవరి 2023) కూడా అదానీ గ్రూప్‌ (Adani group) షేర్లు మట్టి కరిచాయి. ఒక్క అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises) తప్ప మిగిలిన చాలా కంపెనీల స్టాక్స్‌ అన్నీ కనిష్ట స్థాయులకు పడిపోయాయి.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) రిపోర్ట్‌ తప్పులతడక అని; తమ అభివృద్ధిని చూసి ఓర్వలేక కుట్రపూరితంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారని; ఇది భారతదేశంపై దాడి అని; స్టాక్స్‌ షార్ట్-సేల్ చేయడానికి & అనైతిక లాభాలను సంపాదించడానికి ఆ షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ వేసిన పథకమే సదరు రిపోర్ట్‌ అంటూ.. అదానీ గ్రూప్‌ 413 పేజీల సుదీర్ఘ వివరణ ఇచ్చినా వాటాదారుల్లో భయాలు తొలగిపోలేదు. అదానీ కంపెనీల్లో ఏ లొసుగులు లేకపోతే హిండెన్‌బర్గ్‌ ఎందుకు కలగజేసుకుంటుందంటూ మార్కెట్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇన్వెస్టర్లలో అనుమానాలు అలాగే ఉన్నాయి కాబట్టే షేర్ల పతనం కొనసాగుతోంది. దీంతో, గ్రూప్‌ మార్కెట్‌ విలువ కూడా భారీగా తగ్గింది.

ప్రస్తుతానికి 4 స్టాక్స్‌ సేఫ్‌
గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో (బుధవారం, శుక్రవారం) అదానీ స్టాక్స్ మార్కెట్ విలువ రూ. 4.2 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయుంది. ఇవాళ మాత్రం, గౌతమ్ అదానీ సామ్రాజ్యానికి చెందిన 10 కౌంటర్లలో నాలుగు ఎలుగుబంట్ల పిడికిలి నుంచి బయటపడ్డాయి.

ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి... ACC, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ (Adani Ports), అంబుజా సిమెంట్స్ ‍‌(Ambuja Cements) షేర్లు గ్రీన్ జోన్‌లో ట్రేడవుతున్నాయి, అయితే ప్రారంభ లాభాలను కోల్పోతూ వస్తున్నాయి.

మరోవైపు, అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy), అదానీ ట్రాన్స్‌మిషన్ ‍‌(Adani Transmission), అదానీ టోటల్ గ్యాస్‌ ‍‌(Adani Total Gas) ఇన్వెస్టర్లక నొప్పి మామూలుగా లేదు. ఇవి 20% వరకు క్షీణించాయి. మిగిలిన మూడు స్టాక్స్‌ - అదానీ పవర్ (Adani Power), ఎన్‌డీటీవీ ‍‌(NDTV), అదానీ విల్మార్ (Adani Wilmar) 5% లోయర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి.

అదానీ ట్రాన్స్‌మిషన్ ఇవాళ మరో 19% క్షీణించి 52 వారాల కనిష్టానికి రూ. 1,625 వద్దకు చేరుకోగా, అదానీ గ్రీన్ కూడా 19% నష్టపోయి రూ. 1.202.55 వద్ద కొత్త 52 వారాల కనిష్టానికి చేరుకుంది.

మూడు రోజుల్లో 5 లక్షల కోట్లు ఆవిరి
కేవలం ఈ మూడు ట్రేడింగ్ సెషన్ల వ్యవధిలోనే అదానీ గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (market capitalisation) రూ. 5.17 లక్షల కోట్లు తగ్గింది. ఇవాళ (సోమవారం) ఒక్క సెషన్‌లోనే అదానీ స్టాక్స్‌ ఇన్వెస్టర్లు రూ. లక్ష కోట్లు నష్టపోయారు.

మరోవైపు.. శుక్రవారం (జనవరి 27, 2023) నుంచి ప్రారంభమైన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రస్తుత షేరు ధర, ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (FPO) ప్రైస్‌ బ్యాండ్‌ రూ. 3,112-3,276 FPO కంటే కిందకు చేరింది. అయినా, FPO తేదీలను లేదా ప్రైస్‌ బ్యాండ్‌ను మార్చేది లేదని అదానీ గ్రూప్‌ ప్రకటించింది. శుక్రవారం ప్రారంభమైన రూ. 20,000 కోట్ల FPO రేపటితో (మంగళవారం, జనవరి 31, 2023) ముగుస్తుంది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 30 Jan 2023 01:23 PM (IST) Tags: Adani Wilmar Adani Group Stocks Adani Enterprises Adani Stocks Adani Group M-cap Adani Group market cap

సంబంధిత కథనాలు

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్‌! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు!

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Stock Market: ఊగిసలాడిన సూచీలు - రూపాయి 18 పైసలు జంప్‌!

Stock Market: ఊగిసలాడిన సూచీలు - రూపాయి 18 పైసలు జంప్‌!

Avalon IPO: ఏప్రిల్‌ 3 నుంచి అవలాన్‌ ఐపీవో - షేర్‌ ధర ఎంతో తెలుసా?

Avalon IPO: ఏప్రిల్‌ 3 నుంచి అవలాన్‌ ఐపీవో - షేర్‌ ధర ఎంతో తెలుసా?

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.50వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Cryptocurrency Prices: 24 గంటల్లో రూ.50వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

టాప్ స్టోరీస్

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed :  ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ