Stock Market Crash: స్టాగ్‌ప్లేషన్‌తో ఇన్వెస్టర్లకు వణుకు! సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం
Stock Market Opening Bell on 10 June 2022: ఐటీ షేర్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 200 పాయింట్ల నష్టంతో 16,278, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 714 పాయింట్ల నష్టంతో ..
Stock Market Opening Bell on 10 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అమెరికాలో ప్రతి ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతున్నాయి. దాంతో ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందలేదు. అన్ని సూచీలు విలవిల్లాడుతున్నాయి. ఐటీ షేర్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 200 పాయింట్ల నష్టంతో 16,278, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 714 పాయింట్ల నష్టంతో 54,605 వద్ద కదలాడుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 55,320 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 54,780 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 54,531 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,780 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. పది గంటల ప్రాంతంలో 714 పాయింట్ల నష్టంతో 54,605 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 16,478 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,283 వద్ద ఓపెనైంది. 16,252 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,324 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 200 పాయింట్ల నష్టంతో 16,278 వద్ద కదలాడుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 34,686 వద్ద మొదలైంది. 34,570 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,752 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 445 పాయింట్ల నష్టంతో 34,640 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 9 కంపెనీలు లాభాల్లో 40 నష్టాల్లో ఉన్నాయి. ఏసియన్ పెయింట్స్, టైటాన్, ఐచర్ మోటార్స్, టాటా కన్జూమర్, అల్ట్రాటెక్ సెమ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. విప్రో, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, కొటక్ బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాలు సూచీలు పతనమయ్యాయి. ఐటీ, మెటల్స్, బ్యాంకు సూచీలు ఎక్కువ పడ్డాయి.
View this post on Instagram