అన్వేషించండి

High Dividend Stocks: బ్యాంక్‌ వడ్డీ కంటే ఎక్కువ డివిడెండ్‌ ఆదాయం అందించిన 9 స్టాక్స్‌

బ్యాంక్‌ వడ్డీ కంటే ఎక్కువ రాబడి ఆర్జించడానికి ఎక్కువ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

High Dividend Yield Stocks: మన దేశంలోని పెద్ద బ్యాంకులు గరిష్టంగా 7.10% ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బ్యాంక్‌ వడ్డీ కంటే ఎక్కువ రాబడి ఆర్జించడానికి ఎక్కువ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, డివిడెండ్ ఈల్డ్‌ శాశ్వతం కాదన్న విషయాన్ని పెట్టుబడిదార్లు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇవి రుణ సాధనాల్లాంటివి (debt instruments) కాదు, మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు డివిడెండ్‌ రాబడిని ప్రభావితం చేస్తాయి. 

ఫిబ్రవరి 22, 2023 నాటికి, BSE 500 లిస్ట్‌లో, 8% పైగా డివిడెండ్ ఈల్డ్‌ ఇచ్చిన టాప్ 9 స్టాక్స్‌ ఇవి:

వేదాంత
2023 ఫిబ్రవరి 22 నాటికి, ఈ కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 14.83% వద్ద ఉంది. గత నెల రోజుల్లో ఈ స్టాక్ దాదాపు 8.34% పడిపోయింది. ప్రస్తుతం ఇది రూ. 303.35 వద్ద ట్రేడవుతోంది. దాని 52-వారాల గరిష్ట స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే ఇది 45.29% ర్యాలీ చేయాలి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 14.75% వద్ద ఉంది. గత నెల రోజుల్లో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టాక్ దాదాపు 6.76% పడిపోయింది. ప్రస్తుతం ఇది రూ. 77.30 వద్ద ట్రేడవుతోంది. దాని 52 వారాల గరిష్ఠ స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే ఇది 17.29% ర్యాలీ చేయాలి.

REC
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 13.64% వద్ద ఉంది. గత నెల రోజుల్లో ఈ కౌంటర్‌ దాదాపు 9.63% నష్టపోయింది. ప్రస్తుతం రూ.112.15 వద్ద ట్రేడవుతోంది. దాని 52 వారాల గరిష్ట స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే దీనికి 12.62% ర్యాలీ అవసరం.

గెయిల్ (ఇండియా)
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 10.47% వద్ద ఉంది. గత నెల రోజుల్లో గెయిల్ షేర్‌ ధర దాదాపు 3.48% పడిపోయింది. ప్రస్తుతం స్టాక్ రూ. 95.55 వద్ద ట్రేడవుతోంది. దాని 52 వారాల గరిష్ఠ స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే ఈ స్క్రిప్‌ 21.02% ర్యాలీ చేయాలి.

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 10.34% వద్ద ఉంది. గత ఒక నెలలో స్టాక్ సుమారు 7.54% పడిపోయింది. ప్రస్తుతం SAIL రూ. 84.60 వద్ద ట్రేడవుతోంది. దాని 52-వారాల గరిష్ట స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే అది 32.74% ర్యాలీ చేయాలి.

సనోఫీ ఇండియా
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 9.07% వద్ద ఉంది. గత నెల రోజుల్లో, స్టాక్ దాదాపు 4.93% పడిపోయింది. ప్రస్తుతం ఇది రూ. 5401.05 వద్ద ట్రేడవుతోంది. అయితే దాని 52 వారాల గరిష్ఠ స్థాయిని మళ్లీ పరీక్షించడానికి ఇది 46.99% ర్యాలీ చేయాలి

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 8.20% వద్ద ఉంది. గత ఒక నెలలో, స్టాక్ దాదాపు 2.66% పడిపోయింది. ప్రస్తుతం PFC షేర్లు రూ. 146.40 వద్ద ట్రేడవుతున్నాయి, అయితే, దాని 52-వారాల గరిష్ట స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే ఈ స్టాక్‌ 10.59% ర్యాలీ చేయాలి.

కోల్ ఇండియా
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 8.03% వద్ద ఉంది. గత నెల రోజుల్లో, స్టాక్ దాదాపు 6.68% పడిపోయింది. ప్రస్తుతం స్టాక్ రూ. 211.80 వద్ద ట్రేడవుతోంది. దాని 52-వారాల గరిష్ట స్థాయిని మళ్లీ పరీక్షించడానికి ఇది 24.32% ర్యాలీ చేయాలి

నేషనల్ అల్యూమినియం కంపెనీ
ఫిబ్రవరి 22 నాటికి కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 8.01% వద్ద ఉంది. గత నెల రోజుల్లో, స్టాక్ దాదాపు 3.22% పడిపోయింది. ప్రస్తుతం ఈ షేరు రూ. 81.15 వద్ద ట్రేడవుతోంది. దాని 52 వారాల గరిష్ఠ స్థాయిని మళ్లీ పరీక్షించాలంటే 63.59% ర్యాలీ చేయాలి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget